సినిమా

IIFA 2024: ఐఫా ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా షారుఖ్ ఖాన్, బాలీవుడ్ నటుడి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు, ఇంప్రెసివ్‌గా షారుఖ్ ఫోటోలు

Arun Charagonda

ప్రతిష్టాత్మక ఐఫా(ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) ఉత్సవం 2024 అబుదాబిలోని యాస్ ఐలాండ్ లో వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. రేపటి నుండి ఈ ఉత్సవం ప్రారంభంకానుండగా ఇప్పటికే దక్షిణాదితో పాటు బాలీవుడ్‌ నటులు దుబాయ్‌కి చేరుకున్నారు.

Prakash Raj vs Pawan Kalyan: గెలిచేముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం, పవన్ కల్యాణ్‌పై మరో కౌంటర్ వదిలిన ప్రకాష్ రాజ్

Hazarath Reddy

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అపవిత్రం కావడంపై పవన్ కల్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా, ఎక్స్ వేదికగా మరో పోస్ట్ పెట్టారు. "గెలిచేముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు మనకీ అయోమయం… ఏది నిజం? జస్ట్‌ ఆస్కింగ్‌?" అని ఎక్స్ వేదికగా తెలుగులో పోస్ట్ చేశారు.

Save Steel Plant Slogans On Devara: దేవర సినిమాకు విశాఖ స్టీల్ ప్లాంట్ సెగ, దేవర పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోస్టర్లను అంటించిన కార్మికులు

Arun Charagonda

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలోనే ఈ మూవీకి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నిరసన సెగ తగిలింది. ఈ సినిమా పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదాలతో ఉన్న పోస్టర్‌‌ను కార్మికులు అతికించారు. సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్.. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదాల పోస్టర్లను అంటించారు.

Jr NTR On Devara Movie: దేవర ప్రమోషన్స్‌లో బిజీగా ఎన్టీఆర్, తండ్రీకొడుకులుగా నేనే చేశానని వెల్లడి, వీడియో ఇదిగో

Arun Charagonda

'దేవర' ప్రమోషన్స్ భాగంగా అమెరికా పర్యటనలో ఉన్న ఎన్టీఆర్ 'బియాండ్ ఫెస్ట్'లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'RRRలో రామ్ చరణ్ & మీరు ఇద్దరూ కలిసి నటించారు. దేవరలో ఎలా' అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి ఎన్టీఆర్ స్పందిస్తూ 'దేవరలో నాది డబుల్ యాక్షన్. తండ్రీకొడుకులుగా నేనే నటిస్తున్నా. దేవర& వర క్యారెక్టర్స్ చేశా' అని తెలిపారు.

Advertisement

Vettaiyan Preview Video: వేట్టయన్- ద హంట‌ర్‌ ప్రివ్యూ వీడియో ఇదిగో, మ‌న‌కు ఎస్‌.పి అనే పేరు మీద ఒక యముడొచ్చి దిగినాడు అంటూ..

Vikas M

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘వేట్టయన్- ద హంట‌ర్‌’. టి.జె.జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ ఈ సినిమాను నిర్మించారు. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న రిలీజ్ అవుతుంది. ఈ నేప‌థ్యంలో ‘వేట్టయన్- ద హంట‌ర్‌’ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ పేరుతో చిత్ర యూనిట్ వీడియోను విడుద‌ల చేసింది.

IIFA Utsavam 2024 In UAE: ప్రతిష్టాత్మక ఐఫా ఉత్సవం 2024కు సర్వం సిద్ధం, మెగాస్టార్ చిరంజీవికి ఐఫా వేదికగా ప్రతిష్టాత్మక అవార్డు, అలరించనున్న దక్షిణాది తారలు

Arun Charagonda

ప్రతిష్టాత్మక ఐఫా(ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) ఉత్సవం 2024 అబుదాబిలోని యాస్ ఐలాండ్ లో ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే. దక్షిణ భారత చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 27, 2024న, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటులు ఒకే వేదికపై సందడి చేయనున్నారు.

