క్రీడలు

Snake Found on Field: ఇండియా- సౌతాఫ్రికా మ్యాచ్‌లో పాము కలకలం, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తుండగా ఫీల్డ్‌లోకి పాము, పరుగులు పెట్టిన సౌతాఫ్రికా ఫీల్డర్లు, కాసేపు నిలిచిన మ్యాచ్‌

Naresh. VNS

భారత్- సౌతాఫ్రికా ( India vs South Africa ) మధ్య జరుగుతున్న రెండో టీ-20 (2nd T20I) మ్యాచ్‌లో పాము కలకలం సృష్టించింది. గౌహతి (Guwahati) వేదికగా రెండో టీ-20 మ్యాచ్‌ జరుగుతుండగా స్టేడియం ఔట్ ఫీల్డ్ లో పాము కనిపించింది. టీమిండియా బ్యాటింగ్ చేస్తుండగా పాము (Snake in Stadium) స్టేడియంలోకి వచ్చింది.

Telangana Shooter: నేష‌న‌ల్ గేమ్ప్ లో ప‌సిడితో మెరిసిన తెలంగాణ షూట‌ర్ ఈషా సింగ్.. 25 మీట‌ర్ల స్పోర్ట్స్ పిస్ట‌ల్‌లో ప‌సిడి ప‌త‌కం కైవ‌సం.. తెలంగాణ ఖాతాలో చేరిన తొలి ప‌త‌కం

Jai K

జాతీయ క్రీడ‌ల్లో తెలుగు క్రీడాకారులు శుభారంభాన్ని అందించారు. ఇప్ప‌టికే మహిళల 100 మీటర్ల ప‌రుగులో ఏపీకి చెందిన జ్యోతి యర్రాజి స్వ‌ర్ణ ప‌త‌కం సాధించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా తెలంగాణ‌కు చెందిన మహిళా షూట‌ర్ ఈషా సింగ్ స‌త్తా చాటింది. 25 మీట‌ర్ల స్పోర్ట్స్ పిస్ట‌ల్ ఈవెంట్‌లో స్వ‌ర్ణ ప‌త‌కాన్ని సాధించిన ఈషా సింగ్ తెలంగాణ ఖాతాలో తొలి ప‌త‌కాన్ని చేర్చింది.

Indonesia Horror: ఇండోనేషియాలో ఘోరం.. ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో తొక్కిసలాట.. 127 మంది మృతి.. ఓడిపోయిన జట్టు అభిమానులు ఒక్కసారిగా మైదానంలోకి దూసుకురావడంతో ఈ ఘటన

Jai K

ఇండోనేషియాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తూర్పు జావా ప్రావిన్సులోని ఫుట్‌బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 127 మంది ప్రాణాలు కోల్పోయారు. 180 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Jasprit Bumrah: వెన్ను నొప్పితో బుమ్రా.. భారత పేస్ దళపతి స్థానాన్ని భర్తీ చేయనున్న సిరాజ్

Jai K

సౌతాఫ్రికాతో తొలి టీ20కి ముందు ప్రాక్టీస్‌ సందర్భంగా నడుం నొప్పి వచ్చిందని ఫిర్యాదు చేయడంతో బుమ్రాని మ్యాచ్‌ నుంచి తప్పించారు. తర్వాత సిరీస్ నుంచి కూడా తప్పించారు. బుమ్రా స్థానంలో సిరాజ్ ను ఎంపిక చేశారు.

Advertisement

Virat Kohli: అనుష్కతో కోహ్లీ వీడియో కాల్.. మధ్యలో ఫ్యాన్స్.. తర్వాత విరాటుడు ఏం చేశాడంటే?

Jai K

అనుష్కతో కోహ్లీ వీడియో కాల్.. ఇంతలో ఫ్యాన్స్ గోల.. ఆ ఫోన్ ను ఇటువైపు తిప్పి సందడి చేసిన కోహ్లీ..

Amit Mishra Pays Money to Fan: గర్ల్‌ ఫ్రెండ్‌తో డేట్ కోసం ఫ్యాన్‌కు డబ్బులు పంపిన క్రికెటర్, ట్విట్టర్‌లో డబ్బులు అడిగితే గూగుల్ పే చేసిన టీమిండియా లెగ్ స్పిన్నర్, రూ.300 అడిగతే రూ. 500 పంపి ఆల్‌ ది బెస్ట్ చెప్పిన మిశ్రా, అతను చేసిన పనికి నెటిజన్ల నుంచి వింత రియాక్షన్లు

Naresh. VNS

ఈ ట్వీట్‭తో సంబంధం లేకుండా తన ప్రేయసిని డేట్‭కు తీసుకెళ్తున్నానని, 300 రూపాయలు ఇవ్వాలని కోరాడు. అంతే.. వెంటనే అతడి గూగుల్ పేకి (Google pay) 500 రూపాయలు పంపించాడు మిశ్రా. అనంతరం అది స్క్రీన్‭షాట్ తీసి ట్విట్టర్‭లో షేర్ చేశాడు. ‘‘అయిపోయింది, మీ డేట్‭కి ఆల్ ది బెస్ట్’’ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Virat Kohli: రోజర్‌ ఫెదరర్‌‌పై ఉద్వేగపూరిత వీడియో, నీలాంటి గొప్ప అథ్లెట్‌ను నేనింతవరకు చూడలేదు అంటూ ఎమోషనల్ అయిన టీమిండియా మాజీ కెప్టెన్

