తెలంగాణ
Telugu States Weather Report: తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షసూచన, రాబోయే వారం రోజుల పాటూ ఈ ప్రాంతాల్లో వర్షాలు
VNSబంగాళాఖాతంలో ఈ నెల 15 నాటి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ (IMD) పేర్కొంది. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం విస్తరించే సూచనలున్నాయని.. ఆదివారానికి ఇది అల్పపీడనంగా (Low Pressure) బలపడుతుందని పేర్కొంది. అల్పపీడనంగా మారిన తర్వాత 48 గంటల్లు పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తూ తమిళనాడు తీరానికి చేరువవుతుందని పేర్కొంది.
CM Revanth Reddy on Allu Arjun Arrest: అల్లు అర్జున్ ఏమైనా ఇండియా పాకిస్తాన్ బార్డర్లో యుద్ధం చేశాడా, అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన రేవంత్ రెడ్డి, సినిమాలో డబ్బులు పెట్టాడు సంపాదించుకున్నాడని వెల్లడి
Hazarath Reddyఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఓ జాతీయ మీడియాతో సీఎం మాట్లాడుతూ.. ‘‘ఓ మహిళ చనిపోయింది. ఆమె కొడుకు ప్రాణాలతో పోరాడుతున్నాడు. ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా?. ఘటనపై క్రిమినల్ కేసు నమోదైంది.
Allu Arjun Gets Interim Bail: అల్లు అర్జున్ కేసులో హైకోర్టులో సాగిన వాదనలు ఇవే, మధ్యంతర బెయిల్ విషయంలో అర్నాబ్ గోస్వామి కేసును పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం
Hazarath Reddyపుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో ఆరెస్ట్ అయిన అల్లు అర్జున్‌కు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది
Allu Arjun Arrest Row: అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు
Hazarath Reddyఅల్లు అర్జున్‌కు హైకోర్టులో కాస్త ఊరట లభించింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ బన్ని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనలు విన్న హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Allu Arjun Arrest Row: అల్లు అర్జున్ కేసులో మరో ట్విస్ట్, కీలకంగా మారిన సంధ్య థియేటర్ యాజమాన్యం పర్మిషన్ లేఖ ఇదే..
Hazarath Reddyసంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బన్నీని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు. పీఎస్ లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. తాజాగా నాపంల్లి కోర్లు 14 రోజుల జ్యుడిషయల్ రిమాండ్ విధించింది
Weather Forecast: బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు, వాయుగుండంగా మారే అవకాశం, ఏపీకి భారీ వర్షాలు తప్పవని సూచన, తెలంగాణను చంపేస్తోన్న చలి పులి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పట్లో వర్షాలు వీడే సూచనలు కనపడటం లేదు. ఫెంగల్ తుఫాను తీసుకొచ్చిన నష్టం మరువక ముందే మరో పిడుగు లాంటి వార్త ఏపీని కలవరపెడుతోంది. రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నట్లుగా ఐఎండీ తెలిపింది.
Bandi Sanjay On Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌ను తప్పుబట్టిన కేంద్రమంత్రి బండి సంజయ్, తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని మండిపాటు
Arun Charagondaనటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌ను తప్పుబట్టారు కేంద్రమంత్రి బండి సంజయ్. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి దురదృష్టకరం అని..ఈ తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యమే కారణం అని ఆరోపించారు.
Harishrao: జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరం, థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరే కారణం..సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్
Arun Charagondaహైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనపై అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. వైద్య పరీక్షల నిమిత్తం బన్నీని నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.
Allu Arjun Arrest Live Updates: నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్, రిమాండా లేదా క్వాష్ పిటిషన్‌పై విచారణా? అనే ఉత్కంఠ
Arun Charagondaసంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బన్నీని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు. అక్కడి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు పోలీసులు. అల్లు అర్జున్‌కు బెయిల్ వస్తుందా లేదా అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.
CM Revanth Reddy On Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి, చట్టం ముందు అంతా సమానమే, బన్నీ అరెస్ట్‌లో తన జోక్యం ఉండదని స్పష్టం చేసిన తెలంగాణ సీఎం
Arun Charagondaనటుడు అల్లు అర్జున్ అరెస్ట్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒకరు చనిపోవడంతో పోలీసులు చర్య తీసుకున్నారని ఇందులో తన జోక్యం ఉండదని స్పష్టం చేశారు.
Allu Arjun Arrest: అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై విచారణకు కోర్టు గ్రీన్ సిగ్నల్, సాయంత్రం నాలుగు గంటలకు విచారణ, ప్రభుత్వ తరపు లాయర్ వాదనలే కీలకం కానున్నాయా..
Hazarath Reddyఅల్లు అర్జున్ క్వాష్ పిటిషన్, అరెస్టు నుంచి రక్షణ పిటిషన్ పై విచారణ సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేసింది హైకోర్టు. ప్రభుత్వ తరపు లాయర్ వాదనలే కీలకం అవుతాయని భావిస్తున్నారు.
