bad breath (Photo-Pixabay)

చాలా మంది నలుగురితో మాట్లాడే సమయంలో ప్రధానంగా ఎదురయ్యే సమస్య నోటి దుర్వాసన. మనం మాట్లాడుతున్నా, అవతల మాట్లాడుతున్నా ఎవరో ఒకరి నుంచి ఈ దుర్వాసన (Bad Breath) వస్తూ ఉంటుంది. దీంతో నోటి దుర్వాసన వచ్చే వారితో ఎక్కువ సేపు మాట్లాడేందుకు ఇతరులు వెనుకాడుతుంటారు. ఈ ఇబ్బందిని తొలగించుకునేందుకు మార్గాలను వెతుకుతుంటారు. దీనికి కొన్ని రకాల నివారణ మార్గాలను ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

ముందుగా తమ నోటికి చేతిని అడ్డుగా పెట్టుకుని ఒక్కసారి గాలి బలంగా బయటకు వదిలి, దుర్వాసన వస్తుందేమో చెక్ చేసుకోవాలి.నోటి దుర్వాసన ప్రధానంగా చాలా కారణాలు ఉంటాయి. డ్రై మౌత్ (నోరు ఎండిపోవడం). కొన్ని రకాల ఔషధాలు తీసుకునేవారు, పొగతాగే అలవాటు ఉన్నవారిలో నోరు ఎండిపోయి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఈ దుర్వాసన పోవాలంటే నోటిలో లాలాజలం ఉత్పత్తి అవుతుండాలి. లాలాజలం నోటిని శుభ్రం చేస్తుంటుంది. ఈ లాలాజలం తగ్గిన వారిలో దుర్వాసన వస్తుంటుంది.

గబ్బిలాల నుంచి మరో ప్రమాదకర వైరస్, ఎబోలా మాదిరి గినియాను వణిస్తున్న మార్‌బర్గ్‌ వైరస్‌, నెల రోజుల్లో తొమ్మిది మంది మృతి, మార్బర్గ్ వైరస్ లక్షణాలు, చికిత్స మార్గాలు ఓ సారి తెలుసుకోండి

ఇక తిన్న ఆహార పదార్థాలు పళ్లల్లో చిక్కుకుని, అవి పాడయ్యి దుర్వాసన వస్తూ ఉంటుంది. కాబట్టి తిన్న తరువాత నోటిని శుభ్రంగా కడుక్కుంటే ఈ బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక గ్యాస్ట్రో ఇంటెస్టినల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్ డీ) అనేది జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్య. తిన్న ఆహారాన్ని విచ్చిన్నం చేసి జీర్ణమయ్యేందుకు జీర్ణరసాలు విడుదల అవుతుంటాయి. ఈ రసాలు తిరిగి అన్నవాహిక పైపులోకి రావడమే జీఈఆర్డీ.దీని ద్వారా కూడా నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది.

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌తో గుండెపై తీవ్ర దుష్ప్రభావాలు, గుండెపోటు,పక్షవాతం,రక్తంలో గడ్డకట్టడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని తెలిపిన ప్రముఖ కార్డియాలజిస్ట్ అసీమ్‌ మల్హోత్రా

ఇక చిగుళ్ల సమస్యల్లోనూ నోటి దుర్వాసన వస్తుంటుంది. చిగుళ్లు నుంచి రక్తం కారుతున్నా, చిగుళ్ల వాపు కనిపించినా వైద్యులను సంప్రదించాలి. అలాగే మౌత్ కేన్సర్ (ముక్కు, నోటి మధ్య భాగంలో కేన్సర్) ఉన్న వారిలోనూ, మధుమేహం, ముక్కులో ఇన్ఫెక్షన్, గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్న వారిలోనూ దుర్వాసన వస్తుంది.

పరిష్కార మార్గాలు:

జీఈఆర్డీ, కేన్సర్, చిగుళ్ల సమస్యలు కనిపించినా, వాటి వల్ల నోటి దుర్వాసన వచ్చినా ముందుగా వైద్యున్ని సంప్రదించాలి. ఇక మాములు సమస్యల వల్ల నోటి దుర్వాసన వస్తే ఈ చిట్కాలు పాటించాలి. నోటి నుంచి దుర్వాసన వచ్చే వారు పెరుగును తినాలి. ఎందుకంటే పెరుగులో మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది. అలాగే లవంగం నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉండడం వల్ల కూడా నోటి దుర్వాసన పోతోంది. పైగా పంటి నొప్పి నుంచి కూడా ఉపశమనం ఇస్తుంది.

సోంపు నీటిలో కొంత వేసి కాచి, గోరు వెచ్చగా మారిన తర్వాత ఆ నీటితో పుక్కిలించడం కూడా ఫలితమిస్తుంది. తమలపాకులు నమలడం ద్వారా, తులసి ఆకులను పుక్కిట పెట్టుకుని కొంచెం కొంచెం నములుతూ విడుదలయ్యే రసాన్ని గార్గిల్ చేయడం ద్వారా కూడా దుర్వాసనను తరిమికొట్టవచ్చు. పొగాకు ఉత్పత్తులు నమిలే అలవాటు, చూయింగ్ గమ్ అలవాట్లను విడిచిపెట్టడం వల్ల ఈ దుర్వాసనను తరిమి కొట్టవచ్చు.