Black Spots on HYD-VJY NH: పండగ తర్వాత హైదరాబాద్ వస్తున్నారా, అయితే ఈ 17 బ్లాక్‌ స్పాట్స్‌ను గుర్తుపెట్టుకోవడం మరచిపోకండి, తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల లిస్టును విడుదల చేసిన తెలంగాణ పోలీసులు
Hyderabad Traffic Police (Photo Credits: Facebook)

Hyd, Jan 17: సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం ఇప్పుడు పండగ అయిపోవడంతో మళ్లీ నగరబాట పట్టారు. దీంతో విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిలోని (Hyderabad-Vijayawada National Highway) పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు కూడా అలర్ట్‌ అయ్యారు. ఈ జాతీయ రహదారిలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై 17 బ్లాక్‌ స్పాట్స్‌ను (Black Spots Hyd-Vjy NH) గుర్తించారు.

సంక్రాంతి రద్దీ.. హైదరాబాద్-విజయవాడ రహదారిపై ఒక్క రోజే 67 వేలకు పైగా వాహనాల పరుగులు

నవాబుపేట (ఏపీ) నుంచి చిట్యాల మండలం పెద్దకాపర్తి వరకు తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలుగా పోలీసులు గుర్తించారు. బ్లాక్ స్పాట్స్ వివరాలను ఓ సారి పరిశీలిస్తే.. నవాబ్ పేట, రామాపురం, శ్రీరంగాపురం, మేళ్లచెరువు క్రాస్ రోడ్డు, కట్టకొమ్ముగూడ క్రాస్, కొమరబండ, ఆకుపాముల, ముకుందాపురం, దురాజ్ పల్లి, జమ్మిగూడ, జనగామ క్రాస్, ఎస్వీ కాలేజ్, కొర్ల పహాడ్, కట్టంగూరు, నల్లగొండ క్రాస్, చిట్యాల, పెద్ద కాపర్తిగా గుర్తించారు. జాతీయ రహదారులు, స్థానిక రహదారులపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్‌స్పాట్లుగా గుర్తిస్తారు.