KTR On Devara Pre Release: దేవర ప్రీ రిలీజ్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్, ప్రభుత్వ వైఫల్యంతోనే ప్రీ రిలీజ్ రద్దైందని వ్యాఖ్య..వీడియో ఇదిగో

Arun Charagonda

జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన చిత్రం దేవర. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనివార్య కారణాల వల్ల రద్దైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంచలన కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సరిగ్గా నిర్వహించడానికి రాలేదు ఈ అసమర్ధత ప్రభుత్వానికి అని మండిపడ్డారు.

Mohan Babu: నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ, రూ.10 లక్షలతో పారిపోయిన పనిమనిషి, సీపీకి ఫిర్యాదు చేసిన మోహన్ బాబు భార్య

Arun Charagonda

నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్ జల్ పల్లిలోని నివాసం లో రూ.10 లక్షలతో పారిపోయారు పనిమనిషి నాయక్. నిన్న రాత్రి రాచకొండ సీపీకి మోహన్ బాబు ఫిర్యాదు చేయగా తిరుపతిలో నాయక్ ను అదుపులోకి తీసుకున్నారు రాచకొండ పోలీసులు.

Advertisement

Urmila Matondkar Divorce: విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన 'రంగీలా' హీరోయిన్ ఊర్మిళ, 8 సంవత్సరాల వివాహా బంధానికి బ్రేక్!

Arun Charagonda

ఊర్మిళ మటోండ్కర్ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది. 8 ఏళ్ల వివాహా బంధానికి స్వస్తి చెబుతూ విడాకులు కావాలంటూ కోర్టు వెళ్లింది ఊర్మిళ. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవడం లేదని, భర్త నుంచి తనకు విడాకులు కావాలని కోర్టుకు వెళ్లినట్టు సమాచారం.

Devara Ticket Price: దేవర టీంకు షాక్‌, టికెట్ ధరల పెంపుపై హైకోర్టులో పిటిషన్, ఏ ప్రాతిపదికన టికెట్ల పెంపుకు అవకాశం ఇచ్చారో చెప్పాలన్న పిటిషనర్

Arun Charagonda

దేవర సినిమా టీంకు షాక్ తగిలింది. దేవర సినిమా టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. టికెట్ ధరల పెంపుతో సామాన్యులపై భారం పడుతుందని..ఏ ప్రాతిపదికన టికెట్ల పెంపుకు అవకాశం ఇచ్చారో చెప్పాలన్నారు పిటిషనర్.

Actor Jayam Ravi: భార్య ఆర్తిపై పోలీసులకు హీరో జయం రవి ఫిర్యాదు, తన వస్తువులను తిరిగి ఇప్పించాలని పోలీసులకు కంప్లైంట్

Arun Charagonda

భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తమిళ హీరో జయం రవి. విడాకుల తర్వాత తన భార్య ఆర్తి తనను ఇంటి నుంచి గెంటివేసిందని, తన వస్తువులను తిరిగి ఇప్పించాలని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు జయం రవి.

Tirupati Laddu Dispute: తిరుపతి లడ్డూ వివాదం, పవన్ కల్యాణ్‌కు కౌంటర్ విసిరిన ప్రకాష్ రాజ్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తిరుమల లడ్డూ అంశం ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ వేలు పెట్టడం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించడం తెలిసిందే.

Advertisement

Karthi Apologises To Pawan Kalyan: తిరుపతి లడ్డూ వివాదంపై వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్‌కు క్షమాపణలు చెప్పిన హీరో కార్తీ, వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన తమిళ్ హీరో

Hazarath Reddy

తిరుపతి లడ్డూ వివాదంపై తన వ్యాఖ్యలకు ఎదురుదెబ్బ తగిలిన కార్తీ, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్‌కు క్షమాపణలు చెప్పారు. పవన్ కళ్యాణ్ 11 రోజుల శుద్ధి కర్మ సమయంలో నటుడి ప్రారంభ వ్యాఖ్యలు విమర్శించబడ్డాయి.

Pawan Kalyan on Prakash Raj: ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోను, ప్రకాశ్ రాజ్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కల్యాణ్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

నేను హిందూ దేవాలయంలో అపవిత్రత గురించి మాట్లాడాను. ఇందులో ప్రకాశ్ రాజ్ కు (Pawan Kalyan on Prakash Raj) సంబంధం ఏమిటి. నేను వేరొక మతాన్ని నిందిచానా..? ఇస్లాం, క్రిస్టియన్ మతాల గురించి ఏమైనా తప్పుగా మాట్లాడానా? తిరుపతిలో అపవిత్రం జరిగింది.

