World
Alaska Airlines Emergency Landing: వీడియో ఇదిగో, ఆకాశంలో ఉండగా ఊడిపడిన విమానం అత్యవసర కిటికీ డోర్, అత్యవసరంగా ల్యాండ్ అయిన బోయింగ్ విమానం
Hazarath Reddyఅమెరికాలోని పోర్ట్‌లాండ్‌ నుంచి ఒంటారియోకు బయలుదేరిన బోయింగ్ విమానం టేకాఫ్ అయిన వెంటనే దాని డోర్ ఊడిపడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కిటికీ డోర్ ఊడిపోవడంతో టేకాఫ్ అయిన చోటే అత్యవసరంగా దిగింది. 16 వేల అడుగుల ఎత్తులో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.
Alaska Airlines Incident: అన్ని బోయింగ్ 737–8 మాక్స్ విమానాల డోర్లు వెంటనే తనిఖీ చేయండి, విమానయాన సంస్థలను ఆదేశించిన డీజీసీఏ
Hazarath Reddyఈ ఘటన నేపథ్యంలో తమ ఫ్లీట్‌లోని బోయింగ్ 737-8 మ్యాక్స్ విమానాల అత్యవసర నిష్క్రమణ ద్వారాల డోర్లు తక్షణమే తనిఖీ చేయాలని దేశీయ విమానయాన సంస్థలను ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ శనివారం ఆదేశించింది.
Christian Oliver No more: సముద్రంలో కూలిన విమానం.. ఇద్దరు కూతుళ్లతో సహా హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఓలివర్ దుర్మరణం
Rudraహాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఓలివర్ గురువారం విమాన ప్రమాదంలో మృతి చెందారు. తన ఇద్దరు కూతుళ్లతో (10, 12 ఏళ్ల వయసున్న బాలికలు) కలిసి ఆయన ప్రయాణిస్తున్న విమానం కరీబియన్ సముద్రంలో కూలడంతో అందరూ మరణించారు.
Bangla Train Accident: బంగ్లాదేశ్‌ లో విషాదం.. ప్యాసింజర్ రైలులో మంటలు.. ఐదుగురి సజీవదహనం (వీడియోతో)
Rudraపొరుగు దేశం బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఘోరం జరిగింది. ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగి ఐదుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.
JN.1 Scare: JN.1 వేరియంట్ భవిష్యత్‌లో చాలా డేంజర్‌గా మారబోతుందని ఆందోళన వ్యక్తం చేసిన నిపుణులు, దీని నుంచి అనేక ఉపవేరియంట్లు పుట్టుకొస్తాయంటూ..
Hazarath Reddyప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేపుతున్న ఓమిక్రాన్ వంశం నుండి పుట్టుకొచ్చిన సరికొత్త కోవిడ్-19 వేరియంట్ JN.1పై నిపుణులు మరింత ఆందోళన కలిగించే విషయాలను వెల్లడించారు.ఈ కోవిడ్ కొత్త వేరియంట్ 'చాలా తీవ్రమైన పరిణామాన్ని' సూచిస్తుందని ప్రపంచ నిపుణుల అభిప్రాయపడుతున్నారు.
Hana-Rawhiti Maipi-Clarke: వీడియో ఇదిగో, పార్లమెంట్‌లో 21 ఏళ్ల మహిళా ఎంపీ ప్రసంగానికి ఆశ్చర్యపోయిన మిగతా ఎంపీలు, షాకై ఆమెను అలాగే చూస్తుండిపోయిన సభ్యులు
Hazarath Reddyన్యూజిలాండ్‌లోని ఓ పార్లమెంటు సభ్యురాలు చేసిన శక్తివంతమైన ప్రసంగానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కేవలం 21 సంవత్సరాలు వయసు గల హనా-రౌహితీ మైపి-క్లార్క్ అనే యువ ఎంపీ గత నెలలో ఉద్వేగభరితమైన ప్రసంగం చేసింది.
