Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు, కుజుడు కలయిక ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రెండు గృహాలు కూడా తెలివితేటలకు శక్తికి చిహ్నాలుగా చెప్పవచ్చు. వ్యాపార రంగానికి, కమ్యూనికేషన్ రంగానికి పాలక గ్రహాలుగా ఉంటాయి. ఈ రెండు గ్రహాలు కూడా జనవరి 31వ తేదీన కలవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
వృషభ రాశి- వృషభ రాశి వారికి కుజుడు బుధుడి కలయిక మంచి ఫలితాలను ఇస్తుంది. వీరికి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త వనరుల నుండి ఆదాయం వస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఆర్థిక లాభాలు పెరుగుతాయి. ఉద్యోగం చేసే వారికి పురోగతి ఉంటుంది. కొత్త కస్టమర్లు ఏర్పడతారు కార్యాలయాల్లో మీ సామర్థ్యానికి ప్రశంసలు అందుతాయి. కెరీర్ లో ఉన్నత శిఖరాలను చేరుకోగలుగుతారు. పై అధికారుల నుండి మద్దతు పొందుతారు. అనేక రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. మీరు చేసే ప్రతి పని కూడా అంకితభావంతో పూర్తి చేస్తారు.
Vastu Tips: మీ బెడ్ రూం నుండి ఈ 5 వస్తువులను వెంటనే తొలగించండి ...
మిథున రాశి- మిధున రాశి వారికి బుధుడు, కుజుడు కలయిక ఎంతో శుభప్రదం అవుతుంది. వీరికి ఆకస్మిక దన లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. స్టాక్ మార్కెట్ నుంచి మంచి లాభాలు వస్తాయి. పెద్ద పెద్ద ప్రాజెక్టులలో విజయాన్ని సాధిస్తారు. కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వారికి మంచి లాభాలు ఉంటాయి. కుటుంబంలో శాంతి ఆనందం ఉంటుంది. పాత వివాదాలు తొలగిపోతాయి ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు రోగాల నుండి విముక్తి పొందుతారు. విద్యార్థులు మొదటి ర్యాంకుల ఉత్తీర్ణులు అవుతారు.
సింహరాశి- సింహ రాశి వారికి ఈ రెండు గ్రహాల కలయిక మంచి శుభ ఫలితాలను అందిస్తుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏ పని నైనా సులభంగా పూర్తి చేస్తారు. మీ లక్ష్యాలను సాధించడానికి ఎంతో కృషి చేస్తారు. పెండింగ్లో ఉన్న డబ్బు తిరిగి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాల్లో పెట్టుబడులు మీకు లాభదాయకంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తారు. వ్యాపారంలో వేగవంతమైన అభివృద్ధి ఉంటుంది. మానసిక శారీరక సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.