Politics

Parliament Budget Session 2024: జనవరి 31 నుంచి ఫిబ్ర‌వ‌రి 9 వ‌ర‌కూ పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు, ఫిబ్ర‌వ‌రి 1న మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్‌ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థికమంత్రి

Hazarath Reddy

లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు చివ‌రి పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు (Parliament Budget Session) ఈనెల 31 నుంచి ఫిబ్ర‌వ‌రి 9 వ‌ర‌కూ జ‌ర‌గ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో ఆర్ధిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఫిబ్ర‌వ‌రి 1న మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు

Telangana By-Elections 2024: తెలంగాణ ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఖాళీ అయిన రెండు స్థానాలకు ఉప ఎన్నికలు

Hazarath Reddy

తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు తాజాగా ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. రెండు సీట్లకూ విడివిడిగానే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ కార్యాలయం వేర్వేరుగానే నోటిఫికేషన్లను జారీ చేసింది. నేటి నుంచే నామినేష్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని అందులో పేర్కొంది.

Modi Most Successful Indian PM: మోదీ భారత దేశ చరిత్రలో గ్రేటెస్ట్ ప్రధాని, ప్రశంసల వర్షం కురిపించిన ముఖేష్ అంబానీ, గుజరాతీగా గర్వపడుతున్నానని వెల్లడి

Hazarath Reddy

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశసంల వర్షం కురిపించారు. భారత చరిత్రలో అత్యంత విజయవంతమైన ప్రధాని మోదీనే అని కొనియాడారు. గాంధీనగర్‌లో జరుగుతున్న ‘వైబ్రంట్ గుజరాత్‌ సమ్మిట్‌’ లో ప్రధాని సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Ambati Rayudu: మళ్లీ ట్విస్ట్ ఇచ్చిన అంబటి రాయుడు, నా కల వైసీపీతో నెరవేరేలా లేదంటూ ట్వీట్, పవన్ ఆలోచనలు, నా ఆలోచనలు ఒకేలా ఉన్నాయని వెల్లడి

Hazarath Reddy

తాజాగా జనసేన చీఫ్‌, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత ఆయన చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. పవన్ ఆలోచనలు, నా ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. ప్రజలకు సేవ చేయాలన్న నా కల వైసీపీతో నెరవేరేలా లేదు. నేను క్రికెట్ ఆడేందుకు దుబాయ్ వెళ్తున్నానని చెప్పుకొచ్చారు.

Advertisement

Kesineni Nani on Nara Lokesh: వీడియో ఇదిగో, లోకేష్ నువ్వు ఆఫ్ట్రాల్ గాడివి, నేను రెండుసార్లు ఎంపీ, ఎమ్మెల్యే‌గా గెలవలెనోడువి నాపై నీ పెత్తనమేంటి అంటూ ఫైర్ అయిన కేశినేని నాని

Hazarath Reddy

ఈ సందర్భంగా నారా లోకేష్ మీద మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ..లోకేష్ నువ్వు ఆఫ్ట్రాల్ గాడివి, నేను రెండుసార్లు ఎంపీ.. నువ్వు ఆఫ్ట్రాల్ ఎమ్మెల్యేగా ఓడిపోయినోడివి.. . ఎమ్మెల్యే గా గెలవలెనోడువి నాపై నీ పెత్తనమేంటి? అంటూ ఫైర్ అయ్యారు.

MP kesineni Nani on Chandrababu: ఇక నుంచి జగన్‌తోనే నా ప్రయాణం, ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు, తనను టీడీపీ నేతలు గొట్టంగాడు అన్న భరించానని ఆవేదన

Hazarath Reddy

విజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయిన సంగతి విదితమే. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మీద మండిపడ్డారు. టీడీపీ కోసం చాలా కష్టపడ్డానని, పార్టీ కోసం తన సొంత వ్యాపారాలను పక్కన బెట్టినట్లు తెలిపారు.