Earthquake in Japan: భూకంప మృతులకు సంతాపం తెలుపుతూ జపాన్‌ ప్రధానికి లేఖ రాసిన భారత ప్రధాని మోదీ, తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని లేఖలో వెల్లడి
Hazarath Reddyభూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోయిన 64 మంది కుటుంబాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Pakistan Elections 2024: పాకిస్తాన్‌లో ఎన్నికలు వాయిదా, భద్రతా కారణాల దృష్ట్యా ఎలక్షన్స్ వాయిదా తీర్మానాన్ని ఆమోదించిన పాక్ సెనేట్
Hazarath Reddyఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉన్నందున, భద్రతా కారణాల దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ పార్లమెంటు ఎగువ సభ శుక్రవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
Judge Attacked by Defendant: వీడియో ఇదిగో, తీర్పు అనుకూలంగా ఇవ్వలేదని కోర్టు లైవ్‌లో మహిళా జడ్జిపై దాడి చేసిన నిందితుడు
Hazarath Reddyవైరల్ అవుతున్న వీడియోలో అమెరికాలోని ఓ కోర్టులో అనుకూలంగా తీర్పు ఇవ్వలేదని మహిళా జడ్జిపై దూకి దాడి చేసిన దృశ్యాలు చూడవచ్చు. అప్రమత్తమై భద్రతా సిబ్బంది నిందితుడి నుండి జడ్జిని కాపాడారు.
Hindu Temple Defaced in US: అమెరికాలో మరో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసిన ఖలిస్థాన్ వేర్పాటు వాదులు, గోడలపై ఖలీస్తానీలకు అనుకూలంగా రాతలు
Hazarath Reddyకాలిఫోర్నియాలోని హేవార్డ్‌లోని ఓ హిందూ దేవాలయం ఖలిస్థాన్ అనుకూల గ్రాఫిటీతో ధ్వంసమైంది. కాలిఫోర్నియాలోని నెవార్క్‌లోని స్వామినారాయణ దేవాలయం భారత వ్యతిరేక గ్రాఫిటీతో చెడిపోయిన కొన్ని వారాల తర్వాత షెరావాలి ఆలయంలో ఈ సంఘటన జరిగింది.
Jeffrey Epstein Sex Files: సెక్స్‌ కుంభకోణంలో బిల్‌ క్లింటన్‌, ట్రంప్‌, మైఖేల్‌ జాక్సన్‌, స్టీఫెన్‌ హాకింగ్‌.. ‘ఎప్‌ స్టెయిన్‌ ఫైల్స్‌’లో 200 మంది పేర్లు
Rudraఅమెరికాను 2005లో కుదిపేసిన ‘ఎప్‌ స్టెయిన్‌ ఫైల్స్‌’ సెక్స్‌ కుంభకోణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెక్స్‌ కుంభకోణంలో ఆ దేశ మాజీ అధ్యక్షులు బిల్‌ క్లింటన్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ తోపాటు స్టీఫెన్‌ హాకింగ్‌, మైఖేల్‌ జాక్సన్‌, ప్రిన్స్‌ ఆండ్రూ సహా 200 మంది పేర్లు బయటికి వచ్చాయి.
Japan Earthquake: జపాన్ భూకంపంలో 82కి పెరిగిన మృతుల సంఖ్య, 52 మంది మిస్సింగ్, ఇంకా ఎంతోమంది శిథిలాల కిందనే, యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న సహాయక చర్యలు
Hazarath Reddyకొత్త ఏడాది రోజునే భారీ భూకంపం బారిన పడిన జపాన్‌లో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఇషికావా ప్రిఫెక్చర్‌లో సోమవారం రిక్టర్‌ స్కేల్‌పై 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య బుధవారానికి 82కు పెరిగింది. 51 మంది మిస్సయ్యారు
Iran Blasts: ఇరాన్‌లో జంట పేలుళ్లపై భారత్‌ దిగ్భ్రాంతి, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధించిందని విచారం వ్యక్తం
Hazarath Reddyఇరాన్‌(Iran)లో జరిగిన జంట పేలుళ్ల(twin bombings)పై భారత్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధించిందని విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
Iran Blasts: వరుస బాంబుల మోతతో దద్దరిల్లిన ఇరాన్, 103 మంది మృతి, 188 మందికి తీవ్ర గాయాలు
Hazarath Reddyఇరాన్‌ బాంబుల మోతతో దద్దరిలింది. ఆ దేశానికి చెందిన ప్రముఖ సైనికాధికారి జనరల్‌ ఖాసీం సులేమాని స్మారక కార్యక్రమం బుధవారం జరుగుతున్న వేళ నిమిషాల వ్యవధిలో గుర్తు తెలియని వ్యక్తులు జంట పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 103 మంది మరణించగా, 188 మందికి గాయాలయ్యాయని ఇరాన్‌ అధికారులు వెల్లడించారు.
