Hyd, Mar 6: మెదక్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తనకు అత్తింటివారు బంగారం పెట్టలేదని ఓ అల్లుడు అలిగి కరెంట్ స్థంభం ఎక్కాడు. తనకు రావాల్సిన బంగారం పెడితేనే కిందకు దిగుతానని.. లేదంటే స్తంభంపై (medak man climbed current pole) కూర్చుంటానని గొడవ చేశాడు.స్తంభం పైనుంచి దూకేస్తానంటూ కాసేపు బీభత్సం సృష్టించాడు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా గాంధీనగర్ కు చెందిన కొడపాక శేఖర్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం పట్టణానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి రోజు బంగారం పెట్టేందుకు బాలిక తల్లిదండ్రులు అంగీకరించారు. అయితే ఇప్పటి వరకు బంగారం (mother in law did not give gold gift) చేయించలేదు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శేఖర్ నిన్న(మార్చి 5) విద్యుత్ స్తంభం ఎక్కి హంగామా చేశాడు. బంగారం ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని అత్తమామలను బెదిరించాడు. విద్యుత్ అధికారులతో మాట్లాడిన స్థానికులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని శేఖర్‌ను కిందకు దించే ప్రయత్నం చేశారు. అయినా దిగి రాని శేఖర్.. చాలా సేపు వారిని టెన్సన్ పెట్టాడు.
మెదక్ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, స్థానిక డీఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని శేఖర్‌ను నిలదీశారు. బంగారం ఇస్తానని అత్తమామలతో హామీ ఇవ్వడంతో కిందకు దిగాడు. శేఖర్ క్షేమంగా కిందకు రావడంతో ఊరివాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు.