‘Thandel’ Release Date: సముద్రపు అలల మధ్య నాగచైతన్య కౌగిలిలో బందీ అయిన సాయిపల్లవి, ఫిబ్రవరి 7న గ్రాండ్‌గా విడుదల కానున్న తండేల్ మూవీ

ప్రేమ తీరం నుండి భావోద్వేగాలతో నిండిన సముద్రానికి ప్రయాణించడానికి సిద్ధంగా ఉండండి.. అంటూ తీరపు అలల మధ్య సాయిపల్లవి, నాగచైతన్య ఎమోషనల్‌గా ఒకరికొకరు హగ్‌ చేసుకున్న స్టిల్‌ను షేర్ చేశారు. ఇప్పుడీ రిలీజ్‌ అప్‌డేట్‌ పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.

‘Thandel’ Release Date: సముద్రపు అలల మధ్య నాగచైతన్య కౌగిలిలో బందీ అయిన సాయిపల్లవి, ఫిబ్రవరి 7న గ్రాండ్‌గా విడుదల కానున్న తండేల్ మూవీ
Naga Chaitanya and Sai Pallavi’s Action Drama To Arrive in the Theatres on THIS Date – Check New Poster

2018లో గుజరాత్‌ లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా వస్తోన్న తండేల్‌ మూవీ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 7న గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రేమ తీరం నుండి భావోద్వేగాలతో నిండిన సముద్రానికి ప్రయాణించడానికి సిద్ధంగా ఉండండి.. అంటూ తీరపు అలల మధ్య సాయిపల్లవి, నాగచైతన్య ఎమోషనల్‌గా ఒకరికొకరు హగ్‌ చేసుకున్న స్టిల్‌ను షేర్ చేశారు. ఇప్పుడీ రిలీజ్‌ అప్‌డేట్‌ పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ 'దేవర' ఓటీటీలోకి.. ఎప్పటి నుంచి స్ట్రీమ్ అవ్వనుందంటే?

ఈ మూవీని గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. తండేల్‌ నాగచైతన్య-చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని ముందుగా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్‌ ప్రకటించారని తెలిసిందే. తాజాగా ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Here's Movie Release Date

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 05, 2024 08:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).