Woman Student Dies by Suicide in Hyderabad (Photo-X)

Hyd, Jan 22: రైలు కిందపడి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సికింద్రాబాద్‌లోని జామై ఉస్మానియా రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామానికి చెందిన విద్యార్థిని భార్గవి (19) హైదరాబాద్‌లో మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడింది. సిద్దిపేట జిల్లాకు చెందిన దర్శనం చంద్రయ్య, బాలవ్వ దంపతుల రెండో కూతురు భార్గవి హైదరాబాద్‌లో గల ఆంధ్ర మహిళా సభలోని హాస్టల్‌లో ఉంటూ కాలేజీలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతుంది.

తిరుమలలో మరో రోడ్డు ప్రమాదం.. మొదటి ఘాట్ రోడ్డులో అదుపు తప్పిన కారు, నలుగురికి తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో

జామై ఉస్మానియా రైల్వే ట్రాక్‌పై మంగళవారం ఉదయం మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు అక్కడకు చేరుకొని పరిశీలించారు. పెద్దకోడూరుకు చెందిన భార్గవిగా గుర్తించారు. భార్గవి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు హుటాహుటినా హైదరాబాద్‌కు తరలివెళ్లారు.ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.