Sanjeev Kumar Resigns to YCP: కర్నూలులో వైసీపీకీ మరో బిగ్ షాక్, పార్టీకి రాజీనామా చేసిన కర్నూలు ఎంపీ సంజీవ్‌ కుమార్‌, త్వరలో టీడీపీలో చేరే అవకాశం

Hazarath Reddy

ఏపీలో వైసీపీకీ మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి మరో నేత గుడ్‌బై చెప్పారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వం, కర్నూలు ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు సంజీవ్‌ కుమార్‌ తెలిపారు.

Kesineni Nani Resigns to MP: ఎంపీ పదవికి కేశినేని నాని రాజీనామా, తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌కి వినతి

Hazarath Reddy

ఏపీలో మరి కొద్ది నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా (Kesineni Nani Resigns to MP) చేశారు. తన రాజీనామాను లోక్ సభ స్పీకర్‌ ఓం బిర్లాకు మెయిల్ ద్వారా పంపించారు.

Advertisement

Ayodhya Ram Temple Inauguration: అయోధ్య రామమందిర్ వేడుకలను బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రారంభోత్సవాన్ని RSS ఈవెంట్‌గా బీజేపీ సర్కారు మార్చిందని మండిపాటు

Hazarath Reddy

కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరి రామ మందిర కార్యక్రమానికి హాజరు కావడానికి నిరాకరించారు,వారు దీనిని RSS/BJP నిర్వహించే కార్యక్రమంగా అభివర్ణించారు.మతం అనేది వ్యక్తిగత విషయం కానీ RSS/BJP అయోధ్య ఆలయాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చాయి

MP Kesineni Nani Meet CM Jagan: సీఎం జగన్‌‌తో ముగిసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ, కేశినేని నాని వెంట ఆయన కుమార్తె శ్వేత, ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ ముగిసింది. బుధవారం మధ్యాహ్నాం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. కేశినేని నాని వెంట ఆయన కుమార్తె శ్వేత కూడా ఉన్నారు.

Ayodhya Ram Mandir Ceremony: అయోధ్య రామమందిర వేడుకకు హాజరుకావడం లేదని తెలిపిన సోనియా గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు, ఇది RSS/BJP ఈవెంట్ అని వెల్లడి

Hazarath Reddy

కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరి రామ మందిర కార్యక్రమానికి హాజరు కావడానికి నిరాకరించారు,వారు దీనిని RSS/BJP నిర్వహించే కార్యక్రమంగా అభివర్ణించారు.మతం అనేది వ్యక్తిగత విషయం కానీ RSS/BJP అయోధ్య ఆలయాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చాయి

‘India Has Been Our 911 Call’: ఎప్పుడూ కాల్ చేసినా మాల్దీవులను రక్షించేది భారత్ మాత్రమే, ఇండియాను 911 కాల్‌తో పోల్చిన మాల్దీవుల మాజీ రక్షణ మంత్రి మారియా అహ్మద్ దీదీ

Hazarath Reddy

మాల్దీవుల మంత్రులు భారత ప్రధానిపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై ఆ దేశ మాజీ రక్షణ మంత్రి మారియా అహ్మద్ దీదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు మాల్దీవుల ప్రభుత్వానికే చిన్నచూపు అని ఆమె అన్నారు. రక్షణతో సహా వివిధ రంగాలలో సహాయం చేస్తూ భారతదేశం నమ్మకమైన మిత్రదేశంగా ఉందని చెప్పారు.

Advertisement

Telangana Elections 2024: హైదరాబాద్‌కు రాజాసింగ్, పార్లమెంట్ ఎన్నికల కోసం తెలంగాణ బీజేపీ ఇంచార్జ్‌లు వీరే

Hazarath Reddy

తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో పది కమిటీ నేతల భేటీ జరిగింది. ఇందులో భాగంగానే పార్లమెంట్ పొలిటికల్ ఇంచార్జీలను తెలంగాణ బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

India-Maldives Row: ప్రధాని మోదీపై ఆ ముగ్గురు వ్యాఖ్యలు వారి వ్యక్తిగతం, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని భారత్‌కు స్పష్టం చేసిన మాల్దీవుల సర్కారు

Hazarath Reddy

మాల్దీవులు ప్రభుత్వ కేబినెట్‌లోని కొంతమంది సభ్యులు ఇటీవల ప్రధాని మోదీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు (India-Maldives Row) ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని (Does not represent govt’s view) మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం భారత రాయబారికి స్పష్టం చేసింది.

