Influenza A H3N2 Alert For Telugu States: కరోనా కల్లోలం రేపిన తర్వాత తెలుగు రాష్ట్రాలను వైరల్ ఫీవర్ వణికిస్తోంది. తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హైఅలర్ట్ జారీ చేసింది. సాధారణ ఫ్లూకి భిన్నంగా కొత్త ఫ్లూ దేశంలో విజృంభిస్తోందని, అప్రమత్తంగా ఉండాలని రెండు తెలుగు రాష్ట్రాలను హెచ్చరించింది.
Influenza A H3N2 కొత్త ఫ్లూ(H3N2 వైరస్) ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరికి జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు కనిపిస్తున్నాయి. వైరల్ ఫీవర్ పేషెంట్లతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. కొందరిలో అయితే జ్వరం తర్వాత న్యూమోనియాగా మారి శ్వాసకోశ ఇబ్బందులకు గురి చేస్తోంది.
ఈ భయానక పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలని ఐసీఎంఆర్ దేశ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వైరస్ వ్యాప్తి చెందనివ్వకుండా అడ్డుకునే ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. వైద్యులను సంప్రదించకుండా యాంటీ బయోటిక్స్ వాడకూడదని ప్రజలను కోరింది. న్‌ఫెక్షన్‌లను నిర్ధారించుకోకుండా యాంటీ బయోటిక్స్ పేషెంట్లకు సూచించకూడదని వైద్యులను కూడా హెచ్చరించింది. ఈ ఫ్లూ నుంచి కోలుకున్నాక కూడా దీర్ఘకాలిక ప్రభావం ఉండొచ్చని, ఈ వైరస్‌తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.