Newyork, Nov 29: భారత్ (India) సహా పలు దేశాలను భయపెట్టిన మంకీపాక్స్ (Monkeypox)కు కొత్త పేరు (New Name) వచ్చేసింది. ఈ పేరు జాత్యహంకారానికి కారణం అవుతోందన్న ఆందోళనల నేపథ్యంలో దాని పేరును ‘ఎంపాక్స్’ (Mpox)గా డబ్ల్యూహెచ్ఓ (WHO) మార్చింది. ప్రపంచ నిపుణులతో పలు సంప్రదింపుల తర్వాత ఈ పేరును ప్రకటించింది. మంకీపాక్స్, ఎంపాక్స్ అనే పేర్లు ఏడాది పాటు ఉపయోగంలో ఉంటాయని, ఆ తర్వాత మంకీపాక్స్ అనే పేరు కనుమరుగవుతుందని వివరించింది.
నగరి క్రీడా సంబరాల్లో అనుకోని ఘటన.. కబడ్డీ ఆడుతూ కిందపడ్డ మంత్రి రోజా.. వీడియో ఇదిగో!
ఈ ఏడాది ప్రారంభంలో మంకీపాక్స్ వ్యాపించినప్పుడు ఆన్‌లైన్, ఇతర సెట్టింగులు, కొన్ని కమ్యూనిటీల్లో జాత్యహంకార, కళంకం కలిగించే భాషను ఉపయోగించడాన్ని గుర్తించి ఆ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు నివేదించారు. ఆ తర్వాత జరిగిన అనేక సమావేశాల్లో పలువురు వ్యక్తులు, దేశాలు మంకీపాక్స్ పేరుపై ఆందోళన వ్యక్తం చేశాయి.
పెళ్లి విందులో చికెన్ వడ్డించలేదని వరుడి స్నేహితుల గొడవ.. ఆగిన వివాహం.. హైదరాబాద్ లో ఘటన
జాత్యహంకారానికి తావులేని విధంగా పేరును మార్చాలని డబ్ల్యూహెచ్ఓను కోరాయి. దీంతో పలు పరిశీలనలు చేసిన సంస్థ చివరికి ‘ఎంపాక్స్’ గా పేరు మార్చింది. అసాధారణంగా ఉన్న వ్యాధులకు పేర్లు కేటాయించడం తమ బాధ్యత అని ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.