తెలంగాణ
Hyderabad Shocker: ఇద్దరితో రహస్యంగా అక్రమసంబంధం, మొదటి వ్యక్తికి తెలియడంతో రెండో ప్రియుడితో కలిసి అతన్ని దారుణంగా హత్య చేసిన మహిళ, కేసు వివరాలను వెల్లడించిన మహేశ్వరం ఏసీపీ సి.అంజయ్య
Hazarath Reddyపది రోజుల క్రితం వ్యక్తిని దారుణంగా హతమార్చి డ్రమ్ములో కుక్కి చెరువులో పడేసిన ఘటనను పహాడీషరీఫ్‌ పోలీసులు చేధించారు.రెండో ప్రియుడి మోజులో పడిన మహిళ అతనితో కలిసి మొదటి ప్రియుడిని హత్య చేసిందని పోలీసులు తెలిపారు.
Telangana: వ్యాక్సిన్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ వరల్డ్‌గా హైదరాబాద్, తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyతెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌.. వ్యాక్సిన్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ వరల్డ్‌గా మారనున్నదని మంత్రి అన్నారు. వచ్చే ఏడాదినాటికి ప్రపంచంలోనే సగానికిపైగా వ్యాక్సిన్లు తెలంగాణలోనే తయారవుతాయని, ఇది మన రాష్ట్రానికే కాదు యావత్తు దేశానికి గర్వ కారణమని పేర్కొన్నారు.
TS Government New Scheme: తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రూ.లక్ష ఆర్థిక సాయం అర్హతా నిబంధనలు ఇవే, https://tsobmmsbc.cgg. gov. in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోండి
Hazarath Reddyతెలంగాణలో వెనుకబడిన వర్గాల్లోని కులవృత్తులు, చేతివృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న రూ.లక్ష ఆర్థిక సాయానికి సంబంధించిన ప్రక్రియ షురూ అయింది. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది
CM KCR Speech in Nagarkurnool: కాంగ్రెస్‌ రాజ్యం అంటే దళారీ భోజ్యం, తీవ్రస్థాయిలో విరుచుకుపడిన తెలంగాణ సీఎం కేసీఆర్, నాగర్ కర్నూల్ స్పీచ్ హైలెట్ ఇవిగో..
Hazarath Reddyనాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ రాజ్యం అంటే దళారీ భోజ్యమని, వాళ్లకు మళ్లా అధికారం ఇస్తే పంటికి అంటకుండా మింగేస్తారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామన్న కాంగ్రెస్‌ నేతల వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Telangana: బీసీ కులవృత్తుల వారికి లక్ష రూపాయల సాయం, మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
Hazarath Reddyతెలంగాణలోని బీసీ కులవృత్తులు, చేతివృత్తిదారులకు పనిముట్లు, ముడిసరకు కొనుగోలు కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. సాయానికి దరఖాస్తు చేసుకునేందుకు https://tsobmmsbc.cgg.gov.in వెబ్‌సైట్ సందర్శించండి. ఫొటో, ఆధార్, కులధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చు
CM KCR on Dharani Portal: వీడియో ఇదిగో, ధరణి లేకపోతే మీ అకౌంట్లలో డబ్బులు పడవు, రైతు బంధు లేకపోతే రైతులు ఆగమాగం అవుతారని తెలిపిన సీఎం కేసీఆర్
Hazarath Reddyధరణి తీసేయాలని కాంగ్రెస్ వాళ్లు కుట్రలు చేస్తున్నారు. ధరణి లేకపోతే మళ్ళీ భూ తగాదాలు వస్తాయి, ధరణి లేకపోతే మీ అకౌంట్లలో డబ్బులు పడవు. రైతు బంధు లేకపోతే రైతులను సముద్రంలోకి నెట్టేసినట్లే - సీఎం కేసీఆర్
CM KCR on AP Power Supply: వీడియో ఇదిగో, ఏపీ కరెంట్ కోతలపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు, తెలంగాణ 24 గంటల కరెంటుతో వెలుగుతోందని వెల్లడి
Hazarath Reddyఆనాడు తెలంగాణ వస్తే చిమ్మచీకటి అయిపోతది అని శాపాలు పెట్టారు. ఈరోజు తెలంగాణ 24 గంటల కరెంటుతో వెలుగు జిలుగులతో వెలిగిపోతుంది. ఆంధ్ర ప్రదేశ్ మాత్రం చిమ్మచీకటి అయిపోయింది - సీఎం కేసీఆర్
Telangana Weather Update: ఓ వైపు వర్షాలు, మరో వైపు వడగాల్పులు, తెలంగాణలో ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌, రానున్న 5 రోజులు వాతావరణం ఇదే..
