తెలంగాణ
Hyderabad: వీడియో, పాతబస్తీలో యువకులు ర్యాష్ డ్రైవింగ్,గన్ చూపించి వారికి చుక్కలు చూపించిన మీర్‌చౌక్‌ ఎస్సై, కారు దిగి తనిఖీలకు పూర్తిగా సహకరించిన యువకులు
Hazarath Reddyపాతబస్తీలోని మీర్‌చౌక్‌ ఏసీపీ ప్రసాద్‌ రావు ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామున పాతబస్తీ ఎతేబార్‌చౌక్‌ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా కొందరు యువకులు ఓపెన్‌ టాప్‌ కారులో ఆపకుండా వెళ్లే ప్రయత్నం చేశారు. విధి నిర్వహణలో మీర్‌చౌక్‌ ఎస్సై దీన్ని గమనించి వెంటనే తన పౌచ్‌లో ఉన్న గన్‌ను చేతిలోకి తీసుకుని కారు కిందకు దిగండి అంటూ బిగ్గరగా ఆరిచాడు.
Rythu Bandhu: తెలంగాణలో రేపటి నుండి పదో విడత రైతుబంధు, 70.54 లక్షల మంది రైతుల ఖాతాలలో ఎకరానికి రూ.5 వేలు చొప్పున జమ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం
Hazarath Reddyఅర్హులయిన 70.54 లక్షల మంది రైతుల ఖాతాలలోకి రేపటి నుండి ఎకరానికి రూ.5 వేలు చొప్పున తెలంగాణ ప్రభుత్వం జమ చేయనుంది. మొత్తం కోటి 53 లక్షల 53 వేల ఎకరాలకు యాసంగి రైతుబంధు వర్తించనుంది. మొత్తం పదో విడతతో రూ. 65,559.28 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయి. పదో విడత రైతుబంధు కింద రూ. 7676.61 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
Errabelli Dayaker Rao: వీడియో, రైతు అవతారం ఎత్తిన ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, గొర్రు పట్టి ఎడ్లను సై అన్న తెలంగాణ మంత్రి
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు రైతుగా అవ‌తార‌మెత్తాడు. తన స్వగ్రామం పర్వతగిరిలోని సొంత పొలంలో పనులు జరుగుతుంటే చూసి, వెంటనే పొలంలోకి వెళ్లాడు… గొర్రు పట్టి ఎడ్లనుసై అన్నారు..ఎర్రబెల్లి దయాకర్ రావు. కూలీల‌తో క‌లిసి, వారి పాట‌ల‌కు గొంతు కలిపి నాట్లు వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇదే..
Vaikunta Dwara Darshanam: తిరుమలలో జనవరి 2 నుంచి వైకుంఠద్వార దర్శనం... 1వ తేదీ నుంచి టోకెన్ల జారీ
Rudraతిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. దర్శన టికెట్లు ఉన్న భక్తులకే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. తిరుపతిలో జనవరి 1వ తేదీ నుంచి 9 చోట్ల టోకెన్లు జారీ చేయనున్నారు.
COVID-19 Mock Drill: దేశవ్యాప్తంగా నేడు కొవిడ్‌ ఆసుపత్రుల్లో మాక్‌డ్రిల్‌.. కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్రం అప్రమత్తం
Rudraప్రపంచవ్యాప్తంగా మరోసారి కొవిడ్‌ మహమ్మారి సర్వత్రా ఆందోళనకు గురి చేస్తున్నది. డ్రాగన్‌ దేశం చైనా సహా పలు దేశాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది. ఈ క్రమంలో కేంద్ర అప్రమత్తమై ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా మంగళవారం కొవిడ్‌ ఆసుపత్రుల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించనున్నది.
Electric Luna Launch Soon: వచ్చే ఏడాది వస్తున్న లూనా ఎలక్ట్రిక్ వెర్షన్.. సెప్టెంబరులో మార్కెట్లోకి..
Rudraలూనా మాతృసంస్థ కైనెటిక్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (కేఈఎల్) తన అనుబంధ సంస్థ కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ ద్వారా వచ్చే ఏడాది సెప్టెంబరులో ఎలక్ట్రిక్ లూనాను మార్కెట్లోకి తీసుకురానుంది.
Devotees Visiting: భక్తులు అత్యధికంగా సందర్శించిన ఆలయాల్లో తిరుమలకు రెండోస్థానం.. మొదటి స్థానంలో ఏ పుణ్యక్షేత్రం ఉందంటే??
Rudraఈ ఏడాది భక్తులు అత్యధికంగా దర్శించుకున్న పుణ్యక్షేత్రాల్లో తిరుమల రెండో స్థానంలో నిలిచింది. కరోనా ఆంక్షల కారణంగా గతేడాది తక్కువ సంఖ్యలో భక్తులు సందర్శించుకోగా, ఈసారి ఆంక్షల సడలింపుతో వారి సంఖ్య పెరిగింది.
MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్, తీర్పు తుది కాపీ వచ్చేదాకా ఆదేశాలను సస్పెన్షన్‌లో ఉంచాలని తెలిపిన హైకోర్టు, అప్పటివరకు తీర్పును ఇంప్లిమెంట్‌ చేయొద్దని కోరిన సిట్‌ తరపున రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌
Hazarath Reddyతెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల తుది కాపీ వచ్చేదాకా.. కేసు సీబీఐ కి ఇస్తూ ఇచ్చిన ఆదేశాలను సస్పెన్షన్‌లో ఉంచాలని, తీర్పును ఇంప్లిమెంట్‌ చేయొద్దని సిట్‌ తరపున రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ కోరారు. దీనికి హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు.
