దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్ ముగిసింది. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 6గంటలకు ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు 57.70 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం (Election Commission) వెల్లడించింది. నార్త్-ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 52.73శాతం పోలింగ్ నమోదు కాగా.. న్యూఢిల్లీలో అత్యల్పంగా 43.1శాతం పోలింగ్ రికార్డైంది.తాజాగా ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.
27 సంవత్సరాల తర్వాత బీజేపీ 51-60 సీట్లతో విజయం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. ఆప్ 20 సీట్ల కంటే తక్కువకు పడిపోవచ్చని అంచనా వేసింది. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై మ్యాట్రిజ్ సర్వే ఏం చెప్పిందంటే ఆప్, బీజేపీ మధ్య పోటీ గట్టి పోటీ ఉంటుందని తెలిపింది. ఆప్ 32 నుంచి 37 సీట్ల మధ్యలో గెలుచుకుంటుందని అలాగే బీజేపీ 35 నుంచి 40 సీట్ల మధ్యలో గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇక కాంగ్రెస్ ఖాతా కూడా తెరవదని ఈ సర్వే స్పష్టం చేసింది.
AAP, BJP in Neck-And-Neck Fight, Says Matrize Survey
#ExitPoll | Matrize predicts neck-and-neck contest in #Delhi
A look at seat projections 👇
*health warning: #exitpolls often get it wrong
Track updates here 🔗 https://t.co/eDmm1XjkRy#ElectionsWithTOI #ResultsWithTOI #DelhiElections #DelhiElection2025 pic.twitter.com/krpQ9BeGk6
— The Times Of India (@timesofindia) February 5, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)