మరో తెలుగు నటి కపిలాక్షి మల్హోత్రా(Actress Kapilakshi Malhotra) మయోసిటిస్‌తో బాధపడుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. తెలుగు చిత్రం ప్రేమ పిపాసిలో తన అరంగేట్రం చేసింది కపిలాక్షి . కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా మయోసైటిస్ (myositis) ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు సమాచారం. మయోసైటిస్.. ఇది కండరాల బలాన్ని ప్రభావితం చేసే అరుదైన , తీవ్రమైన ఆటో ఇమ్యూన్ వ్యాధి. గత రెండు సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది కపిలాక్షి.

దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు... పుష్ప 2 వసూళ్లకు తగ్గట్టుగా ట్యాక్స్ చెల్లింపులు జరగలేదన్న ఆరోపణల నేపథ్యంలో విస్తృత సోదాలు 

అయితే మయోసైటిస్ ఉన్న కమిట్ అయిన సినిమాల షూటింగ్‌ను ఎంత కష్టం ఎదురైన పూర్తి చేసింది కపిలాక్షి. 2020లో తెలుగు చిత్రం ప్రేమ పిపాసిలో నటుడు సుమన్ మరియు నటి సోనాక్షి వర్మతో కలిసి నటించింది. అద్భుతమైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించింది కపిలాక్షి. నటి సమంతా కూడా కొంతకాలంగా ఇదే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)