News

Nara Lokesh America Tour Details: నేటి నుండి అమెరికాలో మంత్రి నారా లోకేష్ పర్యటన, ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా పారిశ్రామిక వేత్తలతో భేటీ

Arun Charagonda

నేటి నుంచి మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటించనున్నారు. జార్జీయా ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో నారా లోకేష్ పాల్గొని ప్రసంగించనున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో లో రేపు ఒరాకిల్ ప్రతినిధులతో పాటు పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ ఉన్నారు.

Techie Suicide in Hyderabad: పని ఒత్తిడి తాళలేక, చేసిన అప్పులు తీర్చలేక సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌ బలవన్మరణం.. హైదరాబాద్ లో ఘటన

Rudra

పని ఒత్తిడి తాళలేక ఓ సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌ ఏడు అంతస్తుల బిల్డింగ్‌ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌ నగరంలోని కోకాపేటలో ఈ విషాదం చోటుచేసుకున్నది.

TDP MLA Chadalavada Aravinda Babu:ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధైర్యంగా ఉన్నాం కానీ అధికారంలోకి వచ్చాకే భయపడాల్సి వస్తోంది..టీడీపీ నేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు

Arun Charagonda

టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో ధైర్యంగా ఉన్నాం... అధికారంలోకి వచ్చినా అణిగిమణిగి ఉండాల్సి వస్తుందన్నారు. ప్రతి వ్యవస్థలోనూ వైసీపీ ఉద్యోగులే ఉన్నారు... ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం అన్నారు. కార్యకర్తలు, నేతలు డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు కానీ అలాంటివి కుదరదని గుర్తుంచుకోవాలన్నారు.

Bomb Threat To Tirupati Hotels: తిరుపతి హోటళ్లకు బాంబు బెదిరింపు, ఉగ్రవాదుల బాంబు బెదిరింపు నేపథ్యంలో పోలీసుల ముమ్మర తనిఖీలు, అనుమానితుల సమాచారం ఇవ్వాలని పోలీసుల ఆదేశాలు

Arun Charagonda

తిరుపతిలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతోంది.తిరుపతిలో డాగ్ , బాంబ్ స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఉగ్రవాదుల బాంబు బెదిరింపు నేపథ్యంలో పలు హోటల్స్ లో తనిఖీ చేపట్టగా పలు హోటల్స్ యాజమాన్యాన్ని అప్రమత్తం చేశారు పోలీసులు. అనుమానితులు హోటల్ కు వస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు ఆదేశాలు చేశారు.

Advertisement

AI Chatbot: ఏఐ చాట్‌ బాట్‌ తో ప్రేమలో పడిన మైనర్ బాలుడు.. అనంతరం ఆత్మహత్య.. కోర్టుకెక్కిన తల్లి

Rudra

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం నేటి యువతకు ప్రమాదకరంగా మారింది అనడానికి మరో ఉదాహరణే ఈ ఘటన. ఏఐ చాట్‌ బాట్‌ తో ప్రేమలో పడిన 14 ఏళ్ల ఓ మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకొన్నాడు.

CID 2: యావత్తు దేశాన్ని ఉర్రూతలూగించిన సీఐడీ మళ్లీ బుల్లితెరపైకి.. త్వరలోనే సీఐడీ2

Rudra

అంతుపట్టని క్రైం కేసులను చిటికెలో సాల్వ్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్న సీఐడీ టీవీ సీరియల్ యావత్తు దేశాన్ని ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సీరియల్ మళ్లీ బుల్లితెరపై కనువిందు చేయనున్నది.

Fire Accident in Tupran: మెదక్ జిల్లాలోని తూప్రాన్‌ లో తెల్లవారుజామున కారు షెడ్డులో అగ్నిప్రమాదం.. 8 కార్లు దగ్ధం (వీడియో)

Rudra

మెదక్ జిల్లాలోని తూప్రాన్‌ లో ఈ తెల్లవారుజామున ఓ కారు షెడ్డులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.

Terrorist Attack in JK: జమ్ముకశ్మీర్‌ లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రమూకలు.. ఆర్మీ వాహనంపై దాడి.. అమరులైన ఇద్దరు జవాన్లు.. దాడిలో మరో ఇద్దరు పౌరులు కూడా బలి

Rudra

హిమాలయ ప్రాంతం జమ్ముకశ్మీర్‌ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లాలో గురువారం సాయంత్రం ఒక ఆర్మీ వాహనంపై దాడి జరిపారు.