Hazarath Reddy

కోహ్లి.. ఫెదరర్‌ను ఉద్దేశించి మాట్లాడిన వీడియోను ఏటీపీ టూర్‌ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది.ఇందులో.. ‘‘హల్లో రోజర్‌.. మాకు ఎన్నెన్నో మధురానుభూతులు, జ్ఞాపకాలు మిగిల్చిన నీకు ఇలా వీడియో ద్వారా విషెస్‌ చెప్పడం నిజంగా నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. నాకు తెలిసి ఒకే ఒక్కసారి నిన్ను నేను నేరుగా కలిశాను.

Suresh Raina Catch Video: సూపర్ వీడియో, ఆస్ట్రేలియా బ్యాటర్‌కి షాకిస్తూ దిమ్మదిరిగే క్యాచ్ పట్టిన సురేష్ రైనా, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

టీమిండియా మాజీ ఆటగాడు సురేష్‌ రైనా సంచలన క్యాచ్‌తో రైనా మరోసారి మెరిశాడు. రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్‌ తరపున ఆడుతున్న రైనా సెమీఫైనల్‌-1లో భాగంగా ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో మ్యాచ్‌లో ఓ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.

Advertisement

Virat Kohli: వైరల్ వీడియో, అనుష్కతో వీడియో కాల్‌లో ఉన్నా, నన్ను డిస్ట్రబ్ చేయకండి, అభిమానులకు వీడియో కాల్‌ చూపించిన కోహ్లీ, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌

Hazarath Reddy

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టి20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ఈ మ్యాచ్‌ విజయం అనంతరం రాత్రి తిరువనంతపురం నుంచి ఎయిర్‌పోర్ట్‌ వరకు టీమిండియా బృందం బస్సులో బయలుదేరింది. కోహ్లిని చూడగానే అభిమానుల్లో మరింత జోష్‌ వచ్చింది.

ICC T20 World Cup 2022: టీమిండియాకు భారీ షాక్, టి20 ప్రపంచకప్‌ నుంచి స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అవుట్, మళ్లి తిరగబెట్టిన గాయం

Hazarath Reddy

టి20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు బిగ్‌షాక్‌ తగిలింది. టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వెన్నునొప్పి గాయంతో టి20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడని బీసీసీ వర్గాలు నుంచి వచ్చిన సమాచారం.

Sunil Chhetri: సునీల్ ఛెత్రీకి ఫిఫా తరపున అరుదైన గౌరవం, రొనాల్డో, మెస్సీ వంటి దిగ్గజాల సరసన నిలిచిన భారత ఫుట్ బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రి

kanha

భారత గ్రేట్ ఫుట్‌బాల్ ప్లేయర్, కెప్టెన్ సునీల్ ఛెత్రీకి ఫిఫా నుంచి పెద్ద గౌరవం లభించింది. ఫుట్‌బాల్ , అతిపెద్ద గవర్నింగ్ బాడీ FIFA ఛెత్రీ , అద్భుతమైన కెరీర్‌పై ప్రత్యేక డాక్యుమెంటరీని రూపొందించింది.

India vs South Africa 1st T20: తొలి టీ 20 మ్యాచ్ లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా, 1-0 ఆధిక్యంతో సిరీస్ శుభారంభం..

kanha

టీమిండియా బౌలర్ల అద్భుతమైన బౌలింగ్ తర్వాత, KL రాహుల్ , సూర్యకుమార్ యాదవ్ , బ్రిలియంట్ ఇన్నింగ్స్ కారణంగా, భారత క్రికెట్ జట్టు మొదటి T20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా (IND v SA)ని 8 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

Advertisement

HCA: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌పై మరో కేసు, టికెట్లపై తప్పుడు సమయం ముద్రించారని ఫిర్యాదు చేసిన యువకుడు, కేసు నమోదు చేసిన బేగంపేట పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌పై ఇప్పటికే మూడు కేసులు నమోదు కాగా తాజాగా మరో కేసు నమోదయింది. గత ఆదివారం భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్‌ స్టేడియంలో టీ 20 మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లపై తప్పుడు సమయం ముద్రించారని ఓ యువకుడు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Hyderabad Traffic Rules: ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ హైదరాబాద్ పోలీసులు ఏం చేశారో తెలుసా, టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, దినేష్‌ కార్తీక్‌ ఫోటోలనే వాడేశారు

Hazarath Reddy

హైదరాబాద్‌ పోలీసులు ట్విట్టర్లో ఫన్నీ ఇమేజెస్ ట్వారా ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కల్పిస్తున్న సంగతి విదితమే. పాపులర్‌ సినిమా డైలాగులు, పాటలు, పోస్టర్లు ఉపయోగించి.. సృజనాత్మకంగా జనాలకు చెబుతూ వారిని చైతన్యవంతం చేస్తుంటారు.

