తెలంగాణ
Telangana Elections 2023: నీలం మధు,అద్దంకి దయాకర్, పటేల్ రమేష్ రెడ్డిలకు షాక్, నలుగురు అభ్యర్థులతో కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ ఇదిగో
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్పికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల చివరి జాబితా విడుదలైంది. ఇప్పటికే 114 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. 2023, నవంబర్ 9వ తేదీ గురువారం సాయంత్రం పెండింగ్ అభ్యర్థులను ప్రకటించింది.
Telangana Elections 2023: కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్‌గా తీన్మార్ మల్లన్న, పార్టీలో చేరిన వెంటనే కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ హైకమాండ్
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్నకు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది.పార్టీలో చేరిన వెంటనే కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు. అయితే.. ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న మధుయాష్కీ గౌడ్.. ఎల్బీ నగర్‌కు వెళ్లగా.. క్యాపింగ్‌కు సంబంధించిన వ్యవహారాలను మల్లన్న చూసుకుంటారు.
Telangana Elections 2023: వీడియో ఇదిగో, సూర్యాపేట టికెట్ రాలేదని తెలిసి ఒక్కసారిగా ఏడ్చేసిన పటేల్‌ రమేశ్‌రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి టికెట్ ఖరారు చేసిన కాంగ్రెస్
Hazarath Reddyతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది నేతలు టికెట్‌ కేటాయింపు ఎంతో ఆశగా ఉన్న క్రమంలో చివరి సమయంలో టికెట్‌ దక్కకపోవడంతో కన్నీటిపర్యంతమవుతున్నారు. తాజాగా సూర్యాపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన పటేల్‌ రమేశ్‌రెడ్డికి సైతం నిరాశ ఎదురైంది
Telangana Assembly Election 2023: మల్కాజ్‌గిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా రామచంద్రరావు, బీజేపీ తెలంగాణ అభ్యర్థుల చివరి జాబితా ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తన చివరి జాబితాను విడుదల చేసింది. 14 మందితో కూడిన చివరి జాబితాను శుక్రవారం ఉదయం బీజేపీ హైకమాండ్‌ ప్రకటించింది.
Telangana Elections 2023: వీడియో ఇదిగో, జైలు నుండి బయటకు వచ్చిన తరువాత నా కాళ్ళు పట్టుకుని ఏడ్చిన విషయం మరచిపోయావా, రేవంత్ రెడ్డిపై విరుచుకుపడిన ఎర్రబెల్లి దయాకర్ రావు
Hazarath Reddyరేవంత్ రెడ్డి నువ్వు ఓటు నోటు కేసులో జైలు నుండి బైటికి వచ్చిన తరువాత ఏడుస్తూ వచ్చి నా కాళ్ళు పట్టుకున్న విషయం మర్చిపోయినవా? ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టావు.. బ్రోకరిజం, దందాలు బంజేయమని ఎన్నోసార్లు చెప్పినా నువ్వు వినలేదు - ఎర్రబెల్లి దయాకర్ రావు
TTD SED Tickets: నేడు శ్రీవారి 300 ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్లు ఆన్‌ లైన్‌ లో.. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటా విడుదల
Rudraకలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్టు టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది.
Rain Alert to Telangana: తెలంగాణలోని 15 జిల్లాలకు వర్ష సూచన.. రెండ్రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని యెల్లో అలర్ట్
Rudraబంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో రెండ్రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Telangana Election 2023: వీడియో ఇదిగో, బుల్డోజర్లతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన పటాన్‌చెరు బీజేపీ అభ్యర్థి నందీశ్వర్‌గౌడ్
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. నామినేషన్ల పర్వం ముగియనుండటంతో నేతలంతా నామినేషన్లు వేయడానికి క్యూ కడుతున్నారు. ర్యాలీలతో నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నారు. తాజాగా పటాన్ చెరు బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ బుల్డోజర్ల ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. వీడియో ఇదిగో..
KCR Net Worth: కేసీఆర్‌ పేరు మీద రూ.17.27 కోట్ల అప్పు, తన పేరు మీద సెంటు భూమి లేదని అఫిడవిట్‌లో ప్రస్తావించిన తెలంగాణ సీఎం, ఆస్తులు ఎంతంటే..
Hazarath Reddyబీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇవాళ నామినేషన్లు వేశారు.నామినేషన్‌ సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా కేసీఆర్‌పై తొమ్మిది కేసులు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో జరిగిన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనల అంశంలో కేసులేనని తెలుస్తోంది.
Telangana Shocker: భార్య కాపురానికి రావడం లేదని భర్త ఉరేసుకుని ఆత్మహత్య, కరీంనగర్ జిల్లాలో విషాదకరమైన ఘటన
Hazarath Reddyకరీంనగర్ జిల్లాలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. వేములవాడ మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన గొర్రె వెంకటేష్(35) అనే యువకుడు భార్య కాపురానికి రావడం లేదని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Note For Vote Case: వీడియో ఇదిగో, ఓటుకు నోటు కేసులో నేను జైలుకు వెళ్ళడానికి కారణం ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyఉమ్మతి తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నోటుకు ఓటు కేసులో నేను జైలుకు వెళ్ళడానికి కారణం ఎర్రబెల్లి దయాకర్ రావు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దయాకర్ రావు శత్రువుల పంచన చేరి కుట్ర చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీడియో ఇదిగో..
