Hyd, Jan 17: తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Miniter Errabelli Dayakar Rao) మహబూబాబాద్ జిల్లాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై (sitting BRS MLAs) వ్యతిరేకత ఉందని వారిని మార్చాల్సిందేనని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. 17 నుంచి 20 మంది ఎమ్మెల్యేలను మార్చితే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ 100కు పైగా సీట్లలో (If 20 Sitting MLAs Changed 100 Seat Is Sure) గెలుస్తుందని స్పష్టం చేశారు.కాగా ఖమ్మంలో రేపు (బుధవారం) జరిగే బిఆర్ఎస్ ఆవిర్భావ సభ నేపథ్యంలో పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశంలో మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
ఏ సర్వే అయినా, తాను వ్యక్తిగతంగా చేసిన సర్వేలు చూస్తే 80 నుంచి 90 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని తెలిసిందన్నారు. కేసీఆర్‌కు ఓటేస్తాం అంటున్నారని, కానీ కొందరి ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. 15 నుంచి 20 స్థానాల్లో బీజేపీ, 20 నుంచి 25 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ ఉంటుందని 17 నుంచి 20 మంది ఎమ్మెల్యేలను మార్చితే బీఆర్ఎస్ వందకు పైగా స్థానాలు గెలుస్తుంది అన్నారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ.. మరికొన్ని చోట్ల బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.