CM KCR (Photo-Video Grab)

Nanded, May 19: ప్రభుత్వాలు అభివృద్ధిపై దృష్టి పెడితేనే.. దేశంలో సమస్యలు పరిష్కారం అవుతాయని బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. శుక్రవారం నాందేడ్‌(మహారాష్ట్ర)లో బీఆర్‌ఎస్‌ శిక్షణా తరగతుల్ని ప్రారంభించి.. ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నేడు దేశ రాజధాని ఢిల్లీలో నీరు కూడా దొరకడం లేదు. కరెంట్‌ ఉండడం లేదు. దేశంలో వేలాది టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నాయి. అందుకే ప్రభుత్వాలు అనవసర విషయాలపై కాకుండా.. అభివృద్ధిపై దృష్టిసారించాలి. అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయి. దేశం ప్రబల శక్తిగా ఆవిర్భవించాలని ఆకాంక్షించారు.

పొట్టకూటికోసం వస్తే బిడ్డ బలయ్యాడు, ఆడుకుంటుండగా చిన్నారిపై దాడి చేసిన వీధి కుక్కలు, చికిత్స పొందుతూ మృతి

ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలకు కేసీఆర్‌ దిశా నిర్దేశం చేశారు. ‘‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా సమస్యలు పరిష్కారం కావడం లేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి కొందరు ఏదేదో మాట్లాడుతున్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే.. ఏం జరిగింది? ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదు.. ప్రజలు. దేశం మొత్తం తెలంగాణ మోడల్‌ అమలు కావాలి. అమూల్యమైన నీటిని కూడా వాడుకోలేక వృథా చేస్తున్నాం. ఏటా వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. సాగుకు నీరు లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో బీఆర్ఎస్ కార్యాలయం.. ఎల్లుండే ప్రారంభం.. విజయవాడలో ఎందుకు ఆఫీస్ పెట్టలేదంటే??

అకోలా, ఔరంగాబాద్‌లో వారానికోసారి తాగునీరు ఇస్తున్నారు. దేశం మొత్తం దాదాపు ఒకే తరహా పరిస్థితి ఉంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో తీవ్రమైన రైతు ఉద్యమాలు జరిగాయి. ఆందోళనల్లో ఎందరో రైతులు తూటాలకు బలయ్యారు. రైతులంటే గౌరవం లేదా? నిత్యం పోరాడుతూనే ఉండాలా?’’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు.

శిక్షణ శిబిరం ద్వారా పలువురు ఇతర పార్టీల ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కడదాకా నిలబడి పోరాడే సత్తా ఉన్నవాళ్లు మాత్రమే బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాలన్నారు. పార్టీలో చేరేవాళ్లకు ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడే తెగువ ఉండాలని, నిత్యం ప్రజలతో మమేకమై వారిని చైతన్యపర్చాలని సూచించారు. ఒకసారి అడుగు ముందుకు వేస్తే వెనుకడుగు వేసేది లేదని చెప్పారు. మన లక్ష్యం గొప్పదని, త్వరలోనే పార్టీ కమిటీలు నియమించుకుందామని అన్నారు. అదేవిధంగా శిబిరంలో జరిగే శిక్షణ తరగతుల సమాచారాన్ని డిజిటల్‌ రూపంలో అందిస్తామని, అందరూ వాటిని సమగ్రంగా తెలుసుకోవాలని సీఎం కోరారు.