Lucknow, February 22: ఉత్తర ప్రదేశ్‌లోని (UP) సోన్‌భద్ర జిల్లాలో భారీగా బంగారం నిక్షేపాలు బయటపడ్డాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) (Directorate of Geology and Mining) బంగారపు గనులను (Gold Rush Hits UP) కనుగొంది. దాదాపు 3 వేల టన్నుల ముడి బంగారం నిల్వలను గుర్తించామని జియాలజీ, మైనింగ్ విభాగం శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుత ధరల ప్రకారం వాటి విలువ రూ. 12 లక్షల కోట్లు ఉంటుంది. ఇది దాదాపు భారత దేశ సంపదకు దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. సోన్ పహాడీ, హర్ది ప్రాంతాల్లో బంగారం నిల్వలు కనుగొన్నారు. 1992-93 కాలం నుంచే ఇక్కడ పరిశోధనలు జరపడం మొదలుపెట్టారు
సోన్‌భద్ర (Sonbhadra district ) దేశంలోని అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటి. బంగారం నిల్వలను గుర్తించిన పర్వతం 108 హెక్టార్లలో విస్తరించి ఉంది. దాన్ని వేలం వేసేందుకు ఈ– టెండర్లను కూడా ఆహ్వానించారు. 2005లోనే ఇక్కడ ఖనిజ నిక్షేపాలను గుర్తించే కార్యక్రమం ప్రారంభించామని సోన్‌భద్ర జిల్లా మైనింగ్ ఆఫీసర్ కేకే రాయ్ తెలిపారు. బంగారం గనికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఈ ప్రాంతంలో యురేనియం సహా విలువైన ఖనిజ నిక్షేపాలు కూడా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు.
ఈ బంగారం నిల్వలతో పోలిస్తే ప్రపంచంలోనే రెండో స్థానంలో ఇండియా ఉంటుంది. అమెరికా తర్వాత స్థానాన్ని భారత్ సొంతం చేసుకోనుంది. అమెరికాలో 8వేల 133టన్నుల నిల్వలు ఉండగా, జర్మనీలో 3వేల 366టన్నులు, ఇటలీలో 2వేల 451టన్నులు, ఫ్రాన్స్‌లో 2వేల 436టన్నులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో బంగారంతో పాటు మరి కొన్ని మినరల్స్ ఉన్నట్లు గుర్తించారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం.. గతంలో భారత్ వద్ద 626 టన్నుల బంగారపు నిల్వలు ఉన్నాయి. కొత్తగా బయటపడ్డ గనుల తర్వాత అది ఐదు రెట్లు పెరిగే అవకాశం ఉంది.
Here's PTI Tweet
Geological Survey of India tells PTI there has been no discovery of gold deposits estimated to be around 3,000 tonnes in Uttar Pradesh's Sonbhadra district, as claimed by district mining official
— Press Trust of India (@PTI_News) February 22, 2020
ఇదిలా ఉంటే ఈ వార్తలపై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వివరణ ఇచ్చింది. తమ నుంచి అలాంటి ప్రకటన ఏమి రాలేదని, బంగారు గనుల ప్రచారంతో తమకు సంబంధం లేదని తెలిపింది. జిల్లాకు చెందిన మైనింగ్ అధికారి ఇచ్చిన సమాచారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. పీటీఐ ఈ వార్తను ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
ఇదిలా ఉంటే బ్రిటిష్ కాలంలోనే ఇక్కడ బంగారం నిల్వల కోసం తవ్వకాలు మొదలుపెట్టారు. అక్కడ నక్సల్స్ ఉండే ప్రాంతం కావడంతో అంతగా సాధ్యపడలేదు. ఇది నాలుగు రాష్ట్రాల సరిహద్దు ఉన్న జిల్లా. పడమరన మధ్యప్రదేశ్, దక్షిణాన చత్తీస్‌ఘడ్, తూర్పున బీహార్, ఆగ్నేయంలో జార్ఖండ్ ఉన్నాయి.