Indian Cricketers Josh: భారత క్రికెటర్లకు రామ్ చరణ్ విందు పార్టీ.. ఇంట్లో సందడే సందడి..

Jai K

రామ్ చరణ్ ఇంట భారత క్రికెటర్లు దర్శనమిస్తే..? సరిగ్గా ఇదే జరిగింది. ఆస్ట్రేలియా మ్యాచ్ లో భారత్ విజయం తర్వాత.. మన క్రికెటర్లు రామ్ చరణ్ ఇంట్లో సందడి చేశారు.. అవును..

IND vs AUS 3rd T20I : ఆసిస్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ, రఫ్పాడించిన సూర్యకుమార్ యాదవ్- విరాట్ కోహ్లీ, బౌండరీతో విన్నింగ్ షాట్ కొట్టి పాండ్యా, 2-1తో సిరీస్ భారత్ కైవసం

Naresh. VNS

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో (IND vs AUS 3rd T20I ) ఆస్ట్రేలియాపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ (INDIA WIN) కొట్టింది. చివరి బంతి వరకు ఉత్కంఠ సాగిన ఈ మ్యాచ్ లో రోహిత్ సేన అద్భుత విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో ఆసీస్ ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో సిరీస్ ను (Series Win) కూడా కైవసం చేసుకుంది.

Advertisement

చారిత్రక విజయంతో జులన్‌కు వీడ్కోలు.. ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్ క్లీన్ స్వీప్.. కెరియర్‌లో చివరి మ్యాచ్ ఆడిన జులన్ గోస్వామి

Jai K

చారిత్రక విజయంతో జులన్‌కు వీడ్కోలు.. ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్ క్లీన్ స్వీప్.. కెరియర్‌లో చివరి మ్యాచ్ ఆడిన జులన్ గోస్వామి.. 169 పరుగుల స్వల్ప స్కోరును అద్భుతంగా కాపాడుకున్న భారత్.. బంతులతో నిప్పులు చెరిగిన భారత బౌలర్లు

Watch Video: రోజర్ ఫెదరర్‌ చివరి మ్యాచ్‌లో ఉద్రిక్తత, లావర్ కప్‌ టెన్నిస్ కోర్టులోనే నిప్పంటించుకున్న వ్యక్తి, ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రేక్షకులు, టెన్నిస్ నెట్‌కు నిప్పంటించే ప్రయత్నం, ఎందుకు ఇలా చేశాడో తెలుసా? వైరల్‌ అవుతున్న వీడియో ఇందుగోండి!

Naresh. VNS

టెన్నిస్ నెట్‌కు (Tennis court) సమీపంలో కోర్టులోకి దూసుకెళ్లి కూర్చోవటం చూడొచ్చు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అతని చేతికి అంటుకున్న మంటలను ఆర్పేసి సదరు వ్యక్తికి కోర్టు బయటకు తీసుకెళ్లారు. లండన్‌లోని O2 అరీనాలో స్టెఫానోస్ సిట్సిపాస్, డియెగో స్క్వార్ట్జ్‌మాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

India vs Australia, 2nd T20I: రెండో టీ-20లో దుమ్మురేపిన టీమిండియా, రోహిత్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌ తో భారత్‌కు విక్టరీ, నాలుగు బాల్స్ ఉండగానే ఇండియా గెలుపు, ఆసిస్‌తో సిరీస్‌ సమం

Naresh. VNS

లక్ష్యఛేదనను టీమిండియా దాటిగా ఆరంభించింది. తొలి ఓవర్లోనే 20 పరుగులు సాధించి తన ఉద్దేశాన్ని చాటింది. కేఎల్ రాహుల్ 10, కోహ్లీ 11, పాండ్యా 9 పరుగులు చేశారు. ఆఖర్లో భారత్ విజయానికి 6 బంతుల్లో 9 పరుగులు అవసరం కాగా, తొలి బంతిని సిక్స్, రెండో బంతిని ఫోర్ కొట్టిన దినేశ్ కార్తీక్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే భారత్ ను విజయతీరాలకు చేర్చాడు.

T20 Tickets: హైదరాబాదీ క్రికెట్ ఫ్యాన్స్ అలర్ట్.. ఆస్ట్రేలియా, భారత్ మూడో టీ20 మ్యాచ్ టికెట్లన్నీ అమ్ముడయ్యాయి.. ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు మాత్రమే జింఖానా మైదానంకు వచ్చి ఫిజికల్ టికెట్లు తీసుకోవాలి.. హెచ్ సీఏ కీలక ప్రకటన

Jai K

ఆస్ట్రేలియా, భారత్ మూడో టీ20 మ్యాచ్ కి సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడయ్యాయని హైదరాబాద్ క్రికెట్ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ఇదివరకు ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు మాత్రమే జింఖానా మైదానంకు వచ్చి ఫిజికల్ టికెట్లు తీసుకోవాలని తెలిపింది.

Advertisement
Advertisement