Advertisement

Justice Sanjiv Khanna As Next Chief Justice Of India: సుప్రీంకోర్టు తదుప‌రి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా, నవంబ‌ర్ 11న ప్ర‌మాణ‌స్వీకారం, సంజీవ్ ఖన్నా గురించి పూర్తి వివ‌రాలిగో..

VNS

సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (Chief Justice Of India) జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా (Justice Sanjiv Khanna) నియమితులయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ (DY Chandrachood) పదవీ కాలం నవంబర్‌ 10న ముగియనున్న నేపథ్యంలో తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పేరును సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.

Supreme Court Comments on Aadhaar Card: ఆధార్ కార్డుపై సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు, పుట్టిన రోజు ధృవీక‌ర‌ణ కోసం ఆధార్ కార్డ్ ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేమ‌ని తీర్పు

VNS

వయసు నిర్ధరించేందుకు ఆధార్‌ (Aadhaar) ప్రామాణికం కాదని భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) పేర్కొంది. ఇందుకు సంబంధించి పంజాబ్‌-హరియాణా హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. రోడ్డు ప్రమాద బాధితుడికి పరిహారం చెల్లించే పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు (Supreme Court) ధర్మాసనం.. పాఠశాల రికార్డులో ఉన్న పుట్టిన తేదీనే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.

India Women Beat New Zealand Women By 59 Runs in 1st ODI 2024; వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్స్ కు షాక్ ఇచ్చిన ఉమెన్స్ టీం, తొలి వ‌న్డేలో 59 ప‌రుగుల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ, 1-0 తేడాతో సిరీస్ లో ముందంజ‌

VNS

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత న్యూజిలాండ్‌కు భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు భారీ షాకిచ్చింది. వ‌ర‌ల్డ్ క‌ప్ చాంపియ‌న్ అయిన సోఫీ డెవినె బృందానికి వారం రోజులు గడువ‌క ముందే టీమిండియా (Team India) తొలి ఓట‌మి రుచి చూపింది. అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోడీ స్టేడియంలో రాధా యాద‌వ్(3/35), సైమా థాకూర్(2/26)లు చెల‌రేగ‌గా భార‌త్ 56 ప‌రుగుల తేడాతో జ‌య‌భేరి మోగించింది.

Yugendra Pawar to Contest From Baramati: మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆస‌క్తిక‌ర పోరు, బారామ‌తి నుంచి అజిత్ ప‌వార్ పై బ‌రిలోకి దిగుతున్న‌ శ‌ర‌ద్ ప‌వార్ మ‌నువ‌డు

VNS

బారామతి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న 32ఏళ్ల యుగేంద్ర పవార్‌ పేరు (Yugendra Pawar) సైతం ఉంది. పవార్‌ కుటుంబానికి కంచుకోట బారమతి నియోజకవర్గంలో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీలో మరో వర్గం అధినేత, మహరాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌పవార్‌ పోటీ చేస్తుండడం చర్చనీయంశంగా మారింది.

Advertisement

Delhi Developer Squats On Jiohotstar Website: అంబానీకి బిగ్ షాక్ ఇచ్చిన యాప్ డెవ‌ల‌ప‌ర్, జియో హాట్ స్టార్ డొమైన్ ముందుగానే కొనేశాడు, డొమైన్ ఇచ్చేందుకు ఎంత అడుగుతున్నాడంటే?

VNS

జియోహాట్‌స్టార్ (Jiohotstar.com) ఎవరి సొంతమో తెలుసా? రిలయన్స్ కంపెనీ? స్టార్ ఇండియా? రెండూ కాదు.. ఈ డొమైన్ నేమ్ ఒక యాప్ డెవలపర్ ముందుగానే కొనుగోలు చేశాడు. కేంబ్రిడ్జ్‌కి వెళ్లేందుకు అవసరమైన డబ్బులను జియో తనకు చెల్లిస్తుందని భావిస్తున్నాడు.

Union Cabinet Meeting Highlights: అమరావతికి హైదరాబాద్, చెన్నై, కోల్ కతాతో కనెక్టివిటీ, రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్, కేంద్ర కేబినెట్ మీటింగ్ పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) మొత్తం రూ.6,798 కోట్ల అంచనా వ్యయంతో (సుమారుగా) రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రెండు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.

