తెలంగాణ

Nizamabad: నిజామాబాద్‌లో అంతర్రాష్ట దొంగల ముఠా కలకలం, భారీ మొత్తంలో దోచుకెళ్లిన దొంగలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా హల్‌చల్ చేస్తోంది. తాజాగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక నగర్ దత్తాత్రేయ ఆలయ సమీపంలో ఇంట్లోకి చొరబడ్డ దొంగలు 40 తులాల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి, రూ.2.50 లక్షల నగదు దొంగతనం చేసినట్లు తెలుస్తోంది

Chardham Yatra 2024: ఈ ఏడాది చార్‌ ధామ్‌ యాత్రలో 246 మంది మృతి.. కేదార్‌ నాథ్‌ యాత్రలోనే అధికం

Rudra

ఈ ఏడాది చార్‌ ధామ్‌ యాత్రలో 246 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో హెలికాప్టర్‌ ద్వారా వెళ్లిన భక్తులు ఎక్కువగా మృత్యువాతపడ్డట్టు అధికారులు తెలిపారు.

Zomato Resell Food: జొమాటోలో సగం కంటే తక్కువ ధరకే ఫుడ్.. ‘ఫుడ్ రెస్క్యూ’ పేరిట కొత్త ఫీచర్ తీసుకొచ్చిన ఆన్ లైన్ ఫుడ్ ప్లాట్ ఫాం.. ఏంటా విషయం?

Rudra

ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సరి కొత్త సదుపాయాన్ని తీసుకువచ్చింది. ఫుడ్ రెస్క్యూ అనే ఈ ఫీచర్ తో కస్టమర్లు తక్కువ ధరకు ఇంకా చెప్పాలంటే సగం కంటే తక్కువ ధరకే ఫుడ్ ను కొనుగోలు చేయవచ్చు.

Road Accident in Peddapally: పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. పలువురు మహిళలకు తీవ్ర గాయాలు.. ఓ మహిళ పరిస్థితి విషమం

Rudra

పెద్దపల్లి జిల్లా రంగంపల్లి మండలంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది.

Advertisement

Cardiac Arrest in Temple: ఆలయంలో ప్రదక్షిణాలు చేస్తున్న వ్యక్తికి గుండెపోటు.. స్పాట్ లోనే మృతి.. కేపీహెచ్‌ బీలో ఘటన (వీడియో)

Rudra

ఆకస్మిక గుండెపోటు ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. హైదరాబాద్ లోని కేపీహెచ్‌ బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఆలయంలో ప్రదక్షిణాలు చేస్తున్న ఓ వ్యక్తికి ఆకస్మికంగా గుండెపోటు వచ్చింది.

Telangana Shocker: రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు, మనస్తాపంతో ఉద్యోగిని ఆత్మహత్య, సూర్యాపేటలో దారుణ ఘటన

Hazarath Reddy

సూర్యాపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పైఅధికారి లైంగిక వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది. ఘటన వివరాల్లోకెళితే..సూర్యాపేట లయన్స్ క్లబ్ లో పనిచేస్తున్న కొత్తపల్లి కిరణ్మయి ఉద్యోగిగా పనిచేస్తోంది. మూడు నెలలుగా పవన్ అనే ఉద్యోగి టార్చర్ పెడుతున్నాడని ఆరోపిస్తూ వస్తోంది.

Telangana Shocker: బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్, హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ తల్లిదండ్రులు మండిపాటు

Hazarath Reddy

నిర్మల్ జిల్లా బాసర IIITలో విషాదం చోటుచేసుకుంది. పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్వాతి ప్రియ హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొనిఆత్మహత్య చేసుకుంది. కాగా స్వాతి ప్రియ స్వగ్రామం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పేర్కిట్. విద్యార్థిని మృతిపై తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేశారు.

Hyderabad Fire: వీడియో ఇదిగో, శివరాంపల్లి ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం, రోడ్డు మీద భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలోని శివరాంపల్లి ఆరాంఘర్‌లో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మహీంద్రా షోరూమ్‌ వెనుక ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటలు అదుపు చేస్తున్నారు.

Advertisement

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం, ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు జరిపిన ప్రియుడు, కంట్లో నుంచి దూసుకుపోయిన బుల్లెట్

Hazarath Reddy

హైదరాబాద్ - సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటేశ్వర కాలనీ రోడ్డు నెంబర్ 14 లో మల్లికా రాణి అపార్ట్మెంట్లో ఎయిర్ గన్‌తో ప్రియురాలి తండ్రి రేవంత్ ఆనంద్ (57) పై ప్రియుడు కాల్పులు జరిపాడు.

TSRTC MD Sajjanar: వీడియో ఇదిగో, ఈ యువ గాయకుడికి అవకాశం ఇవ్వాలని కీరవాణిని కోరిన వీసీ సజ్జనార్

Hazarath Reddy

తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా పోస్ట్‌ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఒక దివ్యాంగుడు (అంధుడు) ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ 'శ్రీ ఆంజనేయం' సినిమాలోని 'రామ రామ రఘురామ' అనే పాటను అద్భుతంగా ఆలపించిన వీడియోను ఆర్టీసీ ఎండీ ఎక్స్‌లో షేర్‌ చేశారు. అతన్ని ప్రశంసిస్తూ ఇలా ట్వీట్ చేశారు.

