World
My Body My Choice: నా దేహం నా ఇష్టం.. అబార్షన్‌ రాజ్యాంగ హక్కు.. చారిత్రక బిల్లుకు ఫ్రాన్స్‌ పార్లమెంట్‌ ఆమోదం.. అబార్షన్‌ హక్కును రాజ్యాంగంలో చేర్చిన తొలి దేశంగా రికార్డు
Rudraఫ్రాన్స్‌ పార్లమెంట్‌ సోమవారం చారిత్రక బిల్లును ఆమోదించింది. అబార్షన్‌ హక్కును రాజ్యాంగంలో చేర్చింది. ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించింది. సోమవారం జరిగిన ఉభయ సభల సమావేశంలో దీనిపై ఓటింగ్‌ నిర్వహించగా.. 780-72 ఓట్లతో బిల్లుకు ఆమోదం లభించింది.
Haiti Violence: జైలు నుంచి 4 వేల మందికి పైగా ఖైదీలు ప‌రార్‌, 72 గంటల పాటు ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించిన హైతీ ప్ర‌భుత్వం, తక్షణమే కర్ఫ్యూ అమల్లోకి..
Hazarath Reddyదేశంలోని రెండు అతిపెద్ద జైళ్లపై దాడుల తర్వాత వేలాది మంది ఖైదీలు తప్పించుకున్న వారాంతంలో ముఠా నేతృత్వంలోని హింసాత్మక పేలుడు సంభవించిన తర్వాత హైతీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది.
Pakistan Rains: మండే ఎండల్లో పాకిస్తాన్‌లో భారీ వరదలు, 36 మంది మృతి, 41మందికి గాయాలు, జల దిగ్బంధంలో చిక్కుకున్న పలు ప్రావిన్స్‌లు
Hazarath Reddyదాయాది దేశం పాకిస్తాన్‌లోని ఆక్రమిత కశ్మీర్‌తోపాటు బలోచిస్తాన్, ఖైబర్‌ ఫక్తున్వా ప్రావిన్స్‌ల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 48 గంటల వ్యవధిలో ఈ ప్రాంతాల్లో వర్షాలు, వరద సంబంధిత ఘటనల్లో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా ఖైబర్‌ ఫక్తున్వా ప్రావిన్స్‌లో ఇళ్లుకూలి, ఇళ్లలోకి వరద చేరిన ఘటనల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు.
Viral Video: రోడ్డు మీద వెళుతున్న వాహనాలపై పడిన పెద్ద బండరాయి, కొండ మీద నుంచి పడటంతో నుజ్జు నుజ్జు అయిన వాహనాలు, షాకింగ్ వీడియో ఇదిగో
Hazarath ReddyCNN నివేదిక ప్రకారం, హుయాంకర్‌లోని శాన్ మాటియో ప్రాంతంలో పై నుంచి ఒక్కసారిగా పడ్డ బండరాళ్లతో వాహనం ఓ వైపుకు పల్టీలు కొట్టిన ఘటనలో భయంకరమైన సంఘటన జరిగింది.
Pakistan New PM: ఎట్టకేలకు వీడిన సస్పెన్స్, పాకిస్థాన్ కొత్త ప్రధానిగా షెహబాజ్ షరీఫ్, సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్న షెహబాజ్
VNSపాకిస్థాన్ ప్రధానమంత్రిగా (Pakistan PM) వరుసగా రెండోసారీ పాక్‌ ముస్లింలీగ్‌-నవాజ్‌ (PML-N‌) పార్టీ అగ్రనేత షెహబాజ్‌ షరీఫ్‌ (Shehbaz Sharif) ఎన్నికయ్యారు. 72 ఏళ్ల షెహబాజ్‌ దేశ 33వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. పీఎంఎల్‌-ఎన్ (PML-N)‌, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (PPP) కూటమి తరఫున షెహబాజ్‌ ప్రధాని పదవికి పోటీపడ్డారు.
Obesity: అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య 100 కోట్లకు పై మాటే, షాకింగ్ విషయాలను వెల్లడించిన ది లాన్సెంట్‌ జర్నల్‌ అధ్యయనం
Hazarath Reddyప్రపంచవ్యాప్తంగా ఊబకాయం (Obesity)తో బాధపడేవారి సంఖ్య ఏకంగా 100 కోట్లు దాటిందని తాజా అధ్యయనం వెల్లడించింది. వీరిలో పెద్దలేగాక, పిల్లలు, యువకులూ ఉన్నారని ‘ది లాన్సెంట్‌ జర్నల్‌’ కథనం పేర్కొంది. 1990 నుంచి తక్కువ బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని ఈ అధ్యయనం తెలిపింది
Four Year’s Newspaper: నాలుగేండ్లకు ఒకసారి వెలువడే పత్రిక.. నిన్న సంబురంగా అందుకున్న ఫ్రాన్స్‌ వాసులు
Rudraదిన పత్రికలు రోజూ, వార పత్రికలు ఏడు రోజులకోసారి, మాస పత్రికలు నెలకోసారి, ఇయర్లీ మ్యాగజైన్లు ఏడాదికోసారి రావడం చూసే ఉంటాం. కానీ ఫ్రాన్స్‌లో ‘లా బౌగీ డు సప్పర్‌’ అనే వ్యంగ్యాస్ర్తాలు విసిరే వార్తా పత్రిక నాలుగేండ్ల కోసారి మాత్రమే వెలువడుతున్నది.
Fire Accident in Bangladesh: బంగ్లాదేశ్‌ లో ఘోర అగ్ని ప్రమాదం.. 44 మంది మృతి (వీడియో వైరల్)
Rudraబంగ్లాదేశ్‌ లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రాజధాని ఢాకాలోని ఓ ఆరు అంతస్తుల భవనంలో నిన్న రాత్రి 9.30 గంటలకు ఒక్కసారిగా మంటలు రేగాయి. దీంతో భవనంలోని 44 మంది దుర్మరణం చెందారు.