Hazarath Reddyతెలంగాణ రాగల ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో పలు జిల్లాల్లో వడగాలులు వీచే సూచనలున్నాయని పేర్కొంది.
Telangana: భారత్ భవన్‌కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్, యువతను భావి నాయకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కొత్త కార్యాలయం
Hazarath Reddyపార్టీ నేతలకు శిక్షణనిచ్చే సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ పనులను భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) సోమవారం ఇక్కడ ప్రారంభించింది. హైదరాబాద్‌లోని కోకాపేటలో బీఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భారత్ భవన్‌కు శంకుస్థాపన చేశారు.
Telangana: సీఎం కేసీఆర్ నాగ‌ర్‌ క‌ర్నూల్ పర్యటన, పలు కార్యాలయాలకు ప్రారంభోత్సవం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyతెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇవాళ నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలో ప‌ర్య‌టించారు. పలు కార్యాలయాలకు ప్రారంభోత్సవం చేశారు.నాగర్‌కర్నూల్‌ సమీకృత కలెక్టరేట్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయం, నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాలకు సీఎం ప్రారంభోత్సవాలు చేశారు.
Heat Wave Alert: తెలంగాణలో వచ్చే 4 రోజులు మండిపోనున్న ఎండలు, 13 జిల్లాలకు హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, రుతుపవనాల రాక ఆలస్యమే కారణం
Hazarath Reddyసాధారణంగా ప్రతి సీజన్‌లో జూన్‌ ఒకటి నాటికి క్రమం తప్పకుం డా నైరుతి రుతుపవనాలు కేరళ వద్ద తీరాన్ని తాకి నాలుగైదు రోజుల్లోనే విస్తరిస్తుంటాయి.అయితే ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక లో జాప్యం ఏర్పడింది.
Vemulawada: వేములవాడ రాజన్న ఆలయంలో విషాదం.. గుండెపోటుతో భక్తురాలు మృతి
Rudraరాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఓ భక్తురాలు గుండెపోటుతో మరణించింది. రాజన్న దర్శనం కోసం మంగళవారం ఉదయం లైన్‌లో నిల్చున్న మహిళ క్యూలైన్‌లోనే కుప్పకూలింది.
Telangana Record IT Exports: ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ రికార్డు.. 2.41 లక్షల కోట్లకు.. జాతీయ సగటు కంటే మూడున్నర రెట్లు ఎక్కువ వృద్ధి
Rudraఐటీ రంగంలో దేశంలోనే పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ దూసుకుపోతున్నది. తొమ్మిదేండ్లలోనే తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో రికార్డుస్థాయిలో 31.44% వృద్ధిని సాధించిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అదే సమయంలో భారత్‌ వృద్ధి కేవలం 9.36% మాత్రమేనని వెల్లడించారు.
Road Accident: కర్ణాటకలో ఆగివున్న లారీని ఢీకొట్టిన జీపు.. ఐదుగురు ఏపీవాసుల దుర్మరణం.. మరో 13 మందికి గాయాలు.. కలబురిగిలో దర్గా ఉర్సుకు వెళ్లి వస్తుండగా ఘటన
Rudraకర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీలోని నంద్యాల జిల్లా వెలుగోడుకు చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. అదుపు తప్పిన జీపు రోడ్డు పక్కన ఆగివున్న లారీని బలంగా ఢీకొట్టింది.
Hyderabad Suicide: తాగిన మత్తులో ఫ్లై ఓవర్ మీది నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య.. హైదరాబాద్ లోని బాలానగర్ ఫ్లైవర్ పైన ఘటన.. వీడియో ఇదిగో..