Hyderabad Shocker: అత్తాపూర్‌లో దారుణం, ఇంటి అద్దె కట్టలేదని యువతిపై కత్తితో దాడి చేసిన యజమాని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అత్తాపూర్‌ పోలీసులు

Hazarath Reddy

ఇంటి అద్దె కట్టలేదని కుటుంబంపై కత్తితో దాడి చేసిన యజమాని కుటుంబం. ఈ ఘటన అత్తాపూర్ పరిధిలో చోటు చేసుకుంది. యజమాని దాడిలో యువతి చేతికి, తలకు కత్తిపోట్లతో తీవ్రగాయాల పాలైంది. యువతిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

Telangana Road Accident: వీడియో ఇదిగో, రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న యువతి ప్రాణాలను కాపాడిన బండి సంజయ్, చికిత్సకు అయ్యే ఖర్చును తానే చెల్లిస్తానని భరోసా

Hazarath Reddy

కేంద్ర మంత్రి బండి సంజయ్ మానవత్వాన్ని చాటుకున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం సింగాపూరం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన యువతి..లారీ కింద ఇరుక్కుపోయింది. మానకొండూర్ మండలం ఖెల్లడ గ్రామానికి చెందిన యువతి దివ్య శ్రీ సింగాపూరం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ములుగు పర్యటనకు వెళ్తు ప్రమాదాన్ని చూసి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తన వాహనాన్ని ఆపారు.

Advertisement

Telangana Horror: సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం, తమ్ముడు కొట్టాడని పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డ తండ్రి, తన చావుకు కారణం తమ్ముడేనంటూ వీడియో

Hazarath Reddy

సిద్దిపేట - చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లి గ్రామానికి చెందిన సత్యం, అతని సోదరుడు శ్రీనివాస్ తల్లి లచ్చవ్వతో కలిసి సిద్దిపేటలోని వివేకానందనగర్ కాలనీలో స్థిరపడ్డారు. సత్యంకు భార్య, కుమారుడు అన్విష్ నందన్, కుమార్తె త్రివర్ణహాసిని ఉన్నారు.

Ponnam Prabhakar at Vemulawada Temple: కార్తీక సోమవారం నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు (వీడియో)

Rudra

నేడు కార్తీక సోమవారం. ఈ నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో ఆలయానికి విచ్చేసిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు.

Lady Aghori at Kotappa Konda Temple: కోటప్ప కొండ క్షేత్రంలో లేడీ అఘోరీ.. సనాతన ధర్మం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమన్న అఘోరీ (వీడియో)

Rudra

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీ ఆలయాల పర్యటన కొనసాగుతున్నది. మొన్నటికి మొన్న మహానంది, యాగంటి క్షేత్రాలను దర్శించుకున్న ఆమె తాజాగా కోటప్ప కొండలో పర్యటించారు. లోక కళ్యాణం చేయడానికి మాత్రమే తాను వచ్చానని ఆమె పేర్కొన్నారు. ఎంత మంది ఎన్ని విమర్శించినా తన పోరాటం ఆగదని తేల్చిచెప్పారు.

Tiger in Nirmal: నిర్మల్ రోడ్డు మీద రాజసం ఒలకబోస్తూ పెద్దపులి సంచారం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో మీరూ చూడండి..!

Rudra

నిర్మల్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్స్ పై రోడ్డు దాటుతుండగా అటుగా వెళుతున్న కొందరు యువకులకు పెద్దపులి కనిపించింది.

Advertisement

Black Magic in Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో క్షుద్రపూజల కలకలం.. హడలెత్తించే దృశ్యాలు (వీడియో)

Rudra

హైదరాబాద్ పాతబస్తీ లో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. శ్మశానాల్లో హడలెత్తించే దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. మేకులు దించిన బొమ్మలు, దారాలు చుట్టిన కుండలు, సమాధుల్లో గోతులు వంటి దృశ్యాలు స్థానికులను భయకంపితులను చేస్తున్నాయి.

Water Bandh in Hyderabad: అలర్ట్.. హైదరాబాద్‌ లో నేడు తాగునీరు బంద్.. ఉదయం 6 నుంచి మరుసటి రోజు 6 వరకు నీళ్లు రావన్న అధికారులు.. ఎందుకంటే??

Rudra

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నేడు అంటే సోమవారం తాగు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు హైదరాబాద్ జలమండలి అధికారులు ప్రకటించారు.

Airport Food Prices: ఎయిర్‌ పోర్టుల్లో ఫుడ్ కోర్టుల్లో ధరలు చూసి షాక్ అవుతున్న సామాన్యులకు గుడ్ న్యూస్.. ఇకపై, సరసమైన ధరలకే లభ్యం కానున్న ఆహార పదార్థాలు, పానీయాలు

Rudra

విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసే ఫుడ్ కోర్టుల్లో ఆహార పదార్థాలు చాలా ఎక్కువ ధరకు విక్రయిస్తారు. ఎయిర్ పోర్టులలో భోజనం చేయడమంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సామాన్యులైతే ధరలు చూసి కడుపు మాడ్చుకుంటారు కానీ కొనడానికి మొగ్గుచూపరు.

Telangana: సిగ్గు, లజ్జ ఉంటే చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలి, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు, సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న చేనేత దంపతుల కుటుంబానికి పరామర్శ

Vikas M

సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న చేనేత దంపతుల కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు పరామర్శించారు. ఈ దంపతుల ముగ్గురు పిల్లల పరిస్థితి పట్ల కేటీఆర్ చలించిపోయారు. ఆ ముగ్గురు పిల్లలు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు తన పిల్లల మాదిరిగానే చదివిస్తానని హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement