Hyd, Jan 22: హనుమకొండ (Hanumakonda) నగరం నడిబొడ్డులో పట్టపగలే ఆటో డ్రైవర్ హత్య కలకలం రేపుతోంది. ఆదాల జంక్షన్ సమీపంలో మణికొండకు చెందిన మాచర్ల రాజ్‌కుమార్‌ను మరో డ్రైవర్ కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. అతను దారుణ హత్యకు గురవుతుంటే చుట్టూ ఉన్న జనం మాత్రం చోద్యం చూస్తూ నిలబడ్డారు. పైగా హత్య జరిగే దృశ్యాలను తమ తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.
హైదరాబాద్ - వరంగల్ ప్రధాన హైవే వద్ద ఆదాల జంక్షన్ వద్ద ఆటోలో ఉన్న సమయంలో డ్రైవర్ రాజ్‌కుమార్‌ను ప్రత్యర్ధి ఏనుగు వెంకటేశ్వర్లు తనతో తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి (Brutal Murder in Telangana) చేశాడు. ఆటోడ్రైవర్ కడుపులో దాదాపు 15 సార్లు కత్తితో పొడిచాడు.పక్కనే ఉన్న వ్యక్తులు ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ సదరు వ్యక్తి.. ఆపకుండా పదేపదే పొడిచాడు.
దీంతో ఆటోడ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆపై నిందితుడు వెంకటేశ్వర్లు వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు.ఓ మహిళ విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదమే హత్యకు కారణంగా ప్రాథమికంగా తెలుస్తోంది.
Auto Driver Killed by another Driver
హనుమకొండ అదాలత్ వద్ద పట్టపగలే ఆటో డ్రైవర్ దారుణ హత్య.
వ్యక్తిగత కక్ష్యలతో రాజ్ కుమార్ అనే ఆటో డ్రైవర్‌ను కత్తితో పొడిచి చంపిన మరో ఆటో డ్రైవర్. అనంతరం పరారీ అయిన నిందితుడు.
హత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్న పోలీసులు. pic.twitter.com/JzrI3O7OK2
— ChotaNews App (@ChotaNewsApp) January 22, 2025
హనుమకొండ జిల్లా వ్యక్తి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
బొల్లికొండ లావణ్య అనే మహిళ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న రాజ్ కుమార్,వెంకటేశ్వర్లు
ఇదే క్రమంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి రాజ్ కుమార్ ను హత్య చేసిన వెంకటేశ్వర్లు. మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఎంజీఎం కు తరలించిన… pic.twitter.com/W17e9E1cVe
— TV5 News (@tv5newsnow) January 22, 2025
స్థానికుల సమాచారం మేరకు సుబేదారి పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించారు. నిందితుడి కోసం పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు.