భారతదేశంలో ఆగస్టు 15, జనవరి 26వ తేదీల్లో మాత్రమే రెండు సార్లు జాతీయ జెండాలు ఎగురవేస్తాం. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆగస్టు 15న, భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చిన జనవరి 26న తేదిన గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day 2023) యావద్భారతం ఘనంగా జరుపుకుంటాం. ఈ రెండు రోజులు త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతాయి.అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా (Flag) ఎగురవేస్తారు.
అయితే ఆగస్టు 15, జనవరి 26న జాతీయ జెండా ఎగరవేయడంలో తేడాలుంటాయని చాలామందికి తెలియదు. ఆ రెండు రోజులు జాతీయ జెండా ఎగురవేయడంలో మూడు ప్రధాన తేడాలు ఉంటాయి. అందులో ఒకటి.. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ రోజున జాతీయ జెండాకు కర్రకు కింద కడతారు. జెండాను తాడుతో కింది నుండి పైకి లాగి.. జెండా కర్రపైకి వెల్లగానే తాడును లాగి జెండాను రెపరపలాడిస్తారు. బ్రిటీషర్ల నుంచి భారత్ స్వాతంత్రం పొందిందని చెప్పడానికి వీలుగా ఇలా జాతీయ జెండాను ఎగురవేస్తారు. దీనినే తెలుగులో జెండా ఎగురవేయడం , ఆంగ్లంలో ఫ్లాగ్ హోస్టింగ్ (flag hoisting) అంటారు.
ఇక రెండవది..జనవరి 26 రిపబ్లిక్ డే రోజు మాత్రం జెండా కర్ర పై భాగంలో తివర్ణ పతాకం కట్టబడి ఉంటుంది. తాడుతో దాని విప్పి రెపరెపలాడిస్తారు. రాజ్యాంగ బాషలో దీనిని జెండా విప్పడం అంటారు. అయితే ఇంగ్లీషులో అయితే ఫ్లాగ్ అన్ ఫర్ల్ (Flag unfurl) అంటారు.జనవరి 26న దేశ రాజ్యాంగ అధిపతి రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగురవేస్తారు.భారత్ కు స్వాతంత్రం వచ్చినరోజున మన రాజ్యాంగం అమలులోకి రాలేదు.ఆ సమయంలో దేశానికి రాష్ట్రపతి లేరు. అందుకే స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి జాతీయ జెండాను ఎగురవేస్తారు.ఈ రోజున రాష్ట్రపతి కేవలం తన సందేశాన్ని మాత్రమే అందిస్తారు.
ఇక మూడవది.. రాజ్‌పథ్‌లో రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగురవేస్తారు. రాష్ట్రాల్లో గవర్నర్లు జాతీయ జెండా ఎగురవేస్తారు.కాని స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15న ఎర్రకోటలో ప్రధానమంత్రి జాతీయ జెండాను ఎగురవేస్తారు. రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు జెండా ఆవిష్కరిస్తారు.