తిరుమలలో విషాద ఘటన చోటు చేసుకుంది. అలిపిరి నడకమార్గంలో చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసింది. అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్తుండగా.. శుక్రవారం రాత్రి ఆరేళ్ల చిన్నారి తప్పిపోయింది. ఈ క్రమంలో పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. గాలింపు చర్యలు చేపట్టారు. అయితే శనివారం ఉదయం నరసింహ స్వామి ఆలయం వద్ద చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చిన్నారి ఒంటిపై తీవ్ర గాయాలు కూడా ఉన్నాయి. కాగా నెల కిత్రం ఐదేళ్ల చిన్నారిపై పులి దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అదే ప్రాంతంలోనే రక్షితపై చిరుత దాడి చేయడం గమనార్హం. ఈ ఘటన తిరుమలలో కలకలం రేపుతోంది.

Leopard killed six year-old girl in Tirumala

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)