Covid Vaccine Deaths: కరోనా టీకాతో మరణాలకు కేంద్రానికి సంబంధం లేదు, సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం, టీకాలు వేయడానికి చట్టపరమైన బలవంతం ఏమీ లేదని వెల్లడి
Vaccine | Representational Image | (Photo Credits: Flickr)

New Delhi, Nov 29: కరోనా వైరస్ టీకా తీసుకున్న తర్వాత ఏవైనా తీవ్ర దుష్ప్రభావాలు ఎదురైతే అందుకు తమ బాధ్యత ఉండబోదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా టీకా తీసుకున్న వ్యక్తి ఎవరైనా మరణించినట్టయితే (Covid Vaccine Deaths) సివిల్ కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసి పరిహారం కోరడమే మార్గమని (Centre Tells SC) పేర్కొంది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ను ప్రజాప్రయోజనాల దృష్టా ప్రభుత్వం ప్రోత్సహించిందని, టీకాలు వేయడానికి చట్టపరమైన బలవంతం ఏమీ లేదని (No Legal Compulsion ) కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించిన అఫిడవిట్ లో తెలిపింది.

గతేడాది కరోనా టీకా తీసుకున్న అనంతరం ఇద్దరు వేర్వేరు యువతులు మరణించారు. దీంతో వారి తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి స్పందనగా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. కరోనా టీకాలు తీసుకున్న అనంతరం చోటు చేసుకున్న మరణాలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని పిటిషనర్లు కోరారు. టీకాలు తీసుకున్న తర్వాత తీవ్ర దుష్ప్రభావాలు ఎదురైతే వెంటనే గుర్తించి సత్వర చికిత్స అందించే ప్రోటోకాల్ కోసం డిమాండ్ చేశారు.

మంకీపాక్స్‌ కు కొత్తపేరు పెట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ‘ఎంపాక్స్’గా పేరు మార్పు.. ఎందుకో తెలుసా?

వాక్సిన్‌ దుష్ప్రభావాలతో బాధపడుతున్న వ్యక్తులను ముందస్తుగా గుర్తించి చికిత్స అందించేందుకు మార్గదర్శకాలను రూపొందించేందుకు ప్రభుత్వానికి ఆదేశాలను ఇవ్వాలని పిటిషనర్లు కోర్టును కోరారు. ప్రతి వ్యాక్సిన్‌కు ఇమ్యునైజేషన్ (AEFIలు) అనుసరించే ప్రతికూల సంఘటనలు నివేదించబడుతున్నాయని, వ్యాక్సిన్లు థర్డ్‌ పార్టీలతో తయారవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు సంబంధించిన సమాచారం పబ్లిక్‌ డొమైన్‌లో ఉచితంగా అందుబాటులో ఉందని కోర్టుకు తెలిపింది.

వైరల్ వీడియోలు, చైనాలో కరోనా కల్లోలానికి జీరో కోవిడ్ విధానమే కారణమంటూ నిరసనలు, వెంటనే దాన్ని తీసేయాలని దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన ప్రజలు

ఈ సందర్భంగా పిటిషనర్ల నష్ట పరిహారం డిమాండ్‌ను ఆరోగ్యమంత్రిత్వ శాఖ తోసి పుచ్చింది. వ్యాక్సినేషన్‌ ప్రతికూల ప్రభావాలతో వ్యక్తి శారీరకంగా గాయమైనా, మరణించినా చట్టప్రకారం అతని కుటుంబం పరిహారం కోరుతూ సివిల్‌ కోర్టులో దావా వేయొచ్చని. నిర్లక్ష్యానికి సంబంధించిన కేసుల వారీగా కేసు నమోదు చేయవచ్చని అఫిడవిట్ పేర్కొంది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కొలిన్ గోన్సాల్వేస్ వాదనలు వినిపిస్తూ.. వ్యాక్సిన్‌తో కలిగే నష్టాలను ముందుగానే తెలియజేసి సమ్మతి తీసుకుని ఉంటే ఈ మరణాలు సంభవించి ఉండేవి కావన్నారు.

వ్యాక్సిన్లు, మందులను స్వచ్ఛందంగా వాడేందుకు ‘సమ్మతి’ అనే ప్రశ్న వర్తించదని, మోతాదుకు సంబంధించి ప్రతికూల ప్రభావాలు స్వల్పంగా ఉంటాయని కేంద్రం పేర్కొంది. ఈ ఇద్దరు యువతుల మరణాలపై కేంద్రం సంతాపం వ్యక్తం చేసింది. ఈ మరణాలు కరోనా టీకాల వల్లేనని ఈ ఒక్క కేసులోనే నేషనల్ ఏఈఎఫ్ఐ కమిటీ గుర్తించినట్టు పేర్కొంది. జరిగిన నష్టంపై సివిల్ కోర్టును ఆశ్రయించి, పరిహారం కోరే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. 2022 నవంబర్ 19 నాటికి 219.86 కోట్ల కరోనా టీకా డోసులు ఇవ్వగా, 92,114 కేసుల్లో దుష్ప్రభావాలు కనిపించినట్టు తెలిపింది. ఇందులో 89,332 కేసులు స్వల్ప స్థాయివేనని వివరించింది. 2,782 కేసుల్లో తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తాయని తెలిపింది.