సింగర్ మధుప్రియ(Madhupriya) వివాదంలో చిక్కుకున్నారు. కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయం(kaleshwaram temple)లో అపచారం జరిగింది. గర్భగుడిలో గాయని మధు ప్రియ ప్రవేట్ ఆల్బమ్ కోసం షూటింగ్ జరుగగా గుడి తలుపులు మూసి గర్భగుడిలో చిత్రీకరణ జరిపారు.

దర్శనానికి వచ్చిన భక్తులను నిలిపివేసి ఆల్బమ్ షూటింగ్ చేయడం పై ఆగ్రహం వ్యక్తమవుతోంది. షూటింగ్ దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోలేదు. వెంటనే ఆలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధుప్రియ తీరును అంతా తప్పుబడుతున్నారు.

ఇక సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కు గుండెపోటు వచ్చింది. మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి డెహ్రాడూన్ టూర్‌కు పద్మారావు గౌడ్ వెళ్లారు. అక్కడ గుండె పోటు రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు స్టంట్ వేయగా ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.  బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావుకు గుండెపోటు ..స్టంట్ వేసిన డాక్టర్లు, డెహ్రాడూన్ టూర్‌లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే 

Controversy on Singer Madhu Priya private album shoot

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)