Andhra Pradesh Elections 2024: ఏపీలో అనర్హులుగా 5 లక్షల 64వేలకు పైగా ఓటర్ల పేర్లు, దొంగ ఓటర్లను చేర్చుతున్న 13 మందిపై కేసు నమోదు చేశామని తెలిపిన ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా

Hazarath Reddy

ఆయన మాట్లాడుతూ.. ఓట్ల నమోదుకు సంబంధించి డిసెంబరు 9 వరకు వచ్చిన వేర్వేరు దరఖాస్తులను పరిష్కరించామని ఆయన (AP CEO Mukesh Kumar Meena) చెప్పారు. డిసెంబరు 9 తర్వాత వచ్చిన 17,976 దరఖాస్తులను ఈ నెల 12 లోగా పరిష్కరిస్తామని తెలిపారు.

Andhra Pradesh Politics: విజయవాడలో టీడీపీకీ మరో షాక్, కార్పొరేటర్ పదవికి, టీడీపీకి గుడ్‌బై చెప్పిన కేశినేని శ్వేత

Hazarath Reddy

విజయవాడలో టీడీపీకీ మరో షాక్ తగిలింది. టీడీపీకి కేశినేని శ్వేత రాజీనామా చేశారు. తన కార్పొరేటర​్‌ పదవికి, టీడీపీకి ఆమె గుడ్‌బై చెప్పారు. తాజాగా విజయవాడ మేయర్‌ భాగ్యలక్ష్మికి కేశినేని శ్వేత తన రాజీనామా లేఖను అందించారు. ఈ సందర్భంగా తన కార్పొరేటర్‌ సభ్యత్వం రాజీనామా లేఖను కౌన్సిల్లో పెట్టి ఆమోదించాలని మేయర్‌ను శ్వేత కోరారు.

Advertisement

PM Modi Lakshadweep Island Visit: ప్రధాని మోదీ విజిట్ తర్వాత ట్రెండింగ్‌లోకి వచ్చిన లక్షద్వీప్, ఆ కీ వర్డ్‌ని గూగుల్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు

Hazarath Reddy

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని సందర్శించి, సుందరమైన ద్వీపసమూహంలోని కొన్ని ఫోటోలను షేర్ చేసిన తర్వాత వరుసగా గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో లక్షద్వీప్ కీవర్డ్ దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా, లక్షద్వీప్ కోసం గూగుల్ సెర్చ్‌లు గత 20 ఏళ్లలో అత్యధికంగా ఉన్నాయి, అయితే ప్రధాని మోదీ పర్యటన తర్వాత ఈ కీవర్డ్ పీక్ స్టేజీకి వెళ్లిపోయింది.

Maldives vs India: ప్రధాని మోదీ జోకర్ అంటూ అనుచిత వ్యాఖ్యలు, మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు, వివాదంపై రెండు దేశాలు సుదీర్ఘ చర్చలు

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ క్రమంలో మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం షహీబ్‌కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. వివాదంపై రెండు దేశాలు సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

Maldives vs India: ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై దుమారం, ముగ్గురుని మంత్రి పదవుల నుండి సస్పెండ్ చేసిన అక్కడి ప్రభుత్వం

Hazarath Reddy

ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్ లో పర్యటించిన సంగతి విదితమే. ఈ సందర్భంగా లక్షద్వీప్ ను పర్యాటకధామంగా మారుద్దామని ఆయన సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు.దీనిపై మాల్దీవుల మంత్రులు వ్యంగ్యంగా స్పందించారు.

Ayodhya Ram Mandir Invitees List: 22న జరగనున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హాజరయ్యే ముఖ్య అతిథులు వీరే!

Rudra

అయోధ్యలో జనవరి 22న జరగనున్న శ్రీ రామ మందిర ప్రారంభోత్సవానికి వడివడిగా ఏర్పాట్లు జరగుతున్నాయి. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

Advertisement
Advertisement