Viral

Telangana Rains: తెలంగాణలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. గత రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఎల్లుండి అల్పపీడనం ఏర్పడే అవకాశం

Rudra

తెలంగాణలో నేడు పలు ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Penumbral Lunar Eclipse: నేడు చంద్రగ్రహణం.. మళ్లీ ఇలాంటి గ్రహణం కోసం 2042 వరకు ఆగాల్సిందే.. నేటి చంద్రగ్రహణానికి ఓ ప్రత్యేకత ఉన్నది. అదేంటంటే? భారత్‌లో ఈ గ్రహణ ప్రభావం ఉంటుందా మరి??

Rudra

ఈ సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం నేడు ఏర్పడబోతోంది. నేటి గ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. దీనిని ‘పెనుంబ్రల్ గ్రహణం’ అంటారు. అంటే ఏమిటంటే??

Hindu wedding in Mosque: మసీదులో వేదమంత్రాలు నడుమ హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి, వేదికైన చెరువల్లి ముస్లిం జమాత్‌ మసీదు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కేరళ రాష్ట్రంలో మసీదులో జరిగిన ఓ హిందూ జంట వివాహం గత కొన్ని వారాలుగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అలప్పుజలోని చెరువల్లి ముస్లిం జమాత్‌ మసీదు ఈ హిందూ జంట పెళ్లికి వేదికైంది.

Serbia Shooting: క్లాసు రూంలో టీచర్లపై ఇష్టం వచ్చినట్లుగా కాల్పులు జరిపిన విద్యార్థి, సెక్యురిటీ గార్డుతోపాటు ఎనిమిది మంది విద్యార్థులు మృతి

Hazarath Reddy

సెర్బియా దేశంలో ఓ పాఠశాలలో 14 ఏళ్ల విద్యార్థి తుపాకీతో వీరంగం సృష్టించాడు. తన టీచర్‌పై క్లాస్‌రూమ్‌లోనే విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అంతేగాక మిగతా విద్యార్థులు, సెక్యూరిటీగార్డుపై ఇష్టారీతిగా కాల్పులకు తెగబడ్డాడు.

Advertisement

Volvo Cars Layoffs: ఆగని లేఆప్స్, 1300 మంది ఉద్యోగులను తీసేస్తున్న ప్రముఖ కార్ల దిగ్గజం వోల్వో, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలే కారణం

Hazarath Reddy

వోల్వో కార్స్ స్వీడన్‌లో దాదాపు 1,300 మంది కార్యాలయ ఆధారిత ఉద్యోగులను తొలగించనుంది, ఎందుకంటే ఇది ఖర్చు తగ్గింపును వేగవంతం చేస్తుంది. CEO జిమ్ రోవాన్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, గత సంవత్సరం తీసుకున్న ఖర్చు తగ్గింపు చర్యలు ఫలితాలను చూపించడం ప్రారంభించాయని, అయితే మరిన్ని చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు

Samantha Ruth Prabhu: పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో నెంబర్ వన్‌గా సమంత, అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్లను వెనక్కి నెట్టిన స్టార్ హీరోయిన్

Hazarath Reddy

ప్రముఖ నటి సమంత మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో నెంబర్ వన్ గా నిలిచారు. ఇండియన్ మూవీ డేటా బేస్ (ఐఎండీబీ) తాజాగా విడుదల చేసిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో సమంత అగ్రస్థానాన్ని అలంకరించడం విశేషం.

Uttar Pradesh Encounter: వరుస ఎన్‌కౌంటర్లతో హడలెత్తిస్తున్న సీఎం యోగి ఆదిత్యనాథ్, తాజాగా మరో కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ అనిల్‌ దుజానా కాల్చి చంపిన ఎస్‌టీఎఫ్‌ బలగాలు

Hazarath Reddy

యూపీలో వరుస ఎన్‌కౌంటర్లతో సీఎం యోగి ఆదిత్యనాథ్ హడలెత్తిస్తున్నాడు. యోగీ సీఎం అయ్యాక మార్చి 2017 నుంచి ఇప్పటి వరకు 183 మంది గ్యాంగ్‌స్టర్లు ఎన్‌కౌంటర్‌లో మరణించారు.

