తెలంగాణ

Hyderabad Shocker: ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పైనుంచి దూకి సూసైడ్ చేసుకున్న వృద్ధురాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చనిపోయినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడి

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ పెద్దావిడ మంగళవారం రాత్రి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అది గమించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు.

IPS Transfers in Telanagana: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు, కొత్త పోస్టుకు స్టీఫెన్ రవీంద్ర, త్వరలోనే ఐఏఎస్‌ల ట్రాన్స్ ఫర్లు కూడా..

VNS

యాంటి నార్కోటిక్ బ్యూరో ఏడీజీగా సీవీ ఆనంద్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా సందీప్ శాండిల్య, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐజీగా స్టీఫెన్ రవీంద్ర , హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అడిషనల్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్, అడిషనల్ డీజీ ఆర్గనైజేషన్ లీగల్ గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, రైల్వే అండ్ రోడ్డు సేఫ్టీ అడిషనల్ డీజీగా శివధర్ రెడ్డిని నియమించారు.

Telangana: సరస్వతి దేవి చదువుల తల్లి కాదంటూ రెంజర్ల రాజేష్ వ్యంగ్య వ్యాఖ్యలు, భగ్గు మన్న బాసర, రాజేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బాసర గ్రామస్థులు

Hazarath Reddy

తెలంగాణలోని నిర్మల్‌ జిల్లా బాసరలో గ్రామస్థుల బంద్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చదువుల తల్లి సరస్వతిపై రేంజర్ల రాజేశ్‌ (Atheist Renjarla Rajesh) చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గ్రామస్థులు బంద్‌కు (huge protests outside Gnana Saraswati Temple) పిలుపునిచ్చారు

Drug Peddlers Arrested in Hyd: ఆ హీరోయిన్ భర్తే డ్రగ్స్ సప్లయిలో కీలక సూత్రధారి,హైదరాబాద్ డ్రగ్స్ కేసులో బయటపడ్డ షాకింగ్ విషయాలు, ఇద్దర్నీ అరెస్ట్ చేసిన నా­ర్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ అధికారులు

Hazarath Reddy

న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం రేపింది. హైదరాబాద్‌ నా­ర్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌– న్యూ) జరిపిన దాడుల్లో తాజాగా ఇద్దరు పట్టుబడ్డారు. పట్టుబడిన ఈవెంట్ల డీజే సప్లయర్‌ మోహిత్‌ అగర్వాల్‌ (Mohit Agarwal) అలియాస్‌ మై­రోన్‌ మోహిత్‌ను, మరో వ్యక్తిని అధికారులు ఆదివారం రాత్రి అరెస్టు (Drug Peddlers Arrested in Hyd) చేశారు

Advertisement

Hyderabad Metro: సమ్మెలో పాల్గొన్న మెట్రో ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవు, ఉద్యోగుల మెరుపు సమ్మెపై స్పందించిన హైదరాబాద్‌ మెట్రో యాజమాన్యం

Hazarath Reddy

జీతాల పెంపు పేరుతో హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) కాంట్రాక్ట్‌ ఉద్యోగులు చేపట్టిన మెరుపు సమ్మెపై హైదరాబాద్‌ మెట్రో యాజమాన్యం (Metro Officials) స్పందించింది. ఈ మేరకు ధర్నాలో పాల్గొన్న వాళ్లపై చర్యలు తప్పవని మంగళవారం హెచ్చరించింది.

Suresh Babu Clears Traffic: జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ కంట్రోల్ చేసిన సినీ నిర్మాత సురేశ్ బాబు.. వీడియో వైరల్

Rudra

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకున్నది. ఫిల్మ్ నగర్ వద్ద ఇటీవల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో, అటువైపు వెళ్తున్న ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు తన కారు నుంచి కిందకు దిగి ట్రాఫిక్ ను కంట్రోల్ చేశారు.

Free Electricity For Farmers: బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్తు, దళితబిడ్డలకు దళితబంధు.. సీఎం కేసీఆర్‌ స్పష్టం

Rudra

బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్తునిస్తామని.. దళితబిడ్డలకు దళితబంధు పథకాన్ని అమలుచేస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. బీఆర్‌ఎస్‌కు అధికారమిస్తే.. రెండేండ్లలో వెలుగు జిలుగుల భారతదేశంగా మారుస్తామని ప్రకటించారు.

Weather Updates: ఉత్తర కోస్తాలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

Rudra

ఉత్తర కోస్తాలోని పలు చోట్ల నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావవరణ శాఖ తెలిపింది. రాయలసీమలో మాత్రం వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొంది.

Advertisement

BRS Makes Foray Into AP: ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కారు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు, సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, BRSలో చేరిన మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, తోట చంద్రశేఖర్, పార్థసారధి

Hazarath Reddy

తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు నేతలు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు (Former BJP Leader Ravela Kishore Babu), తోట చంద్రశేఖర్, పార్థసారధి బీఆర్‌ఎస్‌లోకి చేరారు. సీఎం కేసీఆర్‌ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు

MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్, సిట్‌ మెమోను కొట్టివేసిన హైకోర్టు, ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన న్యాయస్థానం

Hazarath Reddy

తెలంగాణలో సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌కు చుక్కెదురైంది. తెలంగాణ ప్రభుత్వ దాఖలు చేసిన రివిజన్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. కాగా ఏసీబీ కోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్‌ చేసిన సంగతి విదితమే.

Andhra Pradesh: ఏపీలో కేసీఆర్ అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేసి ప్రజలకు కానుకగా అందిస్తారు, సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి మల్లారెడ్డి

Hazarath Reddy

రాష్ట్ర విభజన జరిగిన ఎనిమిదేళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టును (Polavaram ) పూర్తి చేయలేకపోయారని, ఏపీలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టును ఎలాగైతే పూర్తి చేశారో.. అదే తరహాలో పోలవరాన్ని పూర్తి చేసి, ఆంధ్రా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ, అభివృద్ధి చేస్తారని మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Venkaiah Naidu: నేను ముందుగా రిటైరైపోయానేమో, రాజకీయాలపై వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు, తాను మళ్లీ రాజకీయాల్లోకి రానని, వాటిలో జోక్యం చేసుకోనని స్పష్టం

Hazarath Reddy

రాజకీయాలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చాలా ముందుగా రిటైరైపోయానేమోనని అనిపిస్తోందని వెంకయ్య నాయుడు అన్నారు. అయినప్పటికీ రాజకీయాల్లో తనకెలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు.

Advertisement

Hyderabad Metro Trains:మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 12 గంటల వరకు మెట్రో సేవలు, సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరిన మెట్రో రైలు ఎండీ

Hazarath Reddy

భాగ్య నగరంలోని నాంపల్లిలో ఆదివారం నుంచి ప్రారంభమైన నుమాయిష్ (numaish) సందర్శకుల కోసం మెట్రో సర్వీసులను (Hyderabad Metro Trains) అధికారులు పొడిగించారు. ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు మెట్రో ఆఖరి రైలు బయలుదేరుతుండగా.. దానిని రాత్రి 12 గంటల వరకు పొడిగించారు.

Vaikuntha Ekadashi 2023: వైకుంఠ ఏకాదశి, భక్తులతో కిటకిటలాడుతున్న గుడులు, ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న తెలుగు రాష్ట్రాలు ప్రముఖ ఆలయాలు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి (Vaikuntha Ekadashi 2023) సందర్భంగా ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేదీప్యమానంగా వెలిగిపోతూ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. పవిత్ర పర్వదినం కావడంతో ఆలయాల దర్శనం కోసం భక్తులు వేకువ ఝాము నుంచే ఆలయాల వద్ద క్యూ కడుతున్నారు.

Shafth Ali Khan: నలుగురు చిన్నారులను చంపేసిన చిరుత వేటకు హైదరాబాద్ షార్ప్ షూటర్ షఫత్ అలీఖాన్

Rudra

పలామూ డివిజన్‌లో గత 20 రోజుల్లో నలుగురు చిన్నారులను పొట్టనపెట్టుకున్న చిరుతను బంధించేందుకు హైదరాబాద్ షార్ప్ షూటర్ నవాబ్ షఫత్ అలీఖాన్ సిద్ధమవుతున్నారు.

Vaikuntha Ekadashi: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు.. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. వీడియోలతో

Rudra

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఈ తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. తిరుమల, అన్నవరం, ద్వారకా తిరుమల, మంగళగిరి, విజయవాడ, అనంతపురం, యాదాద్రి, భద్రాచలం, ధర్మపురి ఆలయాలకు భక్తులు పోటెత్తారు.

Advertisement

Khammam Politics: కాకరేపుతున్న ఖమ్మం జిల్లా రాజకీయాలు, పోటాపోటీగా విందు రాజకీయాలు, కేసీఆర్‌కు తలనొప్పిగా మారుతున్న తుమ్మల-పొంగులేటి వ్యవహారం

VNS

ఉమ్మడి ఖమ్మం జిల్లా (Khammam Politics) రాజకీయం మరింత హీట్ ఎక్కింది. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటాపోటీ సభలతో ఖమ్మం పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. ఖ‌మ్మం జిల్లాలోని నేత‌లు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి ()Ponguleti Srinivas Reddy, అలాగే మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావులు వేర్వేరుగా స‌మ్మేళ‌నాలు నిర్వ‌హించారు.

Telangana: అయ్యప్ప స్వామిని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మరో వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు, కొనసాగుతున్న అరెస్టుల పరంపర

kanha

తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో అయ్యప్ప స్వామిని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కరీంనగర్‌లోని కమలాపూర్ పోలీసులు బైరి అగ్నితేజ్‌ను అదుపులోకి తీసుకుని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అతడిపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

APSRTC Special Offer: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరపై రాయితీ..

Rudra

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒకేసారి నలుగురికి (పిల్లలు సహా) టికెట్లు కొంటే ఛార్జీలపై 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. తిరుగు ప్రయాణానికి కూడా ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకుంటే ఆ టికెట్ల ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చని వెల్లడించింది.

New Year Party: కళ్లు మిరుమిట్లు గొలిపే రీతిలో 2023కి స్వాగతం పలికిన సిడ్నీ నగరం... ఆనందోత్సాహాల్లో హైదరాబాదీలు, వైజాగ్ ప్రజలు.. వీడియోలు ఇవిగో!

Rudra

ప్రపంచంలోని పలు దేశాలు 2023 సంవత్సరానికి ఘనస్వాగతం పలికాయి. ఆస్ట్రేలియా కూడా నూతన సంవత్సరాదిని అట్టహాసంగా ఆహ్వానించింది. తూర్పు తీరంలోని సిడ్నీ నగరం బాణసంచా వెలుగులతో నిండిపోయింది.

Advertisement
Advertisement