Science

National Space Day: ఆగస్టు 23ను నేషనల్‌ స్పేస్‌ డేగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, శాస్త్రవేత్తలు సాధించిన విజయానికి సంతోషం వ్యక్తం చేసిన కేంద్ర కేబినెట్‌

Hazarath Reddy

చంద్రయాన్‌-3 (Chandrayaan 3) చందమామ దక్షిణ ధ్రువాన్ని ముద్దాడిన ఆగస్టు 23ను కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్‌ స్పేస్‌ డే’గా (National Space Day) ప్రకటించింది. ఈ మేరకు కేంద్రమంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వివరించారు.

Chandrayaan 3 Mission Update: ప్రజ్ఞాన్‌ ప్రయాణిస్తున్న దారిలో పెద్ద గొయ్యి, వెంటనే అలర్ట్ అయి రోవర్‌ రూట్‌ మార్చిన ఇస్రో

Hazarath Reddy

చందమామ దక్షిణ ధ్రువం సమీపంలో అడుగుపెట్టిన చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ప్రజ్ఞాన్‌ రోవర్‌ (Rover) ప్రయాణిస్తున్న మార్గంలో లోతైన గొయ్యి కన్పించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇస్రో శాస్త్రవేత్తలు.. రోవర్‌ రూట్‌ను మార్చారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఇస్రో (ISRO) సోమవారం ఎక్స్‌ (ట్విటర్‌)లో అప్‌డేట్‌ ఇచ్చింది.

Aditya-L1 Mission: సూర్యునిపై పరిశోధనకు సెప్టెంబర్ 2న ఆదిత్య-ఎల్1 ప్రయోగం, కీలక వివరాలను వెల్లడించిన ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్, ఆదిత్య ఎల్‌–1 ఉపగ్రహం విశేషాలు ఇవిగో..

Hazarath Reddy

భారత అంతరిక్ష అధ్యయన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది.చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైన తర్వాత, సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆదిత్య-ఎల్1 అంతరిక్ష నౌకను సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోట అంతరిక్ష నౌకాశ్రయం నుంచి ప్రయోగిస్తున్నట్లు ఇస్రో సోమవారం ప్రకటించింది.

Aditya-L1 Mission Launch Date:ఇక సూర్యునిపై వేట, సెప్టెంబర్ 2న ఆదిత్య-ఎల్1 ప్రయోగం, కీలక వివరాలను వెల్లడించిన ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్

Hazarath Reddy

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సూర్యునిపై అధ్యయనం చేసే తొలి అంతరిక్ష ఆధారిత భారతీయ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్1 ప్రయోగం సెప్టెంబర్ 2, 2023న జరగనుందని తెలుస్తోంది. ముఖ్యంగా సూర్యుని అధ్యయనం చేసేందుకు ఆదిత్య-ఎల్1 మిషన్ సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి 11:50 గంటలకు ప్రయోగించనున్నారు.

Advertisement

'Declare Moon a Hindu Rashtra': వీడియో ఇదిగో, శివశక్తి రాజధానిగా చంద్రుడ్ని హిందూ దేశంగా ప్రకటించండి, జిహాదీలు రాకుండా ఉండాలంటే అలా చేయాలని పిలుపునిచ్చిన స్వామి చక్రపాణి మహారాజ్‌

Hazarath Reddy

ఆల్ ఇండియా హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రుడ్ని హిందూ దేశంగా ప్రకటించాలని, చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన ప్రదేశాన్ని రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Cinnamon: దాల్చిన చెక్కతో ప్రొస్టేట్ క్యాన్సర్ మాయం.. దాల్చిన చెక్కతో తగ్గుతున్న ఎముకల క్షీణత.. హైదరాబాద్ ఎన్ఐఎన్ అధ్యయనంలో వెల్లడి

Rudra

వంటల్లో ఉపయోగించే దాల్చినచెక్కతో ప్రొస్టేట్ క్యాన్సర్‌ కు అడ్డుకట్ట వేయొచ్చని హైదరాబాద్‌లోని జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్ఐఎన్) అధ్యయనంలో వెల్లడైంది. అందులో ఉండే సినామల్‌డిహైడ్, ప్రొసైనిడిన్-బి2 పదార్థాలు ప్రొస్టేట్ గ్రంథి క్యాన్సర్‌ను నిరోధిస్తాయని ఎలుకలపై జరిపిన అధ్యయనంలో తేలింది.

Chandrayaan 3: ఎంత క్యూట్ గా దిగిందో.. విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ ఎలా బయటకు వస్తుందో తెలిపే వీడియో ఇదిగో, ట్రాక్ పైన ప్రయాణిస్తూ జాబిల్లిపై మెల్లిగా..

Hazarath Reddy

చందమామపై ప్రస్తుతం పలు పరిశోధనలు చేస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ కు సంబంధించి కీలక వీడియోను ఇస్రో ట్వీట్ చేసింది. విక్రమ్ ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వస్తున్న వీడియోను ఇస్రో తాజాగా విడుదల చేసింది. ట్విట్టర్లో ఈ వీడియోను షేర్ చేసింది.

Chandrayaan-3: జాబిలి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 ల్యాండర్ దిగడానికి ముందు వీడియో... చూడటానికి ఎంత బాగుందో.. మీరూ చూడండి!

Rudra

చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెడుతున్న సమయంలో తీసిన వీడియోను ఇస్రో తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. బుధవారం సాయంత్రం గం.6.04 నిమిషాలకు చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగిడి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

Advertisement

Chandrayaan 3: ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ డ్యాన్స్ వీడియో పాతది, చంద్రయాన్-3 విజయానికి దానికి సంబంధం లేదని తెలిపిన పీటీఐ ఫ్యాక్ట్ చెక్

Hazarath Reddy

ఆగస్టు 23న చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడిపై ల్యాండింగ్‌ కావడంతో ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్, శాస్త్రవేత్తలు డ్యాన్స్ వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది వేరే ఈవెంట్ వీడియో అని PTI యొక్క ఫ్యాక్ట్ చెక్ నిర్ధారించింది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ సాంస్కృతిక కార్యక్రమంలో సోమనాథ్‌తో పాటు మరికొందరు డ్యాన్స్‌ చేయడం కనిపించింది.

ISRO Chief on Aditya L-1 Mission: చంద్రుడు తర్వాత సూర్యుడిని టార్గెట్ చేసిన ఇస్రో, సూర్యుడిపై పరిశోధనలకు సెప్టెంబర్‌‌ మొదటివారంలో ఆదిత్య మిషన్‌ చేపడుతున్నట్లు వెల్లడి

Hazarath Reddy

చంద్రయాన్–3 విజయంతో ఇస్రో దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా నిలిచింది. ఈ జోష్‌లోనే మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. సూర్యుడిపై చేపట్టనున్న ఆదిత్య మిషన్‌ గురించి ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Anand Mahindra on Chandrayaan-3: మరుగుదొడ్లే లేని వీళ్లకి చంద్రయాన్ అవసరమా అంటూ బీబీసీ యాంకర్ అనుచిత వ్యాఖ్యలు, ధీటుగా కౌంటర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా

Hazarath Reddy

చందమామను చేరుకున్న భారతావనిపై యావత్‌ ప్రపంచం అభినందనల వర్షం కురిపిస్తోంది. అయితే ఇస్రో (ISRO) చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ప్రయోగంపై ఓ అంతర్జాతీయ మీడియా ఛానెల్‌ చర్చా కార్యక్రమం చేపట్టింది. అందులో భారత్ గురించి యాకంర్ అనుచిత వ్యాఖ్యలు చేసింది.

Elon Musk on Chandrayaan-3: సూపర్ కూల్ అంటూ చంద్రయాన్ 3 పై ఎలాన్ మస్క్ ట్వీట్, మంచి ప‌రిణామ‌మే అన్న‌ట్లుగా రియాక్ట్ అయిన టెస్లా అధినేత

Hazarath Reddy

చంద్రయాన్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించాడు. సోష‌ల్ మీడియా ఎక్స్‌లో వైర‌ల్ అవుతున్న ఆ పోస్టుల‌పై బిలియ‌నీర్ ఎల‌న్ మ‌స్క్(Elon Musk) స్పందిస్తూ..ఇది మంచి ప‌రిణామ‌మే అన్న‌ట్లుగా రియాక్ట్ అయ్యారు.

Advertisement

Chandrayaan-3: విక్రమ్‌ ల్యాండ్‌ అయిన 4 గంటల తర్వాత బయటకు వచ్చిన ప్రగ్యాన్‌ రోవర్‌, 14 రోజుల పాటు 1,640 అడుగులు వరకు చంద్రునిపై ప్రయాణం చేయనున్న రోవర్

Hazarath Reddy

చంద్రునిపై విక్రమ్‌ ల్యాండ్‌ అయిన నాలుగు గంటల తర్వాత అంటే రాత్రి 10.04 గంటలకు ప్రగ్యాన్‌ రోవర్‌ బయటకు వచ్చింది. ప్రస్తుతం జాబిల్లిపై అడుగుపెట్టిన రోవర్‌ ‘ప్రజ్ఞాన్‌’.. చంద్రుడిపై తన అధ్యయనం మొదలుపెట్టింది.