Kate Middleton: రెండు నెల‌లుగా క‌నిపించ‌ని బ్రిట‌న్ యువ‌రాణి, కోమాలో ఉన్నారంటూ సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం, ఇంత‌కీ బంకింగ్ హ‌మ్ ప్యాలెస్ ఏం చెప్పిందంటే?
VNSబ్రిటన్‌ రాజు ఛార్లెస్-3 (King Charles-III )కి క్యాన్సర్‌ నిర్ధరణ అయిందని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ ఇటీవల వెల్లడించింది. దీంతో ఆయనకు చికిత్స నడుస్తోందని తెలిపింది. వేల్స్‌ యువరాణి కేట్‌ (Kate Middleton)కు శస్త్రచికిత్స జరిగిన ఆసుపత్రిలోనే రాజు చేరినట్లు సమాచారం
PSL -9: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కు ఫుడ్ పాయిజ‌న్, ముగ్గురి ప‌రిస్థితి విష‌మం, ఆహారం తిని 13 మంది ప్లేయ‌ర్ల‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌
VNSపాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL) 09వ సీజన్‌లో ఫుడ్‌ పాయిజన్‌ కలకలం రేపింది. కరాచీ కింగ్స్‌కు (Karachi Kings) చెందిన 13 మంది క్రికెటర్లు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. వీరిలో సుమారు ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది
Gaza Food Crisis: ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంతో గాజాలో ఆకలి కేకలు, అన్నమో రామచంద్రా అంటూ అలమటిస్తున్న 23 లక్షల మంది ప్రజలు
Hazarath Reddyఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధంతో (Israel's War on Gaza) గాజాలో ఆకలి కేకలు మిన్నంటాయి. అక్కడున్న మొత్తం 23 లక్షల మందీ జనాభా ఆహార కొరతతో విలవిలలాడుతుండగా వారిలో దాదాపు 5,76,000 మంది తీవ్ర కరువుతో అన్నమో రామచంద్రా (Gaza Food Crisis) అంటూ అలమటిస్తున్నారు
Climate Change Fish Weight Loss: వాతావరణ మార్పులతో సముద్రాల్లో చేపలకు ఆహారం కొరత.. బరువు తగ్గుతున్న చేపలు
Rudraవాతావరణ మార్పుల కారణంగా సముద్రంలో ఆహారానికి పోటీ పెరిగిందని, తగినంత ఆహారం దొరక్కపోవడంతో చేపల బరువు తగ్గుతున్నదని తాజా అధ్యయనం తేల్చింది.
No Tuition Fee in Newyork College: అమెరికాలోని ఓ వైద్య కళాశాలకు రూ.8 వేల కోట్ల విరాళం.. ఫీజులుండవని ప్రకటించిన యాజమాన్యం
Rudraఅమెరికాలోని న్యూయార్క్‌ లో ఒక వైద్య కళాశాల ట్యూషన్‌ ఫీజును రద్దు చేసింది. ఈ మేరకు ఐన్‌ స్టీన్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ప్రకటించింది.
Mali Bus Accident: ఆఫ్రికాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం, డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యంతో వంతెన పైనుంచి లోయ‌లో ప‌డ్డ బస్సు, 31 మంది మృతి
VNSఆఫ్రికా దేశం మాలిలో (Mali Bus Accident) మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నది వంతెనపై నుంచి వెళ్తున్న బస్సు పడిపోయింది. ఈ ఘటన కెవిబాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 31 మంది మరణించారు. మరో పది మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని చికిత్సనిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
Pakistan: పాకిస్తాన్‌లో తొలి మహిళా ముఖ్యమంత్రిగా మరియం నవాజ్‌ సరికొత్త రికార్డు, పంజాబ్‌ ప్రావిన్స్‌కు తొలి మహిళా సీఎంగా ఎన్నికైన మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కూతురు
Hazarath Reddyమాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కూతురు, సీనియర్‌ పీఎంఎల్‌-ఎన్‌ నాయకురాలు మరియం నవాజ్‌(50) పంజాబ్‌ ప్రావిన్స్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. సోమవారం జరిగిన ఎన్నికలను ఇమ్రాన్‌ ఖాన్‌ మద్దతు కలిగిన సున్నీ ఇత్తెహాద్‌ కౌన్సిల్‌ బహిష్కరించింది.
Ferry Sinks in Nile River: నైలు నదిలో ఘోర బోటు ప్రమాదంలో 10 మంది మృతి, కూలీలను తీసుకు వెళ్తుండగా మునిగిపోయిన ఫెర్రి బోటు
Hazarath Reddyఈజిప్టు రాజధాని కైరోలోని నైలు నదిలో కూలీలను తీసుకెళ్తున్న ఓ ఫెర్రీ బోటు మునిగి పోయింది.ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. కూలీలంతా ఒక భవన నిర్మాణ సైట్ లో పనికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే పడవ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు
Cough Syrup Deaths Case: కలుషిత దగ్గు మందు తాగి 68 మంది చిన్నారులు మృతి ఘటన, భారత కంపెనీ డైరక్టర్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష, మరో 22 మందికి రెండేళ్లు జైలు శిక్ష విధించిన ఉజ్బెకిస్థాన్ కోర్టు
Hazarath Reddyడిసెంబర్ 2022లో కలుషితమైన దగ్గు సిరప్ తాగి 68 మంది చిన్నారులు మరణించిన కేసులో ఉజ్బెకిస్థాన్ కోర్టు మరో 22 మందితో పాటు ఒక భారతీయుడికి జైలు శిక్ష విధించింది.