New Delhi, Nov 3: దేశ వ్యాప్తంగా రోజురోజుకీ డెంగీ జ్వరాలు (Dengue Fever) తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నాయి. డెంగీ జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేక కేంద్ర బృందాలను (Health Ministry sends central teams) పంపించాలని నిర్ణయించింది. హర్యానా, పంజాబ్, కేరళ, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, జమ్మూ అండ్ కశ్మీరు రాష్ట్రాల్లో డెంగీ జ్వరాలను అరికట్టేందుకు ( manage dengue outbreak) వీలుగా కేంద్ర ఆరోగ్యశాఖ నిపుణుల బృందాలను పంపనున్నారు.
నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, జాతీయ అంటువ్యాధుల నివారణ కేంద్రాల నిపుణులను ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు.డెంగీ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ కేంద్ర నిపుణుల బృందం సాంకేతిక సూచనలు ఇవ్వనుంది. 9 రాష్ట్రాల్లో డెంగీ నివారణపై సమీక్షించి దీని నివారణకు సత్వరం చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుక్ మాండవీయ అన్ని రాష్ట్రాల వైద్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శులను ఆదేశించారు.
కాగా, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో డెంగ్యూ కేసుల సంఖ్య అధికంగా ఉన్నది. అక్టోబర్ 31 నాటికి దేశ వ్యాప్తంగా నమోదైన డెంగ్యూ కేసుల్లో 86 శాతం ఈ 15 రాష్ట్రాల నుంచే ఉన్నాయి. ఇందులో 7 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉన్నది. ఢిల్లీలో 1530 డెంగీ కేసులు వెలుగుచూశాయి. అక్టోబరు నెలలోనే అత్యధికంగా 1200 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో డెంగీ మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది.
గత ఐదేళ్లలో అత్యధిక డెంగీ మరణాలు ఈ సీజన్‌లోనే నమోదు కావడం వ్యాధి తీవ్రత ఎంత స్థాయిలో వ్యాపించి ఉందో అద్దం పడుతోంది. ఒక్క వారంలోనే దేశంలో 531 కొత్త డెంగీ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,530కి చేరింది. డెంగీ బారినపడి ఇప్పటివరకూ ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. డెంగీ కేసుల తీవ్రతను నివారించేందుకు పరీక్షలను వేగవంతం చేయాలని డెంగీ NN-1 ఎలీసా టెస్టింగ్ కిట్లను అందించాలని ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్రం సూచనలు చేసింది.
రాష్ట్రాలకు పంపే కేంద్ర నిపుణుల బృందాలలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్లకు సంబంధించి అధికారులు ఉన్నారు. 2015లో ఢిల్లీలో డెంగీ తీవ్రస్థాయిలో వ్యాపించింది. అక్టోబరులోనే 10,600కు పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. 2018 తర్వాత ఢిల్లీలో అత్యధిక డెంగీ మరణాలు ఈ ఏడాదే నమోదయ్యాయి. 2016లో 10మంది డెంగీతో మృతిచెందారు. జనవరి 1 నుంచి అక్టోబర్ 30 మధ్యకాలంలో డెంగీ కేసులు, 2020లో 612, 2019లో 1,069, 2018లో 1,595 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది 1,530 కొత్త డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో జనవరి-ఆగస్టు మధ్య 124 కేసులు నమోదు కాగా.. ఆగస్టు తర్వాత డెంగీ కేసుల తీవ్రత పెరిగింది.