Allu Arjun Arrest: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్ మామ, మరీ ఇలా బెడ్ రూం లోకి వచ్చి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని బన్ని మండిపాటు, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyచిరంజీవిని పోలీస్ స్టేషన్‌కు రావొద్దని పోలీసులు అభ్యర్థించారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ వద్దకు నిర్మాత దిల్ రాజు చేరుకున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి చేరుకున్నారు.
Allu Arjun Arrest: గాంధీ ఆస్పత్రికి అల్లు అర్జున్ తరలింపు, వైద్య పరీక్షలు తరువాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం, చిక్కడపల్లి పీఎస్ కు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్
Hazarath Reddyసంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బన్నీని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు. పీఎస్ లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. పోలీసులు ప్రస్తుతం రిమాండ్ రిపోర్టును తయారు చేస్తున్నారు
KTR On Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌ని ఖండించిన కేటీఆర్...సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్, జాతీయ పురస్కారం అందుకున్న స్టార్‌ను అరెస్ట్ చేయడం దారుణమన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
Arun Charagondaఅల్లు అర్జున్ అరెస్టును ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . జాతీయ పురస్కారం అందుకున్న స్టార్‌ను అరెస్టు చేయడం పాలకుల అభద్రతాభావానికి ఇది పరాకాష్ట అని విమర్శించారు.ప్రభుత్వ తీవ్ర చర్యను ఖండిస్తున్నానని తెలిపారు. హైడ్రా కూల్చివేతలతో ఇద్దరి చావుకు బాధ్యుడైన రేవంత్ రెడ్డిని కూడా ఇదే లాజిక్‌తో అరెస్టు చేయాలని సూచించారు.
GST Notices To Zomato: జొమాటోకు మరోసారి జీఎస్‌టీ నోటీసులు, కస్టమర్ల నుండి వసూలు చేసిన రూ.803.4 కోట్ల బకాయిలు చెల్లించాల్సిందేనని ఆదేశం
Arun Charagondaప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు మరోసారి జీఎస్‌టీ నోటీసులు జారీ చేసింది. కస్టమర్ల నుంచి వసూలు చేసిన డెలివరీ ఫీజుపై జీఎస్‌టీకి సంబంధించిన బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ పేర్కొంది.ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్ సందర్భంగా కంపెనీ తెలిపింది. మొత్తం రూ.803.4 కోట్ల జీఎస్‌టీ కట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది.
Telangana: గంట ముందే స్కూల్ నుండి వెళ్లిందని విద్యార్థిని చెయ్యి విరగ్గొట్టిన టీచర్, స్కూల్ ముందు తల్లిదండ్రుల ఆందోళన, పోలీసులకు ఫిర్యాదు
Arun Charagondaనిజామాబాద్ - దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో నుంచి గంట ముందే పదో తరగతి విద్యార్థిని(అశ్విత) ఇంటికి వెళ్లింది.. అయితే ఆగ్రహించిన టీచర్ మరుసటి రోజు ఉదయం విద్యార్థినిపై చేయి చేసుకోవడంతో విద్యార్థిని చెయ్యి విరిగింది. దీంతో ఆగ్రహించిన పేరెంట్స్ స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు.విద్యార్థినిని కొట్టిన మహిళా టీచర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Hyderabad: ఆన్‌లైన్‌లో విషం ఆర్డర్ చేసుకుని తాగి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య, భర్త వేధింపులే కారణమని పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు
Arun Charagondaఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకున్న విషం తాగి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడింది. మియాపూర్ లో భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగలక్ష్మి. 5 నెలల క్రితమే కాంట్రాక్టర్ మనోజ్ తో నాగలక్ష్మికి వివాహం జరిగింది. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకున్న విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది నాగలక్ష్మీ. భర్త పై పోలీసులకు ఫిర్యాదు చేశారు మృతురాలి తల్లితండ్రులు.
Harishrao: ఉత్సవాల పేరుతో కోట్లాది రూపాయలు వృధా, కనీసం విద్యార్థులకు అన్నం పెట్టలేని స్థితిలో సీఎం రేవంత్ రెడ్డి, అక్రమ కేసులు కాదు విద్యార్థులకు అన్నం పెట్టాలని హరీశ్ రావు ఫైర్
Arun Charagonda3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ,బీసీ పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రశాంత్ నగర్ ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ హాస్టల్ అకస్మిక తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు హరీష్ రావు.
Mohan Babu Apologize: ఆ జర్నలిస్టుకు క్షమాపణలు చెబుతున్నా.. అతను త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా.. మోహన్ బాబు లేఖ
Rudraతన నివాసం వద్ద టీవీ9 రిపోర్టర్ మీద జరిగిన దాడికి సంబంధించి సదరు జర్నలిస్టుకు నటుడు మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు.