Viral
Attacked on Police: బిర్యానీ గురించి గొడవ.. సిబ్బందిపై మద్యం మత్తులో యువకుల వీరంగం.. అడ్డుకోబోయిన పోలీసుల మీదనే దాడి (వీడియో)
Rudraమహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో గలాటా జరిగింది. బిర్యానీ గురించి మొదలైన గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. మద్యం మత్తులో విర్రవీగుతూ కొందరు యువకులు బిర్యానీ సెంటర్ సిబ్బందిపై వీరంగం సృష్టించారు.
PM Modi Telangana Visit: నేడే మోదీ రెండ్రోజుల తెలంగాణ టూర్ ప్రారంభం.. నేడూ, రేపు ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటన.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు.. ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
Rudraలోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు తెలంగాణకు రానున్నారు. రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించనున్న ప్రధాని నేడు ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో పాల్గొంటారు.
Leopard Head Stuck in Vessel: బిందెలో ఇరుక్కున్న చిరుత తల.. ఐదు గంటలపాటు అవస్థ.. చివరకు కాపాడిన అధికారులు.. మహారాష్ట్రలో ఘటన (వీడియో)
Rudraమహారాష్ట్ర ధూలె జిల్లాలోని ఓ గ్రామంలోకి ప్రవేశించిన చిరుత నీరు తాగడానికి బిందెలో తల పెట్టింది. అయితే, నీటి మాట దేవుడెరుగు.. చివరకు ఆ చిరుత తల బిందెలో ఇరుక్కుపోయింది.
KCR Rally in Karimnagar: కరీంనగర్ లో ఈ నెల 12న బీఆర్ఎస్ సభ... ఎన్నికల శంఖారావం పూరించనున్న కేసీఆర్.. రోడ్ షోలలో తానూ పాల్గొంటానని ప్రకటన
Rudraబీఆర్ఎస్ పార్టీ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో కరీంనగర్, పెద్దపల్లి నేతలతో సమావేశం అయ్యారు. ఈ నెల 12న కరీంనగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.
Yuzvendra Chahal Viral Video: భయమేస్తుంది నన్ను వదిలేయ్ తల్లీ రెజ్లర్ ను వేడుకున్న టీమిండియా క్రికెటర్, వైరల్ గా మారిన వీడియో ఇదుగోండి!
VNSఫోగట్ చాహల్ ను భుజాలపైకి ఎత్తుకొని గిరగిరా తిప్పింది. చాహల్ బక్కపలచగా ఉండటంతో సంగీత ఫోగట్ తేలిగ్గా తన భుజాలపైకి ఎత్తికుంది. గిరగిరా రెండురౌండ్లు తిప్పింది. ఆందోళనతో చాహల్ ‘నన్ను వదిలేయ్ తల్లీ.. నేను దిగిపోతా’ అన్నట్లుగా ఫోగట్ ను వేడుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ యింది.
Pulse Polio Vaccination Drive: నేడు పల్స్‌ పోలియో.. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు చుక్కల కార్యక్రమం.. రేపు, ఎల్లుండి మాపప్‌ కార్యక్రమం
Rudraఆదివారం పల్స్‌ పోలియో కార్యక్రమం జరగనుంది. ఇందుకుగాను అన్ని ఏర్పాట్లను వైద్య ఆరోగ్యశాఖ పూర్తి చేసింది. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి ఐదేళ్ల చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు.
One Rupee Marriage: ఒక్క రూపాయికే పెండ్లి.. దివ్యాంగులకు వివాహాలు చేస్తున్న రూపాయి ఫౌండేషన్‌.. ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే
Rudraఒక్క రూపాయితో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే చాలు దివ్యాంగులకు వివాహం చేస్తారు. ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే. అనాథలు, దివ్యాంగ జంటలకు వివాహాలు జరిపించిన అమ్మ ఫౌండేషన్‌ నిర్వాహకులు నాగమల్ల అనిల్‌ కుమార్‌, అరుణ ఇటీవల ‘రూపాయి ఫౌండేషన్‌’ పేరుతో మరో సేవా సంస్థను స్థాపించారు.
Divorce for Saree: ‘నాకు నచ్చిన చీరలే కట్టుకోవాలి’ ఒత్తిడి తీసుకొచ్చిన భర్త.. ‘నచ్చని చీరల్ని కట్టుకోను’ తెగేసి చెప్పిన భార్య.. విడాకులకు దారితీసిన గొడవ.. ఆగ్రాలో ఘటన
Rudraతనకు నచ్చిన చీరలే కట్టుకోవాలని ఆ భర్త పంతంపట్టాడు. నేను మనిషినే.. నాకు కూడా కొన్ని ఇష్టాలు, అభిప్రాయాలు ఉంటాయ్. నచ్చని చీరలు ఎలా కట్టుకుంటాననేది ఆ భార్య ఆవేదన. చివరకు ఈ చీరల లొల్లి కోర్టుకెక్కింది. విడాకుల దాకా వెళ్లింది.
Elephants Last Rituals: మనుషుల్లాగే చనిపోయిన బిడ్డకు ఏనుగులు అంత్యక్రియలు చేస్తాయి.. మరణించిన పిల్ల ఏనుగు ముందు గట్టిగా ఏడుస్తాయ్‌.. గొయ్యి తీసి పూడ్చి, తర్వాత నీటిలో స్నానాలు చేస్తాయ్‌.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraమనుషులకు ఉన్నట్టే ఏనుగులకు కూడా తీవ్రమైన భావోద్వేగాలు ఉంటాయట. బిడ్డ చనిపోతే తట్టుకోలేనంత గర్భశోకానికి అవి గురవుతాయట. ఈ మేరకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది.
