తెలంగాణ

Shock to Narayana: అమెరికా విమానాశ్రయంలో సీపీఐ అగ్రనేత నారాయణకు చేదు అనుభవం.. అమెరికా వీసా ఉన్నా విచారణ కోసం ఆపేసిన ఇమిగ్రేషన్ అధికారులు.. ఫోన్‌లో క్యూబా దేశాధ్యక్షుడితో దిగిన ఫోటోను చూసి నారాయణను సుమారు 6 గంటలపాటు అక్కడే నిలిపేసిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది

Sriyansh S

కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాల్లో పాల్గొనేందుకు క్యూబా వెళ్లిన సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణను ఫ్లోరిడా విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఫ్లోరిడా విమానాశ్రయంలో ఆయన ప్రయాణ వివరాలను అడిగిన సిబ్బంది... ఫోన్‌లో క్యూబా దేశాధ్యక్షుడితో దిగిన ఫోటోను చూసి సుమారు 6 గంటలపాటు అక్కడే ఆపారు.

VIP Darshan at Yadadri: తిరుమల తరహాలో యాదాద్రిలోనూ బ్రేక్ దర్శనాలు ప్రారంభం.. ఉదయం 9-10, సాయంత్రం 4-5 గంటల మధ్య బ్రేక్ దర్శనాలు.. టికెట్ రూ. 300.. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా టికెట్లు తీసుకున్న 292 మంది భక్తులు.. చంద్రగ్రహణం సందర్భంగా 8న ఆలయం మూత

Sriyansh S

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో తిరుమల తరహా బ్రేక్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో నిన్నటి నుంచి వీవీఐపీ, వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రవేశపెట్టారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 వరకు రెండు గంటలపాటు బ్రేక్ దర్శనాలు కల్పిస్తున్నట్టు ఆలయ ఈవో గీత తెలిపారు.

Telangana: తెలంగాణలో సీబీఐకి నో ఎంట్రీ, ఇంతకీ ఆ జీవో 51లో ఏముంది, రెండు నెలల క్రితమే జారీ చేస్తే ఇప్పుడు ఎందుకు బయటకు తీశారు, జనరల్ కన్సెంట్ ఉపసంహరణపై ప్రత్యేక కథనం

Hazarath Reddy

రాష్ట్రంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) దర్యాప్తునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐకి గతంలో ఇచ్చిన జనరల్ కన్సెంట్ ను (general consent) ఉపసంహరించుకుంది. దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన సమ్మతిని ఉపసంహరించుకుంటూ జీవో 51ను ఆగస్టు 30న జారీ చేసింది.

KA Paul as Shepherd: మునుగోడు ఉప ఎన్నిక బరిలో పోటీ చేస్తున్న కేఏ పాల్ రోజుకో అవతారం.. తాజాగా గొర్రెలు కాసిన ప్రజాశాంతి పార్టీ అధినేత... వీడియో వైరల్.. ఇంతకీ ఆయన ఏమన్నారంటే??

Sriyansh S

మునుగోడు ఉప ఎన్నిక బరిలో పోటీ చేస్తున్న కేఏ పాల్ రోజుకో అవతారంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా గొర్రెల కాపరి వేషంలో దర్శనమిచ్చారు. నియోజకవర్గం పరిధిలో కాసేపు గొర్రెలు కాశారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడారు.

Advertisement

Metro Shock: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్.. పెరగనున్న చార్జీలు!.. చార్జీలను పెంచాలంటూ కేంద్రాన్ని కోరిన హైదరాబాద్ మెట్రో.. ఫేర్ ఫిక్స్‌ డ్ కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం.. నవంబరు 15లోగా సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రయాణికులను కోరిన కమిటీ

Sriyansh S

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు ఇది షాకింగ్ వార్తే. త్వరలోనే మెట్రో చార్జీలు పెరగనున్నాయి. చార్జీలను పెంపుదల చేయాలన్న హైదరాబాద్ మెట్రో అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఫేర్ ఫిక్స్‌ డ్ కమిటీ (ఎఫ్ఎఫ్‌సీ)ని ఏర్పాటు చేసింది.

Accident: ఆదిలాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం.. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న కారు.. సీతాగొంది వద్ద కంటెయినర్‌ను ఢీకొన్న వాహనం.. మృతులను ఆదిలాబాద్ వాసులుగా గుర్తించిన పోలీసులు

Sriyansh S

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న కారు సీతాగొంది వద్ద కంటెయినర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు పురుషులు, ఓ మహిళ ఉన్నారు.

Six Year Girl Raped: తల్లితో సహజీవనం చేస్తూ ఆరేళ్ల బాలికపై తండ్రి వరుసయ్యే వ్యక్తి అత్యాచారం, తల్లికి తెలిసి కూడా బయటపెట్టకుండా నిందితుడికే సపోర్ట్, మూడు రోజులు చికిత్స పొందుతూ మృతిచెందిన చిన్నారి, నిజామాబాద్‌లో దారుణం

Naresh. VNS

అత్యాచారం విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలిక తల్లి లావణ్యను బెదిరించాడు గోవిందరావు. పోలీసులు కేసు నమోదు చేస్తే పాపకు పోస్టుమార్టం చేస్తారని, అందుకే సహజ మరణంగా చెప్పి ఆసుపత్రి నుంచి బాలిక (Six year old girl raped ) మృతదేహాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే ఆసుపత్రి సిబ్బంది డిచ్ పల్లి పోలీసులకు ప్రాథమిక సమాచారం అందించారు.

CM KCR: మునుగోడు సభలో గర్జించిన కేసీఆర్, వందకోట్లతో కొనాలని చూస్తే, ఎడమకాలి చెప్పుతో కొట్టారు మా ఎమ్మెల్యేలు, మోదీ ఎందుకు ఇంత కిరాతకం..

kanha

మునుగోడు ఎన్నికల సభలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన కేంద్రంలోని మోడీ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు ప్రస్తుతం తెలంగాణా రాజకీయాల్లో సంచలనంగా మారిన నలుగురు ఎమ్మెల్యేలు కొనుగోలు వ్యవహారంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు

Advertisement

Ancient Stoneware: ఈ పాత్ర రెండువేల ఏళ్ల నాటిది.. బాన్సువాడలో బయటపడింది.. బోర్లాం గ్రామంలో మట్టి దిబ్బపై లభ్యం.. ప్రాకృత భాష, బ్రహ్మీలిపిలో లఘుశాసనం.. శాతవాహన కాలం నాటి చారిత్రక అవశేషంగా గుర్తింపు

Sriyansh S

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రెండువేల సంవత్సరాల నాటి పాత్ర లభ్యమైంది. ఈ మేరకు తెలుగు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, పబ్లిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ హెరిటేజ్ సంస్థ (ప్రిహా) ప్రధాన కార్యదర్శి ఎంఏ శ్రీనివాస్ తెలిపారు.

Bandla Politics: రాజకీయాలకు గుడ్ బై చెప్పిన బండ్ల గణేశ్.. కుటుంబ బాధ్యతలు, వ్యాపారాలతో బిజీ అని వివరణ

Sriyansh S

టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

Samantha: మయోసైటిస్‌ అనే వింత వ్యాధితో బాధపడుతున్న సమంత, ఇన్ స్టాగ్రాం పోస్టు ద్వారా వెల్లడి

kanha

EC Notice: ఓటర్లను బెదిరించే ప్రయత్నం చేశారన్న ఆరోపణలపై తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డికి నోటీసులిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం.. జగదీశ్ రెడ్డిపై సీఈసీకి లేఖ రాసిన బీజేపీ నేత కపిలవాయి

Sriyansh S

ఓటర్లను బెదిరింపులకు గురిచేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణల నేపథ్యంలో, తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేత కపిలవాయి దిలీప్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

Advertisement

KA Paul in Munugode: మొన్న పాటలు.. నిన్న డ్యాన్సులు.. మరి ఇప్పుడు..? మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో కేఏ పాల్ ఊపు.. కొత్త కొత్త వేషధారణతో ఆకట్టుకునే యత్నం.. నెటిజన్లకు ఫుల్ పసంద్.. రైతు వేషంలో సైకిల్ తొక్కుతూ తాజాగా పాల్ ఎన్నికల ప్రచారం... వీడియో ఇదిగో!

Sriyansh S

మునుగోడులో ఉప ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రచారంలో ఊపు పెంచారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ప్రజలతో కలిసి డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ ఉత్సాహంగా ముందుకెళుతున్నారు.

TRS MLAs Poaching Row: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగొలు కుట్ర ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్, ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి, స్వామిజీ రామచంద్ర భారతి ఆడియో లీక్

Hazarath Reddy

తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక వేళ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కోనుగొలు కుట్ర ఎపిసోడ్‌ (TRS MLAs Poaching Row) హాట్‌టాపిక్‌గా మారింది.రెండు రోజుల నుంచి ఈ వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. అధికార టీఆర్‌ఎస్‌ ప్రతిపక్ష బీజేపీ మధ్య ఈ ఎపిసోడ్ రాజకీయ రగడ రాజేస్తుంది. నువ్వా-నేనా అంటూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి కాలుదువ్వుతున్నారు.

TRS MLAs Poaching Row: ఎమ్మెల్యేల కొనుగోలుతో మా పార్టీకి, నాకు గానీ ఎలాంటి సంబంధం లేదు, యాదాద్రి లక్ష్మినరసింహస్వామి దేవాలయంలో ప్రమాణం చేసిన బండి సంజయ్

Hazarath Reddy

తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ, అధికార టీఆర్‌ఎస్‌ మధ్య పొలిటికల్‌ వార్‌ నడుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల వేళ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కోనుగొలు (MLAs Buy Row) ఎపిసోడ్‌ రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.

Munugode Bypoll 2022: మునుగోడు ఉప ఎన్నికలో మరో ట్విస్ట్, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కేఎంవీ జగన్నాథరావును తక్ష ణమే సస్పెండ్‌ చేయాలని ఈసీ ఆదేశాలు

Hazarath Reddy

తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కేఎంవీ జగన్నాథరావును (RO KMV Jagannadha Rao ) తక్ష ణమే సస్పెండ్‌ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఆదేశించింది.

Advertisement

Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్, శ్రీలంక, మధ్య తమిళనాడు మీదుగా అల్పపీడనం, అది వాయుగుండగా మారే అవకాశం, అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు మూడు నెలల పాటు విస్తారంగా వర్షాలు

Hazarath Reddy

ఈ శాన్య రుతుపవనాల ఆగమనంతో అక్టోబర్ 28 రాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీలంక, మధ్య తమిళనాడు మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

SI Commits Suicide: రైల్వే ట్రాక్‌పై తలపెట్టి బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ ఎస్సై ఆత్మహత్య, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు

Hazarath Reddy

బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ ఎస్సై రమణ బలవన్మరణానికి పాల్పడ్డాడు. మల్కాజ్‌గిరి పరిధిలోని మౌలాలి రైల్వే ట్రాక్‌పై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. అటుగా వెళ్లిన పలువురు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు రమణగా గుర్తించారు.

Telangana: ఎమ్మెల్యేల కొనుగోలుకు రూ. 100 కోట్ల డీల్ కేసు అప్‌డేట్స్ , విచారణను వేగవంతం చేసిన పోలీసులు, టీఆర్ఎస్ ఒక డ్రామా కంపెనీ అంటూ బీజేపీ విమర్శలు, ధర్నాకు పిలుపునిచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Hazarath Reddy

ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలు తెలంగాణలో (Telangana) కలకలం సృష్టిస్తున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు (buying TRS MLAs) బేరసారాలు జరిగిన వ్యవహారంపై విచారణను పోలీసుల వేగవంతం చేశారు.మొయినాబాద్‌ సమీపంలోని ఫాంహౌస్‌లో పట్టుబడిన ముగ్గురు నిందితులను ప్రశ్నిస్తున్నారు.

US Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు తెలుగు విద్యార్థులు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు, ట్రక్కును ఢీకొట్టిన మినీ వ్యాన్

Hazarath Reddy

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన ముగ్గురు విద్యార్థులు (Three students from Telugu states) మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.మంగళవారం కనెక్టికట్ రాష్ట్రంలో ట్రక్కు మరియు మినీ వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో ఈ ప్రమాదం జరిగింది.

Advertisement
Advertisement