తెలంగాణ
Fire Accidents: హైదరాబాద్ లోని రెండు ప్రాంతాల్లో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదాలు.. అమీర్‌ పేట్‌, పాత బస్తీల్లో ఘటనలు.. లక్షల్లో ఆస్తి నష్టం
Rudraహైదరాబాద్ లోని రెండు ప్రాంతాల్లో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఈ ఘటనల్లో లక్షల ఆస్తి నష్టం సంభవించింది. అమీర్‌ పేట్‌, పాత బస్తీల్లో ఈ తెల్లవారుజామున రెండు వేర్వేరు అగ్ని ప్రమాదాలు సంభవించాయి.
Scrutiny of Nominations: నేటి నుంచే నామినేషన్‌ ల స్క్రూటినీ.. 119 నియోజకవర్గాల్లో పరిశీలించనున్న అధికారులు.. ఉపసంహరణకు తుది గడువు ఎప్పుడంటే??
Rudraతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వివిధ పార్టీల అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్‌ లను అధికారులు స్క్రూటినీ చేయనున్నారు. మొత్తం 119 నియోజవర్గాల్లో దాఖలైన నామినేషన్‌ లను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు (ఆర్వోలు) పరిశీలించనున్నారు.
Revanth Reddy Open Challenge: బీఆర్‌ఎస్ ఆ పని చేస్తే కాంగ్రెస్ పోటీ నుంచి తప్పుకుంటుంది! సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి, నామినేషన్లు కూడా విత్ డ్రా చేసుకుంటామని ఓపెన్ ఆఫర్‌
VNSతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కరెంట్ (Power) అంశం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయం విద్యుత్ చుట్టూ తిరుగుతోంది. కరెంటు వ్యవహారంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. తెలంగాణలో వ్యవసాయానికి రోజుకు 24గంటల కరెంట్ (24 hour Power) ఇస్తున్నట్లు నిరూపిస్తే మేము ఎన్నికల్లోనే పోటీ చేయము అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) సవాల్ విసిరారు.
Cheddi Gang Roaming in Tirupathi: తిరుపతివాసులారా అలర్ట్.. నగరంలో మళ్లీ తిరుగుతున్న చెడ్డీగ్యాంగ్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసుల హెచ్చరిక.. రాత్రివేళ కాలింగ్ బెల్‌‌ కొట్టినా, తలుపు తట్టినా స్పందించవద్దంటూ సూచన.. (వీడియో ఇదిగో)
Rudraఏపీలో ఇటీవల భయభ్రాంతులకు గురిచేసిన చెడ్డీగ్యాంగ్ మరోమారు కలకలం రేపింది. తిరుపతి, దాని శివారు ప్రాంతాల్లో ఈ గ్యాంగ్ సంచరిస్తున్నట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.
Telangana Voters List: తెలంగాణ ఓటర్లు 3.26 కోట్లు.. పురుషులు 1.62.. మహిళలు 1.63 కోట్లు.. రాష్ట్రంలో పెరిగిన మహిళా ఓటర్లు.. ఓటరు తుది జాబితా ప్రకటన
Rudraతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలోనే ఈసారి అత్యధికమంది తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, వీరిలో అత్యధికులు మహళలే ఉండటం విశేషం.
Hyderabad Voters List: హైదరాబాద్ ఓటర్స్ లిస్ట్ విడుదల, మొత్తం 15 నియోజకవర్గాల్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే?
VNSగ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని (GHMC) ఫైనల్ ఓటర్ లిస్ట్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ (Voters) విడుదల చేశారు. గ్రేటర్ సిటీలోని 15 సెగ్మెంట్లలో మొత్తం 45లక్షల 36వేల 852 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఇందులో పురుష ఓటర్లు 23 లక్షల 22 వేల 623 ఉండగా, మహిళ ఓటర్లు 22 లక్షల 13వేల 902 ఉన్నారు. ట్రాన్స్ జెండర్స్ 327 ఉండగా, ఎన్ఆర్ఐ ఓటర్లు 883 ఉన్నారని తెలిపారు.
