YS Jagan Slams Chandrababu: చంద్రబాబులాగా బాదుడు భారతదేశ చరిత్రలోనే ఎవ్వరూ చేసి ఉండరు, కూటమి ప్రభుత్వంపై మండిపడిన జగన్

టీడీపీ జనసేన బీజేమీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

YS Jagan Slams Chandrababu: చంద్రబాబులాగా బాదుడు భారతదేశ చరిత్రలోనే ఎవ్వరూ చేసి ఉండరు, కూటమి ప్రభుత్వంపై మండిపడిన జగన్
YS jagan Meeting (photo-YSRCP/X)

Vjy, Nov 4: టీడీపీ జనసేన బీజేమీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఆరు నెలల్లోనే విపరీతమైన వ్యతిరేకత ఉందని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలల వ్యవధిలోనే ఇంత వ్యతిరేకత రావడం ఎప్పుడూ చూడలేదని జగన్ తెలిపారు. సూపర్ సిక్స్ లేదు, సెవెన్ లేదని... కూటమి నేతలను ప్రజలు ఎక్కడికక్కడ ప్రశ్నించే పరిస్థితులు వచ్చాయని అన్నారు.

రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని జగన్ అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్ లో ఉందని... జనవరి వస్తే రూ. 2,800 కోట్లు పెండింగ్ అవుతుందని చెప్పారు. వసతి దీవెనకు రూ. 1,100 కోట్లు పెండింగ్ లో ఉందని అన్నారు. తొమ్మిది నెలలుగా ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయని చెప్పారు. నాలుగు నెలలుగా 104, 108 ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని అన్నారు.

వీడియో ఇదిగో, విశాఖలో అంగన్‌వాడీ టీచర్‌పై యాసిడ్ దాడి, బాధితురాలికి తీవ్ర గాయాలు

కరెంటు ఛార్జీలను బాదే పనులు మొదలయ్యాయని విమర్శించారు. వర్షాల దెబ్బకు రైతులు కుదేలవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న రేటు కంటే డబుల్ రేట్ కి ఇసుక అమ్ముతున్నారని అన్నారు. మద్యం షాపులను చంద్రబాబు, ఆయన మనుషులు చేతిలోకి తీసుకున్నారని ఆరోపించారు. ఒక్కో బెల్టు షాపుకు రూ. 2 నుంచి 3 లక్షలకు వేలం పాట పెడుతున్నారని చెప్పారు. ప్రజల తరపున గళం విప్పాల్సిన సమయం వచ్చిందని... జిల్లాల అధ్యక్షులు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు.

చంద్రబాబులాగా బాదుడు భారతదేశ చరిత్రలోనే ఎవ్వరూ చేసి ఉండరని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నీరుగారిపోయాయి, దిగజారిపోయాయి. మొట్టమొదటి సారిగా మూడు త్రైమాసికాలుగా ఫీజు రియింబర్స్‌మెంట్‌ పెండింగ్‌లో ఉంది. జనవరి వస్తే ఏకంగా రూ.2800 కోట్లు పెండింగ్‌ అవుతుందన్నారు.అలాగే, వసతీ దీవెనకూ రూ.1100 కోట్లు పెండింగ్‌. ఫీజులు కడితే తప్ప కాలేజీలకు రావొద్దని చెప్తున్నారు. పిల్లలు చదువులు మానేసి పనులకు వెళ్తున్నారు. ఆరోగ్య శ్రీ బకాయిలు కూడా ఉన్నాయి. దాదాపు తొమ్మిది నెలల బిల్లులు పెండింగులో ఉన్నాయి. పేషంట్లు ఆస్పత్రులకు వెళ్తే ఉచితంగా వైద్యం అందే పరిస్థితి లేదు. 108, 104 ఉద్యోగులకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వలేదన్నారు.

