The National Emblem (Photo-IANS)

New Delhi, July 12: ఢిల్లీలోని కొత్త పార్లమెంట్ భవనంపై (new Parliament building) ఏర్పాటు చేసిన నాలుగు సింహాల జాతీయ చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఆవిష్కరించిన సంగతి విదితమే. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా కొత్త పార్లమెంట్‌ భవనంపై జాతీయ చిహ్నాన్ని మోదీ ఆవిష్కరించడంపై విమర్శలు (Opposition slams PM Modi) వస్తున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని, రాజ్యాంబద్ధమైన అధికార విభజనను అపహాస్యం చేశారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. పార్లమెంట్‌లో కార్యక్రమం కాబట్టి స్పీకర్‌ చేతుల మీదుగా ఆవిష్కరణ జరగాల్సి ఉండగా.. దాన్ని తోసిపుచ్చుతూ నరేంద్ర మోదీ ఆర్భాటం చేశారని ప్రతిపక్షాలు విమర్శించాయి. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్‌లో కార్యక్రమానికి ప్రతిపక్షాలను ఆహ్వానించకుండా.. ఓ ప్రైవేటు ఫంక్షన్లా, సొంత పార్టీ కార్యక్రమంలా నిర్వహించారని విమర్శించాయి. ఇదే సమయంలో ఈ కార్యక్రమానికి ( unveiling of national emblem) రాజ్యసభ చైర్మన్‌గా ఉండే ఉపరాష్ట్రపతి కూడా హాజరుకాకపోవడంపై కూడా విమర్శలు వస్తున్నాయి.

నీతి ఆయోగ్‌ సీఈఓగా పరమేశ్వరన్‌ అయ్యర్‌ బాధ్యతలు స్వీకరణ, అమితాబ్‌ కాంత్‌ స్థానంలో అయ్యర్‌ తాజా బాధ్యతలు

రాజ్యాంగం పార్లమెంట్‌, ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య అధికార విభజన చేసిందని, ప్రభుత్వాధినేతగా ఉన్న ప్రధాని పార్లమెంట్‌ భవనంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించకూడదని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించారని విమర్శించారు. సీపీఎం పొలిట్‌బ్యూరో కూడా మోదీ చర్య రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నదని అభిప్రాయపడింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ప్రతిపక్షాలను ఎందుకు దూరంగా పెట్టిందని ఎన్సీపీ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ మజీద్‌ మెమన్‌ ప్రశ్నించారు.

Here's IANS Tweet

పార్లమెంట్‌ అంటే ప్రధాని ఒక్కరిదే కాదని, ప్రతిపక్షాలు కూడా అందులో భాగమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నేతలను ఆహ్వానించకపోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. ఆవిష్కరణ సందర్భంగా మతపరమైన కార్యక్రమం నిర్వహించడంపై సీపీఎం అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్లమెంట్‌ ప్రతి ఒక్కరిదని, అక్కడ కార్యక్రమాన్ని ప్రైవేటుగా ఎలా నిర్వహిస్తారని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా ప్రశ్నించారు.

జాతీయ చిహ్నం, కొత్త పార్లమెంట్ ప్రత్యేకతలు

250 బీసీ నాటి ప్రసిద్ధ లయన్ క్యాపిటల్ ప్రతిమ అయిన ఈ భారీ జాతీయ చిహ్నాన్ని పూర్తిగా కాంస్యంతో తయారు చేశారు. దీని ఎత్తు 6.5 మీటర్లు కాగా, బరువు 9,500 కిలోలు. చిహ్నం బరువును మోయగలిగేలా 6,500 కేజీల స్టీల్‌తో ఓ సపోర్టింగ్‌ కట్టడాన్ని నిర్మించారు.దీనిని 150 భాగాలుగా చేసి భవనం పైకప్పు పైకి తీసుకెళ్లి జత చేశారు. దీనికి సుమారు రెండు నెలల సమయం పట్టింది. వంద మందికిపైగా ఆర్టిస్టులు ఆరు నెలలకుపైగా శ్రమించి తయారు చేసిన ఈ జాతీయ చిహ్నం కొత్త పార్లమెంట్‌ భవనానికి ప్రధాన ఆకర్షణగా నిలువనున్నది.

.1,250 కోట్ల వ్యయంతో కొత్త పార్లమెంట్‌ భవనాన్ని నిర్మిస్తున్నారు. తొలుత ప్రాజెక్ట్‌ ఖర్చు రూ.977 కోట్లుగా అంచనా వేయగా అది 29 శాతం మేర పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సెంట్రల్‌ విస్తా ప్రాజెక్ట్‌లో భాగంగా కొత్త పార్లమెంట్‌ భవనాన్ని నిర్మిస్తున్నారు. రాష్ట్రపతి భవన్‌కు కూతవేటు దూరంలోని 13 ఏకరాల విస్తీర్ణంలో నాలుగంతస్తుల కొత్త పార్లమెంట్‌ భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్‌ సంస్థ నిర్మిస్తున్నది. ఈ ఏడాది ఆగస్ట్‌ 15 నాటికి దీని నిర్మాణం పూర్తి చేయాలని తొలుత లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ డెడ్‌లైన్‌ను ఈ ఏడాది అక్టోబర్‌కు పొడిగించారు.