H1B Visas | Image used for representational purpose | (Photo Credits: PTI)

Amaravati, Febuary 19: అమెరికాకు ఉన్నత విద్య కోసం ఇండియా నుంచి వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తున్న భారతీయులు ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మొత్తం 68 వేల మంది భారతీయులు (Indian Techies) ఇప్పుడు అక్కడ హెచ్‌-1బీ వీసా కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో మన తెలుగు రాష్ట్రాలకు (AP And TS) చెందిన వారు దాదాపు 20 నుంచి 24 వేల మంది ఇంజనీర్లు ఉన్నారు. వీరంతా నిర్ణీత గడువులోపు హెచ్‌-1బీ వీసా పొందలేక పోతే ఇండియాకు రావాల్సి ఉంటుంది.

భారత్‌కు జీఎస్పీ రద్దు నిర్ణయాన్ని సమర్థించుకున్న అమెరికా

ఇండియా నుంచి అమెరికా వెళ్లి ఉన్నత విద్య పూర్తి చేసి, ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (Optional Practical Traning programme) అర్హతతో వీరంతా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. మూడేళ్ల కాలవ్యవధి కోసం ఇచ్చే ఓపీటీ (OPT) ఈ ఏడాదితో పూర్తి కానుంది. ఇప్పటికే రెండుసార్లు హెచ్‌1బీ వీసా (H-1B Visa) అవకాశం కోల్పోయిన ఈ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకు అమెరికా ప్రభుత్వం (Amercia Govt) ఈ ఏప్రిల్‌ వరకు చివరి అవకాశం ఇచ్చింది.

అప్పటికీ వీసా రాకపోతే స్వదేశానికి వీరంతా తిరిగి రావాలి. లేదా అక్కడే ఉన్నత విద్య కోర్సులు చేయాలి. అంటే మళ్లీ విశ్వవిద్యాలయంలో చేరి పీహెచ్‌డీలో చేరడం (అన్ని అర్హతలు ఉంటే)లేదా ఎంఎస్‌లో మరో కోర్సు చేయడమే ప్రత్యామ్నాయం. అయితే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న వారు ఉన్నత విద్య కోసం అక్కడ చేరుతారా అనేది సందేహమే.

అమెరికా అధ్యక్షుడికి చిరస్మరణీయంగా గుర్తుండిపోయేలా భారీ స్వాగత ఏర్పాట్లు

2015–16లో అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన వారు ఇప్పుడు వీసా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాగా 2014 నుంచి ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళుతున్న వారి సంఖ్య రెట్టింపు కావడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. కంప్యూటర్‌ రంగంలో పని చేసేవారికి అమెరికా ఏటా 85 వేల మందికి హెచ్‌-1బీ వీసాలు మంజూరు చేస్తోంది.

హౌడీ మోదీని గుర్తు చేసేలా కెమ్‌ ఛో ట్రంప్‌

కానీ, భారత్‌ నుంచి ఉన్నత విద్యకు వెళ్లి ఆపైన హెచ్‌-1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య 2016లోనే లక్ష దాటింది. ఈ ఏడాది భారతీయుల సంఖ్య 1.5 లక్షలు దాటుతుందని న్యూయార్క్‌కు చెందిన హెచ్‌1బీ వ్యవహారాల నిపుణుడు అటార్నీ నీల్‌ ఏ వెయిన్‌రిచ్‌ అంచనా వేస్తున్నారు.

మోడీ చేతిని ముద్దాడిన కాశ్మీరీ పండిట్, అగ్రరాజ్యంలో నరేంద్రుడికి ఘనస్వాగతం

వచ్చే రెండేళ్లలో హెచ్‌1బీ వీసా కోసం దరఖాస్తు చేసే భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల సంఖ్య 2 లక్షలు దాటినా ఆశ్చర్యం లేదని, వారిలో 65 నుంచి 70 వేల మందికి మాత్రమే వీసాలు దక్కుతాయని చెబుతున్నారు. ఓపీటీ గడువు దాటుతున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు 20 నుంచి 24 వేల మంది ఇంజనీర్లు ఉంటారని అంచనా.

ఇంతకీ హెచ్‌-1బీ వీసా అంటే ఏమిటీ?

అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు జారీ చేసే అనుమతి పత్రమే హెచ్-1బీ వీసా. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారికి వీటిని జారీ చేస్తారు. ఈ హెచ్-1బీ వీసా మూడు రకాలుగా ఉంటుంది. ప్రతి ఏడాదీ పరిమిత సంఖ్యలో మాత్రమే హెచ్-1బీ వీసాలను అమెరికా ప్రభుత్వం జారీ చేస్తుంది.

బ్యాంకాక్‌లో ప్రధాని మోడీ

సాధారణం: ఏడాదికి 65,000 వీసాలు జారీ చేస్తారు. వీటిని జనరల్ కోటా అని చెప్పుకోవచ్చు. అంటే ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

మాస్టర్స్: అమెరికాలో మాస్టర్స్ చేసిన వారికి ఏడాదికి 20,000 వీసాలు ఇస్తారు. వీటికి అందరూ దరఖాస్తు చేసుకోలేరు.

రిజర్వ్‌డ్: స్వేచ్ఛా వాణిజ్యంలో భాగంగా సింగపూర్, చిలీ దేశాలకు ఏడాదికి 6,800 వీసాలను రిజర్వ్ చేసి ఉంచారు.

హెచ్-1బీ వీసాలకు డిమాండు బాగా ఉంటుంది. కోటాకు మించి దరఖాస్తులు వస్తే లాటరీ విధానంలో వీసాలు కేటాయిస్తారు. కంప్యూటర్ ర్యాండమ్‌గా వీటిని ఎంపిక చేస్తుంది. కాగా కంపెనీలు కూడా తమ ఉద్యోగుల కోసం హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేస్తుంటాయి. అలాగే మరి కొన్ని సంస్థలు ఈ వీసాలను స్పాన్సర్ చేస్తుంటాయి.

Howdy, Modi Highlights

హెచ్-1బీ వీసా దరఖాస్తు ఫీజు సుమారు 1,600 డాలర్ల నుంచి 7,400 డాలర్ల వరకు ఉంటుంది. అంటే మన కరెన్సీలో చూస్తే దాదాపు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల మధ్య ఉండొచ్చు. ఇది ఆయా సంస్థల పరిమాణం ఆధారంగా నిర్ణయించబడుతుంది. 50 లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలు, 50 శాతం ఉద్యోగులు హెచ్-1బీ వీసాల మీద ఉన్న సంస్థలు అదనంగా 4,000 డాలర్లు (రూ.2.60 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది.

ఒకసారి హెచ్-1బీ వీసా లభిస్తే మూడేళ్లపాటు అమెరికాలో ఉండొచ్చు. ఈ కాల పరిమితిని పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. కానీ మొత్తం మీద ఆరేళ్లకు మించకూడదు. కాగా హెచ్-1బీ ఉద్యోగుల కుటుంబ సభ్యులు డిపెండెంట్ వీసా ద్వారా అమెరికాలో ఉండొచ్చు. ఇందుకు వారు హెచ్-4 వీసాలను తీసుకోవాలి. అయితే జీవిత భాగస్వామి, 21 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. హెచ్-4 వీసా ఉన్న కుటుంబ సభ్యులు అమెరికాలో చదువుకోవచ్చు. అయితే ఈ వీసా మీద ఎటువంటి ఉద్యోగాలు చేయడానికి లేదు. ఇందుకు తప్పనిసరిగా వర్క్ పర్మిట్ తీసుకోవాలి.