Mahesh Babu: నువ్వు కాపాడిన 3,772వ ప్రాణం స్వామి, పి.గన్నవరంలో వైరల్ అవుతున్న మహేశ్ బాబు ఫ్లెక్సీలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కోనసీమ జిల్లా పి.గన్నవరంలో ఇప్పుడు ఎక్కడ చూసినా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఆ ఫ్లెక్సీలపై మహేశ్ బాబు బొమ్మ... నువ్వు కాపాడిన 3,772వ ప్రాణం స్వామి అంటూ ఓ పాప ఫొటో చూడొచ్చు

KTR: రైతుల కోసం జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా, చిట్టినాయుడు రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడేది లేదన్న కేటీఆర్, రాష్ట్రంలో హౌలా సీఎం ఉన్నాడని ఆగ్రహం

Arun Charagonda

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎక్కడికక్కడే పనులు అక్కడ ఆగిపోయినయ్ అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆదిలాబాద్‌లో జరిగిన రైతు మహాధర్నాలో పాల్గొన్న కేటీఆర్... ఆదిలాబాద్‌కు వచ్చేటప్పుడు డిచ్‌పల్లి దగ్గర పోలీసుల భార్యలు రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు అన్నారు. కాంగ్రెస్ పాలనలో పోలీసుల కుటుంబాలను పోలీసులే గుంజుకుపోయే పరిస్థితి ఉంది...ఇక్కడికు వస్తుంటే ఉట్నూరులో పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారేమోనని జోగు రామన్న చెప్పారు అన్నారు.

Advertisement

Prakasam Barrage: మరోసారి వార్తల్లో విజయవాడ ప్రకాశం బ్యారేజీ, రెయిలింగ్ వంగి ప్రమాదకరంగా మారిన రక్షణ గోడ...వీడియో ఇదిగో

Arun Charagonda

కృష్ణా జిల్లా విజయవాడ ప్రకాశం బ్యారేజి మరోసారి వార్తల్లో నిలిచింది. బ్యారెజ్ రక్షణ గోడ కుంగగా రెయిలింగ్ వంగి ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

SSMB29 Update: మహేష్ బాబు సినిమా కోసం అడవులు వెంట తిరుగుతున్న జక్కన్న,  జీపులో నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో పాట వింటూ

Hazarath Reddy

మహేష్ బాబు(Mahesh babu), రాజమౌళి(Rajamoulli) కాంబోలో వస్తున్న SSMB29 మీద లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది. రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ (SS Karthikeya) దీనికి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఇందులో డైరెక్టర్ రాజమౌళి ఫారెస్ట్ మధ్యలో జీప్లో కూర్చొని ప్రయాణం చేస్తోన్న వీడియోని.. రాజమౌళి తనయుడు కార్తికేయ షూట్ చేసి ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశారు.

Nalgonda: పెట్రోల్ బంకు మోసం, పోలీస్ స్టేషన్‌కు వెళ్తే ఎస్సై ఉల్టా బెదిరింపు..నయీమ్ బతికుంటే మీ ఆటలు సాగేవి కావు అనవసరంగా ఎన్‌కౌంటర్ చేశానని ఎస్సై కామెంట్..ఆడియో వైరల్

Arun Charagonda

కట్టంగూరు మండలం NH 65 రహదారిపై గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ బాధితుడికి చేదు అనుభవం ఎదురైంది. టాటా టియాగో కారు ఫుల్ ట్యాంక్ కెపాసిటీ 35 లీటర్లు కాగా రీడింగ్‌లో 42 లీటర్లు చూపించడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Hyderabad: చైతన్యపురి శిల్పి ఎలైట్ బార్‌ అండ్ రెస్టారెంట్‌లో కుళ్లిపోయిన కూరగాయలు, ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో సంచలన నిజాలు..కిచెన్‌లో బొద్దింకలు, సింథటిక్ ఫుడ్ కలర్స్‌ వాడుతున్నట్లు గుర్తింపు

Arun Charagonda

చైతన్యపురిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శిల్పి ఎలైట్ బార్ అండ్ రెస్టారెంట్ లో కుళ్లిపోయిన కూరగాయలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. కిచెన్ పరిసరాలు, ఫ్రిడ్జ్ అపరిశుభ్రంగా ఉందని చెప్పిన అధికారులు... ఫుడ్ లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు.

Advertisement
Advertisement