Woman Climbs Light Tower: ప్రధాని మోదీ సభలో హై టెన్షన్, స్తంభం ఎక్కి నినాదాలు చేసిన యువతి, మోదీ విన్నపంతో కిందకు దిగిన యువతి
VNSప్రధాన మంత్రి నరేంద్రమోదీ సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో జరిగిన ఎస్సీ ఉప కులాల విశ్వరూప (SC Vishvaroopa Maha Sabha) మహాసభలో పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై మోదీ (Modi) ప్రసంగిస్తున్న సమయంలో ఓ యువతి.. తీవ్ర భావోద్వేగానికి గురై సభా ప్రాంగణంలో ఉన్న ఫ్లడ్‌లైట్‌ స్తంభం ఎక్కారు.
PM Modi In Hyderabad: దళిత బంధుతో న్యాయం జరగలేదు, రుణమాఫీ చేస్తానని సీఎం కేసీఆర్ రైతులను మోసం చేశారు..ప్రధాని మోదీ విమర్శలు
ahanaదళిత బంధుతో మాదిగలకు న్యాయం జరగలేదు. రుణమాఫీ చేస్తానని సీఎం కేసీఆర్ రైతులను మోసం చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని బీఆర్ఎస్ కాపాడలేకపోయింది. అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ అన్ని విస్మరించింది. కొత్త రాజ్యాంగంతో కేసీఆర్.. అంబేద్కర్‌ను అవమానించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దళిత విరోధులు.. ఆ రెండు పార్టీలతో జాగ్రత్తగా ఉండాలి.-మోడీ
PM Modi, Manda Krishna Madiga Viral Video: ప్రధాని మోడీని కౌగలించుకొని ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురైన మందకృష్ణ మాదిగ
ahanaప్రధాని మోడీ సభా వేదికపై మందకృష్ణ మాదిగను ఆలింగనం చేసుకున్నారు. ప్రధాని మోడీ కౌగలించుకోవడంతో ఒక్కసారిగా మందకృష్ణ మాదిగ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
Chandra Mohan No More: ప్రముఖ నటుడు చంద్ర మోహన్‌ కన్నుమూత.. హైదరాబాద్‌ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
Rudraప్రముఖ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూశారు. హైదరాబాద్‌ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. చంద్రమోహన్ గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు.
Traffic Alert in Hyderabad: నేడు సికింద్రాబాద్‌ కు ప్రధాని మోదీ.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు.. పూర్తి వివరాలు ఇదిగో!
Rudraప్రధాని మోదీ మరోసారి హైదరాబాద్‌ కు వస్తున్నారు. శనివారం సాయంత్రం సికింద్రాబాద్‌ లోని పరేడ్‌ గ్రౌండ్స్‌ లో నిర్వహిస్తున్న అణగారిన వర్గాల విశ్వరూప బహిరంగ సభలో పాల్గొంటారు.
Restrictions On Firecrackers: హైదరాబాద్‌ లో బాణాసంచా కాల్చడంపై ఆంక్షలు, ఈ టైంలో మాత్రమే కాల్చాలంటూ ప్రజలకు సూచించిన హైదరాబాద్ పోలీసులు, భారీ శబ్ధం వచ్చే క్రాకర్స్‌ కాల్చేవారికి సూచనలు
VNSదీపావళి పండుగ నేపథ్యంలో (Diwali) బాణాసంచా కాల్చడంపై (Restrictions On Firecrackers) హైదరాబాద్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ నెల 12 నుంచి 15 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ మేరకు సిటీ పోలీసులు మార్గదర్శకాలను జారీ చేశారు.