Rudraహైదరాబాద్ లోని బాలానగర్ ఫ్లైఓవర్ నుండి దూకి ఓ వ్యక్తి తాగిన మత్తులో ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడిని వెల్డింగ్ వర్కర్ గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.
Telangana: కృష్ణానదిలో ఈతకు వెళ్లి ఒకే కుటుబంలో నలుగురు చిన్నారులు మృతి, తెలంగాణలోని గద్వాల జిల్లాలో విషాదకర ఘటన
Hazarath Reddyతెలంగాణలోని గద్వాల జిల్లాలో ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఇటిక్యాల మండలం మంగంపేట వద్ద చిన్నారులు కృష్ణా నదిలో ఈతకు దిగారు. లోతు ఎక్కువగా ఉండడంతో నలుగురు మునిగిపోయారు. మృతి చెందినవారిని అఫ్రీన్ (17), సమీర్ (8), రిహాన్ (15), నౌసీన్ (7) అని గుర్తించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
HC on TSPSC Group 1 Exam: అభ్యర్థులకు గుడ్ న్యూస్, గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్, జూన్ 11న గ్రూప్‌-1 పరీక్ష నిర్వహణ
Hazarath Reddyగ్రూప్ 1 పరీక్షల (Group 1 exams) నిర్వహణకు హైకోర్టు (High Court) గ్రీన్‌ సిగ్నలిచ్చింది. గ్రూప్ 1 పేపర్ రద్దు చేయాలన్న పిటిషన్లలను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ నేపథ్యంలో జూన్‌ 11వ తేదీన గ్రూప్‌-1 పరీక్ష జరుగనుంది. కాగా గ్రూప్‌-1 పరీక్షను రద్దు చేయాలని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో పిటిషనర్‌ పేపర్‌ లీక్‌ అంశాన్ని ప్రస్తావించారు.
TSPSC Group 1 2023: పరీక్షకు 15 నిమిషాల ముందే గేట్లు బంద్, గ్రూప్ 1 అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కీలక సూచనలు, గుర్తింపు కార్డు తప్పనిసరి
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఈ నెల 11న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. తాజాగా ఈ పరీక్షకు హాజరు కాబోయే అభ్యర్థులకు కమిషన్ పలు కీలక సూచనలు చేసింది. పరీక్షా కేంద్రాల వద్దకు సమయానికన్నా ముందే చేరుకోవాలని పేర్కొంది.
BDS Student Dies by Suicide: ఖమ్మంలో వైద్య విద్యార్థిని ఆత్మహత్య కారణం అదేనా, హాస్టల్ గదిలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న బీడీఎస్ విద్యార్థిని
Hazarath Reddyఖమ్మంలోని మమత మెడికల్‌ కళాశాలలో బీడీఎస్‌ నాలుగో సంవత్సరం చదువుతున్న సముద్రాల మానస (22) ఆదివారం సూసైడ్ చేసుకుంది. కళాశాల సమీపంలోని ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటున్న ఆమె నాలుగో అంతస్తులోని గదిలో సాయంత్రం 5 గంటల సమయంలో ఒంటిపై పెట్రోల్‌ను పోసుకొని నిప్పంటించుకుంది.
Hyderabad: వీడియో ఇదిగో, నిద్రిస్తున్న ఇద్దరు పిల్లలను స్మార్ట్‌గా ఎత్తుకెళ్లిన దొంగలు, రెండు గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసిన మహంకాళి పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్ - సుల్తాన్ బజార్ పరిధిలో రోడ్డు పై నిద్రిస్తున్న ఇద్దరు పిల్లలను ఎత్తుకెళ్లిన రెండు కిడ్నాప్ కేసులను 2 గంటల్లో చేదించిన మహంకాళి పోలీసులు. ఇద్దరు పిల్లలను ఎత్తుకెల్లింది ఆటో డ్రైవర్ ఇమ్రాన్, ప్రవీణ అనే మహిళగా గుర్తించిన పోలీసులు.