Chandrayaan 3: చంద్రునిపై అన్వేషణ ప్రారంభించిన రోవర్, విక్రమ్ నుంచి బయటికొచ్చిన ల్యాండర్ వీడియో ఇదిగో, 14 రోజుల పాటు జాబిల్లిపై పరిశోధనలు

Hazarath Reddy

చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన విక్రమ్ ల్యాండర్ నుండి ప్రగ్నాన్ రోవర్ విజయవంతంగా బయటికి వచ్చింది. ఆరు చక్రాల సాయంతో ల్యాండర్ నుండి చంద్రుడి ఉపరితలంపైకి రోవర్ దిగింది. విక్రమ్‌ ల్యాండర్ నుంచి బయటకొచ్చిన ప్రగ్యాన్‌ రోవర్ 14 రోజులు చంద్రుడిపై పరిశోధనలు చేయనుంది.

Chandrayaan 3 Moon Landing: హమ్మయ్య చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యింది, సాఫ్ట్ ల్యాండింగ్ తర్వాత ఏం జరగనుందో, తెలుసుకోండి..

ahana

ప్రతి భారతీయుడు గర్వంగా తల పైకెత్తే సమయం ఇది. భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్-3 మిషన్ లోని ల్యాండర్ విక్రమ్ చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా 'సాఫ్ట్ ల్యాండ్' అయింది.

Chandrayaan-3 Successful: జాబిలిపై జెండా పాతిన భారత్, చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన చంద్రయాన్ 3, అంతరిక్ష చరిత్రలో ఇస్రో సరికొత్త రికార్డు..

ahana

ఎన్నాళ్లో వేచిన ఉదయం నిజమైంది ఎట్టకేలకు చంద్రయాన్ 3 విజయవంతంగా చంద్రుడు పై అడుగు పెట్టింది నాలుగేళ్ల క్రితం చంద్రయాన్ 2 వైఫల్యం చెందినప్పటికీ, ప్రస్తుతం చంద్రయాన్ త్రి ఓటమి నేర్పిన గుణపాఠంతో విజయవంతంగా తన మిషన్ పూర్తి చేసుకుంది.

Advertisement

Chandrayaan-3: చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ ప్రక్రియ ప్రారంభం.. చంద్రుడి ఉపరితలం వైపుగా ల్యాండర్‌ ప్రయాణం

ahana

చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ ప్రక్రియ ప్రారంభం.. చంద్రుడి ఉపరితలం వైపుగా ల్యాండర్‌ ప్రయాణం.

Chandrayaan 3 LIVE Streaming: మీ బంధు మిత్రులతో కలిసి చంద్రయాన్ 3 లైవ్ స్ట్రీమింగ్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేసి చూడండి..

ahana

చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని అన్వేషించడానికి చంద్రయాన్-3 అంతరిక్ష నౌక పంపిన ల్యాండర్ కలాన్ రేపు (ఆగస్టు 23) చంద్రునిపై దిగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని అందరూ ఆనందించేలా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు ఇస్రో ప్రకటించింది

Chandrayaan-3: నేడే చంద్రయాన్ 3 ల్యాండింగ్‌.. ఈ అద్భుత దృశ్యాలను లైవ్‌ లో చూపించాలన్న నిర్ణయంపై తెలంగాణ విద్యాశాఖ యూటర్న్.. ఆ నిర్ణయం వెనక్కి.. కారణం ఏమిటంటే??

Rudra

యావత్తు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న జాబిల్లిపై చంద్రయాన్ ల్యాండింగ్‌‌ ను లైవ్‌ లో చూపించాలన్న నిర్ణయాన్ని తెలంగాణ విద్యాశాఖ వెనక్కి తీసుకుంది. పాఠశాలల పని వేళల్లో ఎలాంటి మార్పు ఉండదని నిన్న సాయంత్రం ప్రకటించింది.

Chandrayaan 3 Update: విక్రమ్ ల్యాండర్ పంపిన లేటెస్ట్ ఫోటోలు ఇవిగో, మరి కొద్ది గంటల్లో చందమామపై దిగనున్న ల్యాండర్, ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా..

Hazarath Reddy

కోట్లాది మంది భారతీయులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న చారిత్రక క్షణాలు చేరువయ్యాయి. మరికొద్ది గంటల్లో మన విక్రమ్ ల్యాండర్..చందమామ (Moon) దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది.

Advertisement
Advertisement