Munjya Telugu Releases on OTT: హిందిలో రికార్డులు బ్రేక్ చేసిన ముంజ్యా తెలుగు వర్షన్ వచ్చేసింది, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న హర్రర్ మూవీ, రూ. 30 కోట్ల బడ్జెట్‌తో రూ.132 కోట్లు వసూల్

Hazarath Reddy

ముంజ్యా 2024లో విడుదలైన భారతీయ హిందీ భాషా హార్రర్ చిత్రం, ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించారు. శర్వరి, అభయ్ వర్మ, సత్యరాజ్, మోనా సింగ్ నటించారు. నామమాత్రపు పాత్ర పూర్తిగా CGIని ఉపయోగించి సృష్టించబడింది.

Jani Master Case Update: జానీ మాస్టర్‌‌కు మరో షాక్, ఐదురోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ నార్సింగి పోలీసులు కోర్టులో పిటిషన్, విచారణ రేపటికి వాయిదా

Vikas M

లైంగిక వేధింపుల ఆరోపణల్లో అరెస్టయిన కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నార్సింగి పోలీసులు రంగారెడ్డి కోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు. ఇటీవల జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు అతనిని (Jani Master Case Update) హైదరాబాద్‌కు తరలించి, కోర్టులో హాజరుపరిచారు.

Advertisement

Miss Universe India 2024: మిస్ యూనివర్స్ 2024 పోటీలకు భారత్ నుంచి రియా సింఘా, మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్‌ గెలుచుకున్న గుజరాత్‌ బ్యూటీ

Vikas M

గుజరాత్‌కు చెందిన రియా సింఘా మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని గెలుచుకుంది. దీంతో 'మిస్ యూనివర్స్ 2024' పోటీలో భారతదేశానికి ఈ భామ ప్రాతినిధ్యం వహిస్తుంది. మిస్ యూనివర్స్ ఇండియా 2024 గ్రాండ్ ఫినాలే సెప్టెంబర్ 22న రాజస్థాన్‌లోని జైపూర్‌లో ముగిసింది.

Mahesh Babu New Look: మహేశ్ బాబు న్యూలుక్‌ అదిరింది అంటున్న ఫ్యాన్స్, రాజమౌళి సినిమాలో కౌబాయ్ గెటప్ కోసమేనంటూ జోరుగా చర్చ

Vikas M

మహేష్‌ బాబు న్యూలుక్‌ను చూసి ఆయన ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. మహేశ్, రాజమౌళి కలయికలో రూపొందనున్న చిత్రం త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రంలో మహేశ్ ఎలా కనిపించబోతున్నాడనే విషయంపై అభిమానుల్లో కాస్త ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ఘట్టమనేని హీరో కూడా ప్రస్తుతం అదే మేకోవర్‌లో వున్నాడు.

Kannappa Update: అడివిని పీడించే అరాచకం మారెమ్మ... కుతంత్రమే ఆమె మంత్రం, కన్నప్ప నుంచి మారెమ్మ పాత్ర ఫస్ట్ లుక్ ఇదిగో

Vikas M

ఈ సోమవారం నాడు కన్నప్ప నుంచి మారెమ్మ పాత్రకు సంబంధించిన లుక్‌ను రిలీజ్ చేశారు. నటి ఐశ్వర్య ఈ మారెమ్మ లుక్‌లో అందరినీ భయపెట్టేలా ఉన్నారు. అడివిని పీడించే అరాచకం మారెమ్మ... కుతంత్రమే ఆమె మంత్రం అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.

Devara: దేవర సినిమా టిక్కెట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, ఈ నెల 26న అర్ధరాత్రి ఒంటిగంట షోకు కూడా అనుమతి

Vikas M

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న 'దేవర' చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సినిమా టిక్కెట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం కూడా పచ్చజెండా ఊపింది. దేవర సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. టిక్కెట్ ధరల పెంపునకు అనుమతివ్వాలని కోరగా... ప్రభుత్వం అంగీకరించింది.

Advertisement
Advertisement