Japan Earthquake: జపాన్ భూకంపంలో 78కి పెరిగిన మృతుల సంఖ్య, ఇంకా ఎంతోమంది శిథిలాల కిందనే, యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న సహాయక చర్యలు
Hazarath Reddyకొత్త ఏడాది రోజునే భారీ భూకంపం బారిన పడిన జపాన్‌లో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఇషికావా ప్రిఫెక్చర్‌లో సోమవారం రిక్టర్‌ స్కేల్‌పై 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య బుధవారానికి 78కు పెరిగింది.
Cancer Deaths in India: భారత్‌లో క్యాన్సర్‌తో 9.3 లక్షల మంది మృతి, అధిక కేసులు, మరణాల సంఖ్యలో ఆసియాలోనే రెండవ స్థానంలో ఇండియా
Hazarath Reddyభారతదేశం 2019లో సుమారు 12 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు, 9.3 లక్షల మరణాలను (Cancer Deaths in india) నమోదు చేసింది, అధిక కేసులు, మరణాల సంఖ్య నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్‌ ఆసియాలో రెండో స్థానంలో (second highest in Asia) ఉన్నదని తాజా అధ్యయనం తెలిపింది
Japan Earthquake: భూకంపం తర్వాత జపాన్‌పై మరో పిడుగు, కుండపోత వర్షంతో పాటు మరిన్ని భూకంపాలు వస్తాయని హెచ్చరిక, 62కు పెరిగిన మృతుల సంఖ్య
Hazarath Reddyజపాన్ దేశంలో సంభవించిన భూకంపంలో (Japan Earthquake) మృతుల సంఖ్య 62కు పెరిగింది. ఇదిలా ఉంటే మరిన్ని భూకంపాలు సంభవించవచ్చని అధికారులు హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇషికావా సెంట్రల్ ప్రిఫెక్చర్‌లోని నోటో ద్వీపకల్పాన్ని భారీ భూకంపం కదిలించింది.
Israel–Hamas War: హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ, ఇజ్రాయెల్‌ దాడుల్లో హమాస్ అగ్రనేత సలేహ్ అరౌరీ మృతి, యుద్ధం తీవ్రత మరింత పెరిగే అవకాశం
Hazarath Reddyగత కొద్ది నెలల నుంచి ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. లెబనాన్ రాజధాని బీరుట్ శివారు ప్రాంతాలపై నిన్న ఇజ్రాయెల్ జరిపిన డ్రోన్ దాడిలో హమాస్ అగ్రనేత, ఆ సంస్థ మిలిటెంట్ విభాగం వ్యవస్థాపకుల్లో ఒకడైన సలేహ్ అరౌరీ మృతి (Hamas deputy chief Saleh al-Aruri killed) చెందాడు.
Japan Plane Tragedy: జపాన్ ఘోర విమాన ప్రమాదంలో 5 మంది మృతి, కెప్టెన్‌కు తీవ్ర గాయాలు, రన్‌వేపై దిగుతుండగా కోస్ట్ గార్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఢీకొట్టిన జేఏల్‌ 516 విమానం
Hazarath Reddyప్రమాదం జరిగిన సమయంలో జేఏల్‌ 516 విమానంలో సిబ్బంది, ప్రయాణికులు కలిపి 400 మంది ఉన్నారని ఎన్‌హెచ్‌కే పేర్కొన్నట్లు జపాన్‌ టైమ్స్‌ వెల్లడించింది. కాగా ఈ ఘటనలో ఐదుగురు కోస్ట్ గార్డ్ సభ్యులు మృతి చెందారు. అలాగే కెప్టెన్ తీవ్రంగా గాయపడ్డారని నివేదిక పేర్కొంది.
Plane Catches Fire: ఘోర ప్రమాదం వీడియో ఇదిగో, ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా మరో విమానాన్ని ఢీకొట్టిన విమానం, ఒక్కసారిగా చెలరేగిన మంటలు
Hazarath Reddyజపాన్‌ ఎయిర్‌పోర్టులో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. రాజధాని టోక్యోలోని ఎయిర్‌పోర్టు రన్‌వేపైని విమానంలో భారీగా మంటలు చెలరేగాయి. హోకియాడో నుంచి వస్తున్న జపాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన JAL 516 విమానం హనెడా ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అవుతుండగా మంటలు అంటుకున్నాయి.