Karnataka Polls 2024: డీకే శివకుమార్‌‌కు మరోసారి తప్పిన పెను ప్రమాదం, ల్యాండ్‌ అయిన కొద్దిసేపటికే హెలిప్యాడ్‌ స్థలంలో మంటలు

Hazarath Reddy

కర్ణాటక ఎన్నికల వేళ కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు మరోసారి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ల్యాండ్‌ అయిన కొద్దిసేపటికే హెలిప్యాడ్‌ స్థలంలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Advertisement

Google Rolls Out Passkeys: గూగుల్ నుంచి అదిరిపోయే న్యూస్, పాస్‌వర్డ్‌ లేకుండా యాప్స్‌, వెబ్‌సైట్స్‌ లాగిన్‌ అయ్యేలా కొత్త ఫీచర్, పాస్‌కీస్‌ ఆప్సన్ అందుబాటులోకి..

Hazarath Reddy

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాస్‌వర్డ్‌ లేకుండా యాప్స్‌, వెబ్‌సైట్స్‌ లాగిన్‌ అయ్యేలా సరికొత్త ఫీచర్‌ను విడుదల చేయనుంది.

UK Horror: పెన్సన్ డబ్బులు ఎంజాయ్ చేయడం కోసం స్నేహితుడి శవాన్ని 2 సంవత్సరాలు ఫ్రీజర్‌‌లో ఉంచిన ఓ వ్యక్తి, నిందితుడికి అనుకూలంగా షాకింగ్ తీర్పు ఇచ్చిన కోర్టు

Hazarath Reddy

యూకేలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి పెన్షన్‌ (Pension) డబ్బు కోసం ఆశపడి 71 ఏళ్ల వృద్ధుడి (Pensioner) మృతదేహాన్ని రెండేళ్ల పాటు ఫ్రీజర్‌ (Freezer)లో దాచాడు. బర్మింగ్‌హామ్‌ (Birmingham)లో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

IPL 2023: ఐపీఎల్ ప్లే ఆఫ్ చేరే జట్లు లిస్ట్ ఇవేనట, ప్లేఆఫ్‌కు వెళ్లే నాలుగు జట్ల పేర్లను వెల్లడించిన హర్భజన్ సింగ్, ఓ సారి మీరు లుక్కేసుకోండి

Hazarath Reddy

ఐపీఎల్ 2023 కీలక దశకు చేరుకుంది. ప్లేఆఫ్ సమీపిస్తున్న కొద్దీ మ్యాచులన్నీ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఎలాగైనా ప్లేఆఫ్ బెర్తును దక్కించుకోవాలని కసితో ఆడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్ కు వెళ్లే నాలుగు జట్ల పేర్లను హర్భజన్ సింగ్ వెల్లడించాడు.

Himalayan Viagra: వయాగ్రా కోసం హిమాలయాలకు, మంచు తుపానులో గల్లంతైన 5 మంది, హిమపాతంలో సమాధి అయ్యారని అనుమానాలు

Hazarath Reddy

హిమాలయన్ వయాగ్రాగా పిలిచే అత్యంత విలువైన మూలికను తీసుకు వచ్చేందుకు వెళ్లిన కొంతమంది గల్లంతైన ఘటన నేపాల్ లో చోటు చేసుకుంది. హిమాలయన్ వయాగ్రా లేదా యార్సగుంబా కోసం వెళ్లిన ఐదుగురు వ్యక్తులు పశ్చిమ దార్చులా జిల్లాలో హిమపాతంలో సమాధి అయ్యారని అనుమానిస్తున్నారు.

Advertisement

IPL 2023: ఇదేం బౌలింగ్ సామి, 3.5 ఓవర్లలో 66 పరుగులా, ఇలాగైతే టీమిండియాలో చోటు కష్టమే, అర్ష్‌దీప్‌ సింగ్‌పై మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దీప్‌దాస్‌ గుప్తా కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

మొహాలీ వేదికగా బుధవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ పంజాబ్‌ కింగ్స్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. సొంతమైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అర్ష్‌.. 3.5 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చి కేవలం ఒకే ఒక వికెట్‌ తీశాడు. ఏకంగా 17.20 ఎకానమీతో చెత్త గణాంకాలు చేశాడు. స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శలు మూటగట్టుకుంటున్నాడు.

