File image of EPFO office | (Photo Credits: PTI)

ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. భవిష్యత్ నిధి అనేది ఇప్పుడు ఉద్యోగులకు చాలా ముఖ్యమైనది చెప్పుకోవాలి. అయితే కోవిడ్ కల్లోలంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. అలాంటి వారికి పీఎఫ్ నుంచి కొంత మొత్తాన్ని తీసుకునే వెసులుబాటును కంపెనీ ఈపీఎప్ సంస్థ కల్పించింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

మెడికల్ ఎమర్జెన్సీ కింద ఈపీఎఫ్ నుంచి రూ.లక్ష వరకు తీసుకునే వెసులుబాటు (EPF investors can withdraw up to Rs 1 lakh) కల్పిస్తూ ఈపీఎఫ్‌వో నిర్ణయం తీసుకుంది. అంటే ప్రాణాంతకర వ్యాధుల చికిత్స కోసం పీఎఫ్ సబ్‌స్క్రైబర్లు వారి ఈపీఎఫ్ (Employees' Provident Fund (EPF) ఖాతా నుంచి రూ.లక్ష వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. దీని కోసం హాస్పిటలైజేషన్ కాస్ట్ సమర్పించాల్సిన పని లేదు. మీరు మెడికల్ ఎమర్జెన్సీ కోసం డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలని భావిస్తే.. ఈపీఎఫ్‌వో (EPFO) వెబ్‌సైట్‌కు వెళ్లాలి. యూఏఎన్, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. తర్వాత ఆన్‌లైన్ సర్వీసెస్ అనే ఆప్షన్‌లోకి వెళ్లాలి. క్లెయిమ్‌పై క్లిక్ చేయాలి. కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది.

ట్విట్టర్‌కు ఆఖరి ఛాన్స్, భారత నిబంధనల్ని అనుసరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని నోటీసుల్లో హెచ్చరించిన కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ

ఇందులో బ్యాంక్ అకౌంట్ వివరాలను వెరిఫై చేసుకోవాలి. తర్వాత ఈపీఎఫ్‌వో నిబంధనలు తెలుసుకోవాలి. ప్రోసీడ్ ఫర్ ఆన్‌లైన్ క్లెయిమ్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మెడికల్ ఎమర్జెన్సీ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. కేవలం అర్హత కలిగిన వారికి మాత్రమే ఈ ఆప్షన్ చూపిస్తుంది. అయితే ఇలా డబ్బులు తీసుకునే వారికి పలు షరత్తులు వర్తిస్తాయని గుర్తించుకోవాలి.

ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా.. అయితే వివిధ బ్యాంకుల్లో చార్జీలు తప్పక తెలుసుకోవాలి, ఏటీఎం లావాదేవీలకు పడే ఛార్జీలు, మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే పడే ఛార్జీల గురించి కూడా ఓ సారి తెలుసుకోండి

సాధారణంగా.. UMANG యాప్, SMS, EPF పోర్టల్ లేదా Missed Call ద్వారా ఈజీగా మీ పీఎఫ్ అకౌంట్లలో బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు. పీఎఫ్/ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో ఓ సారి చూద్దాం.

1. SMS : PF బ్యాలెన్స్ చెకింగ్

* ఎస్ఎంఎస్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.

* మీ రిజిస్ట్రర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 7738299899కు SMS చేయాలి.

* మీరు పంపే మెసేజ్ EPFOHO UAN (విత్ స్పేస్) ఇలా టైప్ చేసి SMS పంపాలి.

* మీ UAN అకౌంట్ మీ KYC వివరాలకు లింక్ అయి ఉండాలి.

* యూనైటెడ్ పోర్టల్ పై రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ నుంచి మాత్రమే SMS పంపాలి.

2. Umang App : (Play Store/ iOS)

* మీ పీఎఫ్ అకౌంట్లో పెరిగిన వడ్డీని UMANG యాప్ ద్వారా సులభంగా చెక్ చేసుకోవచ్చు.

* UMANG App Download చేసుకోవాలి.

* ఆండ్రాయిడ్ యూజర్లు Play Store నుంచి UMANG యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి.

* ఐఫోన్ (iOS) యూజర్లు.. iOS స్టోర్ నుంచి UMANG యాప్ డౌన్ లోడ్ చేసుకోండి.

* మీ EPF UAN అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి.

* మీ UAN రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది.

* OTP ఎంటర్ చేస్తే చాలు.. మీ PF బ్యాలెన్స్ కు సంబంధించి వివరాలన్నీ చెక్ చేసుకోవచ్చు.

3. EPF పోర్టల్ ద్వారా బ్యాలెన్స్ చెకింగ్ :

* www.epfindia.gov.in వెబ్ సైట్ విజిట్ చేయండి.

* Our Services కింద For Employees ఆప్షన్ పై Click చేయండి.

* ఇక్కడ Member Passbook అనే బటన్ పై క్లిక్ చేయండి.

* మీ UAN User Name, Passwordsతో Login కావాల్సి ఉంటుంది.

* UAN అకౌంట్ తో లింక్ అయిన అన్ని Member IDలు కనిపిస్తాయి.

* మెంబర్ ఐడీ (PF No) EPF అకౌంట్ Select చేసుకోండి.

* EPF పాస్‌బుక్ స్ర్కీన్ ఓపెన్ చేయగానే బ్యాలెన్స్ కనిపిస్తుంది.

4. Missed Call ద్వారా బ్యాలెన్స్ చెకింగ్ :

* రిజిస్టర్ మొబైల్ నుంచి 011-22901406కు మిస్స్డ్ కాల్ ఇవ్వండి.

* మీ మొబైల్ నెంబర్ UAN అకౌంటుతో లింక్ తప్పనిసరిగా ఉండాలి.

* UAN యాక్టివేట్ అయి ఉండాలి. KYC వివరాలు కూడా కంప్లీట్ అయి ఉండాలి.

* మిస్సడ్ కాల్ ఇవ్వగానే.. రెండు రింగులు వచ్చి ఆటోమాటిక్ గా కాల్ కట్ అవుతుంది.

* ఈ కాల్ కు ఎలాంటి చార్జీ ఉండదు.

* కాల్ కట్ కాగానే.. మీ మొబైల్ కు SMS రూపంలో PF బ్యాలెన్స్ వివరాలు వస్తాయి.