MLAs Poaching Case: ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక మలుపు, కేసును సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేసిన తెలంగాణ హైకోర్టు, సిట్‌ విచారణ నిలిపివేయాలంటూ ఆదేశాలు
Hazarath Reddyతెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో (MLAs Poaching case)..తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసును సీబీఐ విచారణకు అనుమతిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది.
Telangana: చికిత్స పొందుతూ చేర్యాల జెడ్పీటీసీ సభ్యుడు మృతి, వాకింగ్‌కు వెళ్లిన మల్లేశంపై గొడ్డళ్లు, కత్తులతో దాడి చేసిన దుండుగులు
Hazarath Reddyతెలంగాణలో వాకింగ్‌ వెళ్లిన చేర్యలా జెడ్పీటీసీ సభ్యుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసిన ఘటన చేర్యాల మండలం గుర్జకుంటలో చోటుచేసుకుంది. చేర్యాల జెడ్పీటీసీ శెట్టె మల్లేశంపై గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం ఉదయం దాడికి పాల్పడ్డారు
Accident In Hyderabad: హైదరాబాద్ లో టిప్పర్ బీభత్సం.. గచ్చిబౌలి సిగ్నల్ దగ్గర వాహనాలపైకి దూసుకెళ్లిన వాహనం.. ఒకరి మృతి.. మరో ఐదుగురికి గాయాలు
Rudraహైదరాబాద్ లోని గచ్చిబౌలిలో సోమవారం ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. సిగ్నల్ దగ్గర ఆగిన నాలుగు కార్లు, రెండు బైక్ ల పైకి దూసుకెళ్లింది. స్విగ్గీ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న నసీర్ అనే యువకుడు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
Purse Saves Women: బస్సులో పారేసుకున్న పర్సు యువతి ప్రాణాలు కాపాడింది.. హైదరాబాద్ లో ఘటన
Rudraనిజజీవితంలో కొన్నిసార్లు జరిగే సాధారణ ఘటనలు ఊహించని ఫలితాలను ఇస్తాయి. ఓ యువతి బస్సులో ప్రయాణిస్తూ పారేసుకున్న పర్సు ఆమె ప్రాణాలను కాపాడింది. హైదరాబాద్ లో జరిగిందీ ఘటన.
Bobby Deol joins Hari Hara Veera Mallu: పవన్ ‘వీరమల్లు’లో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్.. ప్రకటించిన చిత్ర బృందం
Rudraజాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పుడు ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
Rajiv Swagruha Towers: రాజీవ్ స్వగృహ టవర్లను అమ్మేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. నోటిఫికేషన్ విడుదల
Rudraరాజీవ్ స్వగృహ ప్లాట్లను గతంలో విక్రయించిన తెలంగాణ ప్రభుత్వం ఈసారి ఏకంగా టవర్లనే అమ్మకానికి పెట్టింది. హైదరాబాద్‌లోని పోచారం, గాజులరామారంలో పనులు పూర్తికాని రాజీవ్ స్వగృహ టవర్ల విక్రయానికి సంబంధించి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.
Corona Tests: ఈ ఐదు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పనిసరి.. కేంద్రం ప్రకటన
Rudraచైనాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఈ దేశంతో పాటు పలు దేశాల్లో మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమయింది. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఐదు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించాలని ఆదేశించింది.
Corona Alert: ఫోర్త్ వేవ్ పై అప్రమత్తంగా ఉన్నాం.. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడి
Rudraకరోనా ఫోర్త్ వేవ్ పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. వైద్య, ఆరోగ్యశాఖ అన్ని జాగ్రత్తలను తీసుకుంటోందని తెలిపారు. కొవిడ్ టెస్టులను పెంచామని తెలిపారు.
Chalapathi Rao Passes Away: టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నటుడు చలపతిరావు కన్నుమూత
Rudraటాలీవుడ్ లో వరుసగా విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిసి 24 గంటలు కూడా గడవక ముందే మరో సీనియర్ నటుడు చలపతిరావు మృతి చెందడంతో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.
BRS Focuses on AP: ఆంధ్రప్రదేశ్‌లోనూ బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్‌, జనవరి చివరినాటికి విజయవాడలో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్, భారీ బహిరంగ సభకు ప్లాన్
VNSఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే పార్టీ కార్యక్రమాలు ప్రారంభించేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. వచ్చే నెల నుంచి వివిధ కార్యక్రమాలకు పార్టీ రూపకల్పన చేస్తోంది. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టనున్నట్లు, దీని కోసం ఓ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రారంభించనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Rajiv Swagruha Flats: హైదరాబాద్‌లో రూ. 15లక్షలకే ఫ్లాట్ అందిస్తున్న సర్కారు, తక్కువధరలో అపార్ట్‌మెంట్ కోసం చూస్తున్నారా? అయితే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి, నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
VNSఇప్పటికే రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను విడిగా అమ్మకానికి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు సంబంధించిన టవర్లను కూడా అమ్మేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్‌ నగరంలోని పోచారం (Pocharam), గాజులరామారంలోని (Gajula ramaram) మొత్తం పనులు పూర్తి కాని రాజీవ్ స్వగృహ టవర్ల విక్రయానికి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.
TSPSC Job Notification: ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల్లో 581 పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేషన్ విడుదల
kanhaతెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TSPSC) వివిధ సంక్షేమ శాఖలలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-I మరియు II, మాట్రాన్ గ్రేడ్-I మరియు II, వార్డెన్ గ్రేడ్-I మరియు II, మరియు లేడీ సూపరింటెండెంట్ 581 ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.