తెలంగాణ

TS EAMCET 2023 Exam Date: రేపటి నుంచే టీఎస్‌ ఎంసెట్‌, విద్యార్థులకు బయోమెట్రికల్ తప్పనిసరి, ఈ సూచనలు తప్పక పాటించాలని తెలిపిన అధికారులు

Hazarath Reddy

టీఎస్‌ ఎంసెట్‌ బుధవారం నుంచి ప్రారంభం కానుంది.ఇందుకోసం తెలంగాణలో 104, ఏపీలో 33 (మొత్తం 137) పరీక్షా కేంద్రాలు అధికారులు ఏర్పాటు చేశారు. 3.20 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఒక్క హైదరాబాద్‌ నగరం నుంచే అత్యధికంగా 1,71,706 మంది పరీక్షలు రాయనున్నారు.

TS Inter Results 2023: తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల తేదీ ఇదిగో, జూన్ 4 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు, ఫీజు వివ‌రాలు, టైం టేబుల్‌ త్వరలో

Hazarath Reddy

జూన్ 4 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సబితా తెలిపారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. రీకౌంటింగ్, రీవెరిఫికేష‌న్‌కు అవ‌కాశం క‌ల్పించామ‌న్నారు. అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఫీజు వివ‌రాలు, టైం టేబుల్‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌న్నారు.

TS Inter Results 2023: జూన్ 4 నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు, తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, చివరి స్థానంలో నిలిచిన మెదక్ జిల్లా

Hazarath Reddy

తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. మంగళరం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డ్‌ కార్యాలయంలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లాంఛనంగా విడుదల చేశారు.

TS Inter Results 2023: తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల, రిజల్ట్స్‌ను https://tsbie.cgg.gov.in, http://results.cgg.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. మంగళరం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డ్‌ కార్యాలయంలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లాంఛనంగా విడుదల చేశారు

Advertisement

TSRTC Good News For Women: మహిళలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. మహిళలకు టీ-24 టిక్కెట్‌ను రూ.80కే అందించాలని నిర్ణయం

Rudra

మహిళలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ వంటి సిటీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు టీ-24 టిక్కెట్ ను రూ.80కే అందించాలని నిర్ణయించింది.

TS Inter Results 2023: నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి చేతులమీదుగా విడుద‌ల‌.. విద్యార్థులు తమ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే?

Rudra

లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు నేడే విడుదల కానున్నాయి. నేటి ఉదయం 11 గంట‌ల‌కు ఇంట‌ర్ ఫ‌లితాల‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేయ‌నున్న‌ట్లు బోర్డు అధికారులు ప్ర‌క‌టించారు.

Secunderabad Bonalu: జులై 9వ తేదీన సికింద్రాబాద్ ఆషాడ బోనాల ఉత్సవాలు, 10 వ తేదీన రంగం నిర్వహిస్తున్నామని తెలిపిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Hazarath Reddy

సికింద్రాబాద్ ఆషాడ బోనాల(Secunderabad Bonalu) ఉత్సవాలు జులై 9వ తేదీన నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) తెలిపారు.

Manipur Violence: మణిపూర్‌ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్న తెలుగు విద్యార్థులు, స్వాగతం పలికిన మంత్రి మల్లారెడ్డి

Hazarath Reddy

మణిపూర్‌(Manipur)లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు(Telangana Student) హైదరాబాద్‌కు చేరుకున్నారు.మణిపూర్‌లో అల్లర్ల నేపధ్యంలో అక్కడ చదువుకుంటున్న విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది

Advertisement

Telangana Tragedy: వనపర్తి జిల్లాలో ఘోర విషాదం, బావిలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు మృతి, విచారం వ్యక్తం చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి

Hazarath Reddy

తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు.

TS Inter Results 2023: రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫ‌లితాలు విడుద‌ల‌, విద్యార్థులు తమ ఫలితాలను tsbie.cgg.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Hazarath Reddy

తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాల విడుద‌ల‌కు ఇంట‌ర్ బోర్డు అధికారులు సిద్ధ‌మ‌య్యారు. మంళ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు ఇంట‌ర్ ఫ‌లితాల‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేయ‌నున్న‌ట్లు బోర్డు అధికారులు ప్ర‌క‌టించారు.

Telangana: రేపు సాయంత్రం 5 గంటల్లోపు డ్యూటీలో చేరకుంటే ఉద్యోగాల నుంచి తొల‌గిస్తాం, జూనియ‌ర్ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులకు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియ‌ర్ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు చేప‌ట్టిన స‌మ్మెపై ప్ర‌భుత్వం సీరియ‌స్ అయింది. మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌ల లోపు విధుల్లో చేరాల‌ని జూనియ‌ర్ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల‌కు ప్ర‌భుత్వం నోటీసులు జారీ చేసింది

Cyclone Mocha: నేడు అల్ప పీడనం, బంగాళాఖాతం వైపు కదులుతూ తుపానుగా బలపడనున్న వాయుగుండం, ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతంలో నేడు అల్ప పీడనం ఏర్పడనున్నట్టు భారత వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసరాల్లోని అండమాన్ సముద్రంలో రేపు అది వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని, ఆ తర్వాత ఉత్తర దిశగా పయనిస్తూ బంగాళాఖాతం వైపు కదులుతూ తుపానుగా బలపడుతుందని పేర్కొన్నారు.

Advertisement

Telangana Shocker: తెల్లారితే పెళ్లి.. వేకువజామున అక్క భర్తతో జంప్ అయిన వధువు, దిమ్మతిరిగే ట్విస్టుతో షాక్‌లోకి వెళ్లిన పెళ్లి కొడుకు, జగిత్యాలలో ఘటన

Hazarath Reddy

తెలంగాణలోని జగిత్యాలలో విచిత్రకర ఘటన చోటు చేసుకుంది. ఓ వధువు పెళ్లి ముందు రోజు అక్క భర్తతో పరార్ అయింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి (20)కి మరో గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి జరిపేందుకు నిశ్చయించారు. తెల్లారేసరికి పెళ్లి.. రెండు కుటుంబాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు.

Hyderabadi Woman Loses Life In Texas Shooting: టెక్సాస్ కాల్పుల ఘటనలో హైదరాబాద్ యువతి దుర్మరణం

Rudra

టెక్సాస్ రాష్ట్రం అలెన్ పట్టణంలోని షాపింగ్‌ మాల్‌లో శనివారం చోటుచేసుకున్న కాల్పుల్లో ఓ హైదరాబాదీ యువతి దుర్మరణం పాలయ్యారు. బాధితురాలిని సరూర్ నగర్‌కు చెందిన తాటికొండ ఐశ్వర్య రెడ్డి (27) గా గుర్తించారు.

Big Relief For Consumers: సామాన్యులకు ఊరట.. దిగొస్తున్న వంటనూనె ధరలు.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా భారత్‌కు నిలిచిపోయిన నూనెల సరఫరా.. మళ్లీ ప్రారంభం.. దీంతో రిటైల్ మార్కెట్లో ధర ఎంతవరకు తగ్గనున్నదంటే??

Rudra

నిరుడు సామాన్యులను బెంబేలెత్తించిన వంటనూనె ధరలు తగ్గుముఖం పట్టాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య గతేడాది యుద్ధం మొదలవ్వడంతో అప్పట్లో ఉక్రెయిన్ నుంచి సరఫరా ఆగిపోవడంతో ధరలు కొండెక్కాయి. అయితే, మళ్లీ ఇప్పుడు సరఫరా ప్రారంభం కావడంతో భారత్‌లో సన్‌ఫ్లవర్, సోయాబీర్ ముడి నూనెల ధరలు భారీగా తగ్గాయి.

Yellow Alert For Telangana: తెలంగాణపై మోచి తుఫాన్ ఎఫెక్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, ఏయే జిల్లాల్లో భారీ వర్షాలంటే?

VNS

తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వనపర్తి అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

Advertisement

BSP CM Candidate For Telanagana: సీఎం అభ్యర్ధిని ప్రకటించిన మాయావతి, బీఎస్పీ బలపడుతుందనే సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారన్న మాయావతి

VNS

బీఎస్పీ తెలంగాణ సీఎం అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ (RS Praveen Kumar) పేరును ప్రకటించారు పార్టీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి. అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాయావతి (Mayawathi) కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను మాయావతి ఆశీర్వదించారు. హైదరాబాద్, సరూర్ నగర్ లోని మైదానంలో బీఎస్పీ బహిరంగ సభ (BSP Rally) నిర్వహించింది.

TS SSC, Inter Results: వచ్చే వారంలో తెలంగాణ పదో తరగతి, ఇంటర్ ఫలితాలు.. ఏయే తేదీల్లో ఫలితాలు ప్రకటించే అవకాశం ఉన్నదంటే??

Rudra

వచ్చే వారంలో తెలంగాణ పదో తరగతి, ఇంటర్ ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ రెండు పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయిందని తెలుస్తోంది.

Rains In Telangana: తెలంగాణకు వర్ష సూచన.. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో పిడుగుపాటుకూ అవకాశం.. హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటన

Rudra

తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు లేదా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Hyderabad Horror: హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య.. పోలీసుల కేసు నమోదు.. దర్యాప్తు.. వీడియోతో..

Rudra

హైదరాబాద్ మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుండి దూకి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Advertisement
Advertisement