'Road Like Hema Malini's Cheeks': వీడియో ఇదిగో, ఢిల్లీ ఉత్తమ్ నగర్ రోడ్లను హేమ మాలినీ బుగ్గల్లా నున్నగా చేస్తానంటూ ఆప్ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్ వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే (AAP MLA) నరేష్ బల్యాన్ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ నగర్ (Uttam Nagar)రోడ్లను హేమ మాలినీ బుగ్గల్లా నున్నగా (Road like Hema Malinis cheeks) చేస్తానంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి.
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే (AAP MLA) నరేష్ బల్యాన్ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ నగర్ (Uttam Nagar)రోడ్లను హేమ మాలినీ బుగ్గల్లా నున్నగా (Road like Hema Malinis cheeks) చేస్తానంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి.ఆప్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు.
ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలు మహిళలను అగౌరవపరిచేలా, స్థానిక సమాజాన్ని అవమానించేలా ఉన్నాయన్నారు. ఓ మహిళను అగౌరవపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యేపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆప్ సుప్రిమో అరవింద్ కేజ్రీవాల్‌ను డిమాండ్ చేశారు.
కాగా, రాజకీయ నేతలు హేమ మాలినీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో మహారాష్ట్ర మంత్రి జల్గావ్ జిల్లాలోని తన నియోజకవర్గంలో రోడ్లను ప్రముఖ నటి హేమ మాలినీ బుగ్గలతో పోల్చారు. ఆ రోడ్లను ఎంత బాగా అభివృద్ధి చేశానో విపక్ష నేతలు వచ్చి చూడాలని సవాల్ విసిరారు.
AAP MLA Naresh Balyan's remark stirs row
"We will make roads of Uttam Nagar smooth as Hema Malini's cheeks"
AAP MLA Naresh Balyan
केजरीवाल के गाल चिकने नहीं है 🤔pic.twitter.com/S6dvEmwI8r
— Kreately.in (@KreatelyMedia) November 4, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 05, 2024 09:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

