ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్డులో 7వ మైలు వద్ద అదుపు తప్పి కారు బోల్తా పడగా నలుగురు భక్తులకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అలాగే తిరుమలలోని రాంభగీచా బస్టాండ్ సమీపంలో కొందరు భక్తులు ఎగ్ బిర్యానీ భోజనం చేస్తున్న సమయంలో విజిలెన్స్ అధికారులు గుర్తించారు. తమిళనాడుకు చెందిన భక్తులు తిరుపతి నుంచి భోజనం తిరుమలకు తెచ్చుకుని తింటున్న సమయంలో కోడి గుడ్లు గుర్తించిన భక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు ప్రాంతానికి చెందిన భక్తులు 30 మంది బృందంతో శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు చేరుకున్నారు. వీడియో ఇదిగో, తిరుమలలో ఎగ్ బిర్యానీ తింటూ ప్రత్యక్షమైన తమిళనాడు భక్తులు, వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీస్ సిబ్బంది
Another road accident in Tirumala
తిరుమలలో మరో రోడ్డు ప్రమాదం
మొదటి ఘాట్ రోడ్డులో 7వ మైలు వద్ద అదుపు తప్పి కారు బోల్తా
నలుగురు భక్తులకు గాయాలు.. అశ్విని ఆసుపత్రికి తరలింపు. @APPOLICE100 pic.twitter.com/rNYj9lom8a
— Telangana Awaaz (@telanganaawaaz) January 19, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)