Telangana Elections 2023: తెలంగాణలో గుర్తింపు లేని జనసేన పార్టీ, గ్లాస్‌ గుర్తును ఫ్రీ సింబల్‌గానే గుర్తించిన ఎన్నికల కమిషన్
Hazarath Reddyతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తును కేటాయించలేదు. జనసేన వాడుకునే గ్లాస్‌ గుర్తును ఫ్రీ సింబల్‌గానే ఈసీఐ గుర్తించింది. తెలంగాణలో జనసేన గుర్తింపు పార్టీ కాకపోవడంతో ఎన్నికల సంఘం గ్లాస్‌ గుర్తును రిజర్వ్‌ చేయలేదు
HC Notices to Raghavendra Rao: ప్రభుత్వ భూముల్లో కమర్షియల్ కాంప్లెక్స్, టాలీవుడ్‌ డైరెక్టర్‌ రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు
Hazarath Reddyహైదరాబాద్‌ బంజారాహిల్స్‌ షేక్‌పేట పరిధిలో రెండు ఎకరాలు (ఆర్‌కే సినీప్లెక్స్ ఉన్న స్థలం) కేటాయింపును సవాల్ చేస్తూ 2012లో దాఖలైన పిల్‌లో ప్రముఖ సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు , ఆయన సోదరుడు కె. కృష్ణమోహన్‌రావు, ఆయన కుటుంబసభ్యులకు తెలంగాణ హైకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది
Hyderabad Shocker: ప్రేమ వ్యవహారం, యువకుడి ప్రైవేట్ భాగాల్లో కారం చల్లి హత్య చేసిన యువతి కుటుంబ సభ్యులు, హైదరాబాద్‌లో దారుణ ఘటన
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తమ కుమార్తెను ప్రేమించాడన్న కోపంతో యువకున్ని లవర్ కుటుంబ సభ్యులు హత్య చేశారు.
Telangana Election 2023: తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ, ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 15, ఈ సారి ఎంతమంది పోటీలో ఉన్నారంటే..
Hazarath Reddy2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తైంది. నవంబర్‌ 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ మొదలుకాగా.. ఇవాళ మధ్యాహ్నాం 3 గం.తో ముగిసింది. నేడు నామినేషన్ల దాఖలుకు చివరిరోజు కావడంతో ఆర్డీవో ఆఫీస్‌ల వద్ద అభ్యర్థుల కోలాహలం కనిపించింది.
Telangana Elections 2023: వీడియో ఇదిగో, తుంగతుర్తి సీటులో అద్దంకి దయాకర్‌కు హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్, అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించిన దయాకర్
Hazarath Reddyకాంగ్రెస్‌ పార్టీ అద్ధంకి దయాకర్‌కు హ్యాండిచ్చిన సంగతి విదితమే.తనకు సీటు ఇవ్వకపోవడంపై అద్దంకి దయాకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం గౌరవిస్తాను. మందుల శామ్యూల్‌ గెలుపు కోసం పనిచేస్తాను.
Diwali 2023: దీపావళి సెలవు తేదీ మార్పుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన, హాలిడేను ఆదివారం నుంచి సోమవారానికి మార్చుతున్నట్లు ఉత్తర్వులు
Hazarath Reddyదీపావళి పండుగపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దీపావళి పండుగ సెలవు రోజును మార్పు చేస్తున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. దీపావళి సెలవును సోమవారానికి మార్చుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో.. తెలంగాణలో పాఠశాలలు, ఆఫీసులకు సోమవారం హాలీడే.
Telangana Elections 2023: నారాయణఖేడ్ నామినేషన్లలో అనూహ్య మలుపు, కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి సంజీవరెడ్డి, పోటీ నుంచి తప్పుకున్న సురేష్ షెట్కర్‌
Hazarath Reddyస్వయంగా సురేష్ షెట్కర్ పోటీ నుంచి తప్పుకునే అంశాన్ని ప్రకటించడంతో పాటు సంజీవరెడ్డికి సంపూర్ణ సహకారం ఇస్తానని, ఆయనను గెలిపించుకుంటానని ప్రకటించారు. నామినేషన్ వేసే కార్యక్రమానికి స్వయంగా తానే వెళ్ళి మద్దతు పలుకుతానని తెలిపారు
Telangana Elections 2023: వీడియో ఇదిగో, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నా, సంచలన ప్రకటన చేసిన సూర్యాపేట కాంగ్రెస్ నేత పటేల్ రమేష్ రెడ్డి
Hazarath Reddyనేను కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో దిగడం ఖాయం. దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కోవర్ట్. మంత్రి జగదీష్ రెడ్డిని గెలిపించడానికే దామోదర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. సర్వేలు నేను గెలుస్తానని చెప్పినా దామోదర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంలో ఆoతర్యమేంటి ?