Telangana: పెన్షన్, రేషన్ బియ్యం కోసం వచ్చి మనువరాలితో సహా సజీవదనమైన వృద్ధురాలు, మెదక్‌ జిల్లాలో విషాదకర ఘటన
VNSమనవరాలు మధు (6)తో కలిసి పెన్షన్, రేషన్ బియ్యం కోసం గ్రామానికి వచ్చింది. అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ పేలి (cylinder explosion) భారీ శబ్దం రావడంలో భయాందోళనకు గురుయ్యారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు గ్రామస్తులు, ఫైరింజన్‌ సహాయంతో మంటలు ఆర్పివేసినా ఫలితం లేకుండా పోయింది.
Music University In Telangana: దేశంలోనే తొలి మ్యూజిక్ యూనివర్సిటీ తెలంగాణలో ఏర్పాటు, ఇళయరాజా అంగీకరిస్తే ప్రారంభిస్తామన్న కేటీఆర్
VNSప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja) అంగీకరిస్తే తెలంగాణలో మ్యూజిక్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (KTR) ప్రకటించారు. మాజీ ఐఏఎస్ అధికారి పాపారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘మ్యూజిక్ స్కూల్’ చిత్రం విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇళయరాజాతో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు.
Telangana Elections 2023: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీతక్కను సీఎం చేస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
ahanaటిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో తానా సభలో రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులు, ఆదివాసీలు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదా? అని ప్రశ్నించడంతో సీతక్క కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందన్నారు.
Yellow Alert For Telangana: తెలంగాణకు మరోసారి భారీ వర్షసూచన, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, ఏయే జిల్లాల్లో భారీ వర్షాలంటే?
VNSఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ (Yellow Alert) జారీ చేసింది. సోమవారం నుంచి బుధవారం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని చెప్పింది. గురువారం నుంచి శుక్రవారం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు అక్కడక్కడ భారీ వర్షాలుపడుతాయని చెప్పింది.
Telangana: ప్రేమను ఒప్పుకోలేదని యువతికి పురుగుల మందు తాగించిన దుర్మార్గుడు, పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ప్రేమ పేరుతో యువతి వెంటపడి వేధించిన వ్యక్తి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఘాతుకం
VNSప్రేమను నిరాకరించిందన్న కోపం.. తనకు దక్కనిది మరెవరికీ దక్కకూడదన్న కక్షతో ఓ యువకుడు యువతిని హత్య చేసిన (Women Killed) ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్‌ (Asifabad) జిల్లా సిర్పూర్‌(టీ) మండలం వెంకట్రావ్‌పేట్‌లో చోటుచేసుకుంది. సిర్పూర్‌(టీ) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకట్రావ్‌పేట్‌కు చెందిన దంద్రే కమలాకర్‌ (28)కు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Telangana: పేస్ట్ ధర ఎక్కువ అమ్ముతున్నారంటూ కోల్గేట్ కంపెనీపై పిటిషన్, రూ. 65 వేలు జరిమానా విధించిన సంగారెడ్డి వినియోగదారుల ఫోరమ్‌
Hazarath Reddyకొల్గేట్ కంపెనీకి తెలంగాణకు చెందిన న్యాయవాది భారీ షాక్ ఇచ్చారు. ఎక్కువ ధరకు పేస్ అమ్ముతున్నారంటూ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఆ న్యాయవాదితో ఏకీభవించిన న్యాయస్థానం కోల్గేట్ కంపెనీకి (Colgate Palmolive India) ఏకంగా రూ. 65 వేలు జరిమానా విధించింది.
Telangana Elections 2023: వీడియో ఇదిగో, కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన సీఎం కేసీఆర్‌
Hazarath Reddyబీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకుముందు గజ్వేల్‌లో నియోజకవర్గంలో నామినేషన్‌ దాఖలు చేసిన సీఎం.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కామారెడ్డికి చేరుకున్నారు.
KTR Fell Down Video: వీడియో ఇదిగో, ప్రచార వాహనంపై నుంచి కిందపడిన మంత్రి కేటీఆర్, ఎంపీ సురేశ్‌రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి, కేటీఆర్‌కు స్వల్ప గాయాలు
Hazarath Reddyనిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచార ర్యాలీలో గురువారం అపశ్రుతి చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా గులాబీ శ్రేణులు ర్యాలీగా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి బయల్దేరారు. కేటీఆర్‌, ఇతర నేతలు ప్రచార వాహనంపై వెళ్లారు.
Telangana Shocker: మేడ్చల్‌ జిల్లా‌లో విషాదం, నాలుగో అంతస్థు నుంచి దూకి ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
Hazarath Reddyమేడ్చల్ జిల్లాలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లాలో కండ్లకోయ సీఎంఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకుంటున్న విద్యార్థి నాలుగో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు..