తెలంగాణ

Chhattisgarh Encounter: మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ, కీలక నేత హిడ్మా హతమయినట్లుగా వార్తలు, ఇంకా అధికారికంగా ధృవీకరించిన మావోయిస్టు కేంద్ర కమిటీ

Hazarath Reddy

మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ అడవుల్లో బుధవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో (Chhattisgarh Encounter) మావోయిస్టు పార్టీ కీలక నేతను కోల్పోయినట్టు తెలుస్తోంది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా (Maoist Leader Madvi Hidma) హతమయినట్లుగా వార్తలు వస్తున్నాయి.

Telangana:తెలంగాణ నూతన సీఎస్‌గా శాంతి కుమారి, ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్

Hazarath Reddy

తెలంగాణ నూతన సీఎస్‌గా శాంతి కుమారి నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి అధికారికంగా కాసేపట్లో ఉ‍త్తర్వులు వెలువడనున్నాయి. 2025 ఏప్రిల్‌ వరకు సీఎస్‌గా కొనసాగనున్నారు. 1989 బ్యాచ్‌కు చెందిన శాంతి కుమారి ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.

South Central Railway: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, రెండు రోజుల పాటు పలు ఎంఎంటీఎస్, ప్యాసింజర్ రైళ్లు రద్దు, రద్దయిన రైళ్ల వివరాలు ఓ సారి చెక్ చేసుకోండి

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో పలు ఎంఎంటీఎస్‌లు, దూర ప్రాంతాలకు మధ్య నడిచే ప్యాసింజర్‌ రైళ్లు తాత్కాలికంగా రద్దు అయ్యాయి. మరమ్మతుల పనుల కారణంగానే దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. నేడు(బుధవారం),రేపు(గురువారం) నడిచే ప్యాసింజర్ రైళ్లు కూడా దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.

Telangana: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన వాయిదా, తదుపరి షెడ్యూల్‌ త్వరలోనే వెల్లడిస్తామని తెలిపిన బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన బిజీ షెడ్యూల్ వల్ల వాయిదా పడింది.పీఎంఓ షెడ్యూల్‌ ప్రకారం.. ఈ నెల 19వ తేదీన ఆయన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు రావాల్సి ఉంది. సికింద్రాబాద్‌ స్టేషన్‌ అభివృద్ధి పనులతో పాటు వందే భారత్‌ రైలును ప్రారంభించాల్సి ఉంది.

Advertisement

Cat Theft in Hyderabad: ఆరుబయట ఆడుకుంటున్న పిల్లిని చోరీ చేసిన వ్యక్తి, రూ. 50వేలు పెట్టి కొన్నానంటూ పిల్లి యజమాని ఆవేదన, ఇంతకీ ఆ పిల్లి ప్రత్యేకత ఏంటంటే?

VNS

ఈ పిల్లి కండ్లు ఒక‌టి గ్రీన్ క‌ల‌ర్‌లో, మ‌రొక‌టి బ్లూ క‌ల‌ర్‌లో ఉంది. ఇదే ఈ పిల్లి ప్ర‌త్యేక‌త‌. అయితే ఆదివారం రాత్రి ఆ పిల్లిని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు అప‌హ‌రించారు. దీంతో బాధితుడు సోమ‌వారం వ‌న‌స్థ‌లిపురం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీల‌ను ప‌రిశీలిస్తున్నారు.

Siddipet Road Accident: సిద్దిపేటలో అదుపుతప్పి గుంతలో పడిన కారు, ఐదుగురు అక్కడికక్కడే మృతి, మరొకరికి పరిస్థితి విషమం

Hazarath Reddy

తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగదేవ్పూర్ మండలం మునిపడ మల్లన్న ఆలయం వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు ప్రయాణిస్తున్నారు.

Telangana Hc: తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ వెంటనే ఏపీకి వెళ్లాల్సిందే, కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు, సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచనలో సీఎస్

Hazarath Reddy

తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కొనసాగింపును తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. సీఎస్ సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఏపీ క్యాడర్‌కు వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది.

Sankashta Chaturthi: నేడే సంకష్ట చతుర్థి.. లేటెస్ట్‌లీ హెచ్ డీ ఇమేజెస్ ద్వారా మీ ప్రెండ్స్, బంధువులకు గ్రీటింగ్స్ పంపండి..

Rudra

నేడు సంకష్ట చతుర్థి పండుగ. ఈ రోజున గణేశుడిని , చంద్ర దేవుడిని పూజించడం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. మరి ఈ పర్వదినం రోజు లేటెస్ట్ లీ హెచ్ డీ ఇమేజెస్ ద్వారా మీ ప్రెండ్స్, బంధువులకు గ్రీటింగ్స్ పంపండి..

Advertisement

Cat Theft In Hyderabad: రూ. 50 వేల పిల్లిని ఎత్తుకుపోయిన దొంగలు.. హైదరాబాద్ లో కేసు నమోదు

Rudra

హైదరాబాద్ లో ఒక విచిత్రమైన కేసు నమోదయింది. పిల్లిని దొంగిలించడంపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.

Robotic Massage Centre: విజయవాడ రైల్వే స్టేషన్‌లో రోబోటిక్ మసాజ్ సెంటర్.. బాడీ మసాజ్‌కు రూ. 60, ఫుట్ మసాజ్‌కు రూ. 30

Rudra

టికెట్‌యేతర ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టిసారించిన దక్షిణ మధ్య రైల్వే విజయవాడ రైల్వేస్టేషన్‌లో రోబోటిక్ మసాజ్ సెంటర్‌ ను ఏర్పాటు చేసింది.

Vande Bharat Train: సికింద్రాబాద్-విశాఖ మధ్య వందేభారత్ రైలు.. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖకు..

Rudra

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. భారత రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ రైలును కేటాయించింది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖ, విశాఖ నుంచి సికింద్రాబాద్ ప్రయాణిస్తుంది.

Telangana Shocker: అది హత్యా, ఆత్మహత్యా, కారులో గిరిజన వ్యక్తి సజీవ దహనం, పూర్తిగా కాలిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టిన మెదక్ జిల్లా పోలీసులు

Hazarath Reddy

మెదక్‌ జిల్లా (medak district) టాక్మాల్‌ మండలంలో వెంకటాపురం శివారులో దారుణం చోటుచేసుకుంది. బతికుండగానే కారులో వ్యక్తి సజీవ దహనం ( Man burned alive in a car) అయ్యారు. గత అర్థరాత్రి ఓ వ్యక్తిని కారులో​ వేసి ప్రెటోల్‌ పోసి నిప్పు (Man burned alive) పెట్టిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు.

Advertisement

Cold Wave Sweeps Telangana: తెలంగాణలో పడిపోయిన ఉష్ణోగ్రతలు, వణుకుతున్న గ్రేటర్ హైదరాబాద్, ఉత్తర తెలంగాణకు ఆరంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

Hazarath Reddy

ఈశాన్య గాలుల ప్రభావంతో తెలంగాణపై చలిపంజా (Cold Wave Sweeps Telangana) విసురుతున్నది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి (mercury drops below 5 degrees) పడిపోతున్నాయి. రాష్ట్రంలో అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 4.6 డిగ్రీల సెల్సీయస్‌ నమోదయింది.

Pawan Meets Chandrababu: పొత్తులపై ఇంకా క్లారిటీ ఇవ్వని చంద్రబాబు- పవన్ కల్యాణ్, వైసీపీపై కలిసి పోరాటం చేస్తామంటూ ప్రకటన, బీజేపీతోనూ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం

VNS

ఏపీలో తీసుకువచ్చిన జీవో నంబరు 1కి (GO NO.1) అడ్డుకట్ట వేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu), తాను చర్చించానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. అలాగే, రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై చర్చించామని చెప్పారు. ఇవాళ చంద్రబాబు నాయుడితో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు.

Kamareddy: మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల జేఏసీ కీల‌క నిర్ణ‌యం, మా భూములు తిరిగి ఇవ్వాలంటూ ఇక ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం..

kanha

కామారెడ్డి జిల్లాలో మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల అత్యవసర సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. భూ నిర్వాసితుల ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని రైతు జేఏసీ నిర్ణయించింది.

Telangana Shocker: మద్యం సేవించి రోజూ కొడుతున్నాడని, కట్టుకున్న భర్తను హత్య చేసిన భార్య, శంషాబాద్ లో సంచలనం..

kanha

మద్యం సేవించి భార్యను నానా హింసలు పెట్టడంతో,ఆ బాధలు భరించలేక కట్టుకున్న భార్య తన భర్తను కడతేర్చిన ఘటన శంషాబాద్ మండలంలో చోటుచేసుకుంది.

Advertisement

Private Bus Fire: చూస్తుండగానే అగ్నికి ఆహుతైన ప్రైవేట్ బస్సు, జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్ దగ్గర ఘటన, ప్రయాణికులంతా సురక్షితం

VNS

హైదరాబాద్ కూకట్ పల్లి జేఎన్టీయూ మెట్రో స్టేషన్ (JNTU) వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ కావేరీ బస్సులో (Kaveri Bus) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో కావేరీ బస్సు కాలిపోయింది. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా దిగిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగింది. మంటలను ఆర్పివేసింది.

PM Modi Telangana Tour: మరోసారి తెలంగాణకు ప్రధాని మోదీ, ఈ నెల 19న సికింద్రాబాద్- విజయవాడ వందే భారత్ ఎక్స్‌ ప్రెస్‌ ను ప్రారంభించనున్న ప్రధాని, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న మోదీ

VNS

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులకు సంబంధించి రూ.700 కోట్ల ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లు ఇటీవలే ఖరారయ్యాయి. ఈ పనులు ప్రధానిమోదీ చేతులమీదుగా ప్రారంభించేలా రైల్వేశాఖ ఆలోచన చేస్తోంది. సికింద్రాబాద్-మహబూబ్ నగర్ రెండో లైన్ పనులు పూర్తయినందున ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసే అవకాశం ఉంది.

Hyderabad Boy: ఆరేళ్ల బాలుడికి ఆరు నెలల్లో చనిపోతాను అని తెలిసి, తన తల్లిదండ్రులకు నిజం చెప్పొద్దని డాక్టరును వేడుకున్నాడు, హైదరాబాద్ లో హృదయవిదారక ఘటన..

kanha

ఆరేళ్ల పిల్లవాడు క్యాన్సర్‌తో బాధపడుతూ, తన తల్లిదండ్రులు మరింత బాధపడకూడదని గుర్తుంచి, తన వ్యాధి గురించి వారికి చెప్పవద్దంటూ, కన్నీళ్లు పెట్టుకున్న ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

Nagababu Fires On Roja: రోజా నోటికి, మున్సిపాలిటీ కుప్పతొట్టికి తేడా లేదు.. ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు

Rudra

ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై జనసేన నేత నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజా నోటిని మున్సిపాలిటీ కుప్పతొట్టి అని ఆయన అన్నారు. రోజాను విమర్శిస్తూ ఒక వీడియోను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. నాగబాబు ఏమన్నారో ఆయన మాటల్లోనే...

Advertisement
Advertisement