Hyderabad Joint Capital: హైదరాబాద్‌ ను మరో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి.. ఏపీ హైకోర్టులో పిల్
Rudraహైదరాబాద్‌ ను మరో పదేండ్ల పాటు ఏపీ, తెలంగాణల ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లాకు చెందినా ప్రజాసంక్షేమ సేవా సంఘం ఏపీ హైకోర్టులో ఓ పిల్ దాఖలు చేసింది.
YSRCP Election Manifesto: వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఫిక్స్.. ఈ నెల 10న విడుదలకు నిర్ణయం.. ఈసారి కూడా సంక్షేమానికే పెద్దపీట
Rudraఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. 'సిద్ధం' పేరిట ఇప్పటికే భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల శంఖారావాన్ని పూరించిన అధికార వైఎస్సార్సీపీ.... ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది.
Good News for Bank Employees: బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. వారానికి ఐదు రోజులే పనిదినాలు.. వేతన పెంపు కూడా.. జూన్ నెల నుంచే అమల్లోకి వచ్చే అవకాశం
Rudraబ్యాంకు ఉద్యోగులకు శుభవార్త. బ్యాంక్ ఎంప్లాయీస్ ఎన్నో ఏండ్లుగా డిమాండ్ చేస్తున్న ఐదు రోజుల పనిదినాల కల ఈ ఏడాది సాకారం కాబోతోంది.
Temperature Hikes: తెలంగాణ కుతకుత.. 40 డిగ్రీలకు చేరువలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు
Rudraతెలంగాణలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో 40 సెంటిగ్రేడ్ డిగ్రీలకు చేరగా, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో 38 డిగ్రీలు దాటింది. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరగొచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.
Pavitranath Passed Away: మొగలి రేకులు, చక్రవాకం సీరియల్స్ ఫేమ్‌ పవిత్రనాథ్ అలియాస్ దయ మృతి.. సోషల్ మీడియాలో వెల్లడించిన ఇంద్రనీల్, మేఘన
Rudraబుల్లితెరపై సంచలనం సృష్టించిన చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్‌ ద్వారా ప్రేక్షకులకు చేరువై ఇంద్ర తమ్ముడిగా దయ పాత్రలో మెప్పించిన నటుడు పవిత్రనాథ్ కన్నుమూశారు.
JEE Main Registration Ends Today: జేఈఈ మెయిన్‌ చివరి విడత దరఖాస్తుకు నేడే ఆఖరు.. రాత్రి 11 గంటలవరకూ అవకాశం
Rudraజేఈఈ మెయిన్‌ చివరి విడత దరఖాస్తుకు శనివారం రాత్రి 11 గంటలతో గడువు ముగియనుంది. ఏప్రిల్‌ 4-15 మధ్య ఆన్‌ లైన్‌ పరీక్షలు జరుగుతాయని జాతీయ పరీక్షల సంస్థ గతంలోనే ప్రకటించింది.
Yadadri Name Change: యదాద్రి ఇకపై మళ్లీ యాదగిరిగుట్ట.. పేరు మారుస్తామన్న తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
Rudraతెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి మళ్లీ పేరు మార్చుకోనున్నదా? క్షేత్రం మునుపటి పేరు యాదగిరి గుట్టగానే స్థిరపడనున్నదా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
Krish in Drug Case: రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ రక్త, మూత్ర నమూనాల సేకరణ.. ఇతర నిందితుల కోసం వివిధ రాష్ట్రాల్లో పోలీసుల గాలింపు
Rudraహైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్స్‌ కేసు శరవేగంగా సాగుతున్నది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సినీదర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ రక్త, మూత్ర నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు.
Google Removes Matrimonial Apps: ‘సర్వీస్ ఫీజు చెల్లింపు’ల్లో వివాదం.. ప్లేస్టోర్ నుంచి భారత్ మ్యాట్రిమోనీ, జాబ్ సెర్చింగ్ యాప్‌ లను తొలగించిన గూగుల్
Rudraసెర్చింజన్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్లేస్టోర్ నుంచి భారత్‌ కు చెందిన మ్యాట్రిమోనీ, జాబ్ సెర్చింగ్ యాప్ లను తొలగించడం మొదలుపెట్టింది.
Scorching Summer in India: రాబోయే 3 నెలలు భానుడు భగభగలు, తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతాయని ఐఎండీ వార్నింగ్, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Hazarath Reddyభారతదేశం ఈ ఏప్రిల్‌లో దేశంలో అతిపెద్ద ఎన్నికల సీజన్‌లోకి వెళుతున్నందున మండే వేసవిని (Scorching Summer in India) చూడబోతోంది. భారత వాతావరణ శాఖ (IMD) మార్చి నుండి మే వరకు సాధారణం కంటే ఎక్కువ హీట్‌వేవ్ రోజులను హెచ్చరించింది.రాబోయే మూడు నెలల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో అధిక సంఖ్యలో హీట్‌వేవ్ రోజులను మేము ఆశిస్తున్నామని తెలిపింది.
Paytm Payments Bank Fined: పేటీఎం బ్యాంకుకు కేంద్ర ఆర్ధిక శాఖ భారీ షాక్‌, మనీలాండరింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.5.49 కోట్ల జరిమానా
Hazarath Reddyమనీలాండరింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్-ఇండియా రూ.5.49 కోట్ల జరిమానా విధించింది .అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనల ఉల్లంఘింపు కారణమే ఈ జరిమానా అని తెలిపింది.