Telangana Shocker: తెలంగాణ హైకోర్టు సమీపంలో దారుణ హత్య, రూ. 10 వేలు ఇవ్వలేదని జనం చూస్తుండగానే వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన యువకుడు

Hazarath Reddy

తెలంగాణ హైకోర్టు గేట్‌ నంబర్‌ 6 వద్ద ఓ వ్యక్తిని దుండగుడు కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. జనం చూస్తుండగానే వ్యక్తిని పొడిచి అక్కడినుంచి పరారయ్యాడు. రూ.10 వేల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

Manipur Unrest: గిరిజనులు వర్సెస్‌ గిరిజనేతరులు, హింసాత్మకంగా మారిన మణిపూర్, రంగంలోకి దిగిన ఆర్మీతో పాటు అస్సాం రైఫిల్స్‌

Hazarath Reddy

గిరిజనులు వర్సెస్‌ గిరిజనేతరుల వ్యవహారంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ అట్టుడికి పోతోంది. నిరసనకారులు ప్రార్థనా స్థలాలు, వాహనాలను తగలబెట్టడంతో ఈ ఘర్షణలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఆర్మీ, అస్సాం రైఫిల్ బలగాలను రంగంలోకి దింపింది.

Relation Tips: నా భర్త గే అనే అనుమానం నన్ను నిద్ర పోనీయడం లేదు, ఆయన్ని అడుగాదామంటే భయమేస్తోంది, ఈ సమస్యను నేను ఎలా పరిష్కరించుకోవాలో దయచేసి చెప్పండి

Hazarath Reddy

మేము ఇష్టపడి ఎంగేజ్‌మెంట్ చేసుకున్న తర్వాత పెళ్ళి చేసుకున్నాం. మాకు ఓ పాప కూడా ఉంది. కానీ, ఈ మధ్య నా హజ్బెండ్ మీద నాకు గే అనే అనుమానం వస్తుంది. ఆ విషయం బయటికి తెలియకుండా ఉండేందుకు నాతో వారి కుటుంబ సభ్యులు పెళ్ళి చేసినట్లు అనిపిస్తుంది.

Advertisement

UP Police Harassed School Girl: రోడ్డున వెళుతున్న స్కూలు విద్యార్థినిపై కానిస్టేబుల్ లైంగిక వేధింపులు, సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

Hazarath Reddy

పాఠశాల విద్యార్థినిని ఫాలో అయి వేధిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉత్తరప్రదేశ్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు. ఖాకీ యూనిఫాం ధరించిన వ్యక్తి ద్విచక్ర వాహనంపై సైకిల్‌పై వెళుతున్న పాఠశాల విద్యార్థినిని అనుసరిస్తున్నట్లు ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అయింది.

IMD Alert On Cyclone: ఈ ఏడాది బంగాళాఖాతంలో తొలి తుపాను వచ్చేస్తోంది, ఒడిషాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం, ఏపీలో మరికొద్ది రోజులు భారీ వర్షాలు

Hazarath Reddy

బంగాళాఖాతం (బీవోబీ)లో మే 9న వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం తెలిపింది.మే 6న ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడుతుందని, మే 7న అదే ప్రాంతంలో అల్పపీడనంగా మారుతుందని, మరుసటి రోజు ఈ వ్యవస్థ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని IMD తెలిపింది.

Mumbai Shocker: ఈ రాత్రికి నీతోనే అంటూ అందమైన అమ్మాయిల ఫోటోలతో 71 ఏళ్ల వృద్ధుడికి ఎర, 4.5 లక్షలు కాజేసిన కేటుగాళ్లు, లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

Hazarath Reddy

అందమైన అమ్మాయిలతో స్నేహం, ఆనందాన్ని పొందాలనే ఆలోచన.. అమ్మాయి ఎర ఫలితంగా ముంబైకి చెందిన 71 ఏళ్ల రిటైర్డ్ అకౌంటెంట్ రూ. 4.5 లక్షలు పోగొట్టుకున్నాడు. నిజం తెలుసుకుని లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు సమతానగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Viral Video: షాకింగ్ వీడియో, తల తెగిపడిన పాము గిలగిల కొట్టుకుంటూ తనను తాను ఎలా కాటేసుకుందో చూడండి

Hazarath Reddy

విష సర్పం తనను తాను కరుచుకోవడం మీరెప్పుడైనా చూశారా..అయితే ఈ కింది వీడియోను మీరు చూడాల్సిందే. ఓడ్లీ టెర్రిఫైయింగ్‌ పేరుతో ఉన్న ట్విటర్‌ హ్యాండిల్లో పోస్టు చేసిన ఈ 15 సెకన్‌ల నిడివిగల వీడియోలో ఓ పాము (రక్తపింజరి) తల తెగిపోయి ఉంది.

Advertisement
Advertisement