New Income Tax E-Filing Portal: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త, కొత్త ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ను ప్రారంభించిన ఆదాయపు పన్నుశాఖ, మొబైల్‌ యాప్‌ కూడా విడుదల, కొత్త ఫీచర్లు గురించి ఓ సారి తెలుసుకోండి
Income Tax Filing (Photo Credits: Pixabay)

New Delhi, June 7: ఆదాయపు పన్ను శాఖ ప్రజలు మరింత సులభంగా పన్నుల చెల్లించే విధంగా కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. నేటి నుంచి కొత్త ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ను (www.incometax.gov.in) అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐటీ రిటర్న్‌లను తక్షణమే అమలు జరిగే విధంగా ఈ కొత్త e-Filing పోర్టల్‌ రూపొందించినట్లు ఆదాయపన్ను శాఖ తెలిపింది. పోర్టల్ తో పాటు మొబైల్‌ యాప్‌ను కూడా విడుదల చేయనున్నట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌(సీబీడీటీ) ఒక ప్రకటనలో వెల్లడించింది.

కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం అత్యుత్తమ అనుభవాన్ని అందించడానికి ఈ పోర్టల్ (New Income Tax E-Filing Portal) తీసుకొస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సీబీడీటీ) తెలిపింది. ఆదాయ‌పు ప‌న్ను పోర్ట‌ల్‌లో అందుబాటులో ఉండే అన్ని ముఖ్య‌మైన‌ ఫీచ‌ర్లు మొబైల్ యాప్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. దీంతో మొబైల్ నెట్‌వ‌ర్క్‌తో ఎప్పుడైనా, ఎక్క‌డైనా యాప్‌ను యాక్సెస్ చేయ‌వ‌చ్చు. దీని వల్ల పన్ను సంబందిత విషయాల్లో అవగాహన లేని వారు కూడా సులభంగా పన్ను చెల్లించేలా రూపొందించినట్లు పేర్కొంది.

పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, మెడికల్ ఎమర్జెన్సీ కింద రూ.లక్ష వరకు తీసుకునే వెసులుబాటు, ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో ఓ సారి తెలుసుకోండి

ఇక నుంచి ఆదాయపు పన్ను రిటర్న్స్(ఐటీఆర్) ధాఖలు చేయడం చాలా సులభం. ఐటీఆర్ 1, 4 (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్) ఐటీఆర్ 2(ఆఫ్‌లైన్) కోసం పన్ను చెల్లింపుదారులకు సహాయపడేలా ఇంటరాక్టివ్ ప్రశ్నలతో ఉచిత ఐటీఆర్ తయారీ సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉంది. పన్ను చెల్లింపుదారుల ప్రశ్నలకు త్వరగా స్పందించడానికి కొత్త కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు సీబీడీటీ తెలిపింది. వీటితో పాటు కొత్త టాక్స్‌ పేమెంట్‌ సిస్టమ్‌ జూన్‌ 18న ప్రారంభం అవుతుందని సీబీడీటీ తెలిపింది. ఇంటరాక్షన్లు, అప్‌లోడ్‌లు, పెండింగ్‌ యాక్షన్లు ఒకే డ్యాష్‌ బోర్డుపై కన్పిస్తాయని ఆదాయపు పన్ను శాఖ వివరించింది.

ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా.. అయితే వివిధ బ్యాంకుల్లో చార్జీలు తప్పక తెలుసుకోవాలి, ఏటీఎం లావాదేవీలకు పడే ఛార్జీలు, మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే పడే ఛార్జీల గురించి కూడా ఓ సారి తెలుసుకోండి

ఐటీ శాఖ ప్రకారం... కొత్త పోర్టల్‌లో సింగిల్ డాష్‌బోర్డ్ ఉంటుంది. ఇందులో పన్ను చెల్లింపుల ప్రక్రియ ఉంటుంది. అందువల్ల ప్రజలు ఎక్కడ చెల్లించాలి అని వెతుక్కోవాల్సిన పని ఉండదు. ఈ సింగిల్ డ్యాష్‌బోర్డులోనే పన్నులకు సంబంధించి అన్నీ ఉంటాయి. అందులోనే రిటర్నుల అప్‌లోడ్ కూడా ఉంటుంది. కొత్త పోర్టల్‌లో టాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఏదైనా సమస్య వచ్చినట్లు భావిస్తే... వెంటనే ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ కొత్తగా ఏర్పాటు చేసిన సెల్ సెంటర్‌ (కాల్ సెంటర్)కి కాల్ చేసి డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. ఈ కొత్త పోస్టల్‌లో తరచూ అడిగే ప్రశ్నలు (FAQs), యూజర్ మాన్యువల్స్, వీడియోలు, చాట్‌బోట్, లైవ్ ఏజెంట్ సదుపాయాలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.