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో, జల్ జీవన్ మిషన్ పథకం ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు

రైతులకు ధాన్యం సేకరణలో కనీస మద్దతు ధరలు లభించడం లేదు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఈ-క్రాప్‌ చేసి, ఆర్బీకేల ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేసేవాళ్లు. ప్రతీ రైతుకూ మద్దతు ధర వచ్చేది. జీఎల్‌టీ ఛార్జీలు కూడా చెల్లించే వాళ్లం. అదనంగా ప్రతీ ఎకరాకు అదనంగా రూ.10వేలు వచ్చే పరిస్థితి ఉండేది. ఇవాళ పూర్తిగా రైతులు దెబ్బతిన్నారు. వర్షాల దెబ్బకు రైతులు కుదేలవుతున్నారు. ధాన్యం రంగు మారుతోంది, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు మొదలైంది. ఇప్పటికే రూ.6వేల కోట్ల వడ్డన ప్రారంభమైంది. మరో రూ.9వేల కోట్ల వడ్డన వచ్చే నెల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ స్థాయి బాదుడు భారతదేశ చరిత్రలోనే ఎవ్వరూ చేసి ఉండరని ఎద్దేవా చేశారు.

ఎవ్వరూ నిరసన వ్యక్తం చేయకూడదని తప్పుడు కేసులు పెడుతున్నారు. కేసులు మాన్యుఫ్యాక్చర్‌ చేసి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఎప్పుడూ జరగలేదు. రాష్ట్రం అంతటా భయాందోళన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఎవ్వరూ ఆందోళన చేయకూడదని ఇలా చేస్తున్నారు. అవినీతి విచ్చలవిడిగా నడుస్తోంది. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం కొనసాగుతోంది. ఎన్నికల్లో ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి పైసా ఆదాయం రాకపోగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కంటే డబుల్‌ రేట్లకు ఇసుక అమ్ముతున్నారు. నీకింత.. నాకింత.. అని పంచుకుంటున్నారని ఆరోపించారు.

ప్రభుత్వం నడుపుతున్న మద్యం షాపులు ఎత్తివేశారు. మొత్తం షాపులన్నింటినీ చంద్రబాబు, ఆయన మనుషులు చేతిలోకి తీసుకున్నారు. గ్రామంలో వేలం పాటలు పెట్టి బెల్టు షాపులు ఇస్తున్నారు. బెల్టు షాపులు లేని వీధి, గ్రామం లేదు. ఒక్కో బెల్టుషాపునకు రూ.2-3లక్షల వేలం పాట పెడుతున్నారు. ఏ పని జరగాలన్నా, ఏ పరిశ్రమ నడుపుకోవాలన్నా కమీషన్లు ఇచ్చుకోవాల్సిందే. ఎమ్మెల్యేలకు ఇంత, చంద్రబాబుకు ఇంత అని చెల్లించుకోవాల్సిందే. రౌడీ మామ్మూళ్ల కోసం వసూలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

నెల్లూరు క్వార్ట్‌జ్‌ గనులు కొట్టేయడానికి పక్కా ప్లాన్‌ చేశారు. ప్రజల తరఫున గళం విప్పాల్సిన సమయం వచ్చింది. అనుకున్న దాని కంటే ముందుగానే ఆ సమయం వచ్చింది. ఆరు నెలలకే అలాంటి పరిస్థితి తలెత్తింది. జిల్లా అధ్యక్షులు క్రియాశీలక పాత్ర పోషించాలి. కరెంటు ఛార్జీలు పెంపు, ధాన్యం సేకరణలో దళారీల రాజ్యం, మద్దతు ధర దక్కకపోవడం, ఫీజు రియింబర్స్‌మెంట్‌ అంశాలు ప్రజలను ఇప్పుడు ఇబ్బందిపెడుతున్నాయి. మండలం, నియోజకవర్గాలు, జిల్లా స్థాయి మూడు స్థాయిల్లో ఆందోళనలపై కార్యాచరణ చేపట్టాలి’ అని సూచించారు.

(The above story first appeared on LatestLY on Dec 04, 2024 09:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).