క్రీడలు

India Vs Sri Lanka ODI Series: భార‌త్-శ్రీ‌లంక వ‌న్డే సిరీస్ ను ఇలా ఉచితంగా చూసేయండి! జియో సినిమాలో కాదు..ఇక్క‌డ ఉచితంగా స్ట్రీమింగ్, ఇంత‌కీ సిరీస్ ఎప్ప‌టి నుంచి అంటే?

VNS

శ్రీలంక‌తో జ‌రిగిన మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను టీమ్ఇండియా (Team India) క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పుడు అంద‌రి దృష్టి ఆగ‌స్టు 2 నుంచి ప్రారంభం కానున్న వ‌న్డే సిరీస్ పై ప‌డింది. టీ20 సిరీస్ ఇచ్చిన ఉత్సాహంతో టీమ్ఇండియా వ‌న్డే సిరీస్‌కు (IND Vs SL ODI sreies) సిద్ధం అవుతోంది.

Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో పీవీ సింధు జైత్రయాత్ర, ప్రీ క్వార్టర్స్‌ లోకి దూసుకెళ్లిన సింధు

Arun Charagonda

పారిస్ ఒలింపిక్స్ 2024లో పీవీ సింధు జైత్ర యాత్ర కొనసాగుతోంది. తాజాగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో క్రిస్టిన్ కూబా వరల్డ్ ర్యాంక్ 73ను ఓడించింది సింధు. కూబాబపై 21-5, 21-10 స్కోరుతో రెండ‌వ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో విజ‌యం సాధించింది. ఈ విజయంతో ప్రీ క్వార్ట‌ర్స్‌లో ప్రవేశించగా ఈ మ్యాచ్‌లో ఆర‌వ సీడ్ హీ బిన్‌జావో తో త‌ల‌ప‌డ‌నుంది సింధు.

Rinku Singh Bowling: రింకూ సింగ్ గేమ్ ఛేంజర్, వీడియో ఇదిగో..అద్భుత బౌలింగ్‌,వావ్ అనకుండా ఉండలేరు!

Arun Charagonda

శ్రీలంకతో జరిగిన మూడు టీ 20ల సిరీస్‌ను కైవసం చేసుకుంది టీమిండియా. ఇక ఈ మ్యాచ్‌లో శ్రీలంక 12 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా అనూహ్యంగా మ్యాచ్ టైగా ముగిసింది. 19వ ఓవర్‌లో ఎవరూ ఉహించని విధంగా బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్‌కు బాల్ అప్పగించాడు కెప్టెన్ సూర్య.

Suryakumar Yadav Bowling: వీడియో ఇదిగో, సూర్యకుమార్ యాదవ్ సూపర్బ్ బౌలింగ్, ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు, మ్యాచ్ టై

Arun Charagonda

భారత్ - శ్రీలంక మధ్య జరిగిన మూడో టీ20లో అద్భుతం చేశాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. చివరి ఓవర్‌లో శ్రీలంక 6 పరుగులు చేస్తే విజయం సాధిస్తుందన్న తరుణంలో బౌలింగ్‌కు దిగాడు సూర్య. ఈ ఓవర్‌లో 5 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ టైగా ముగియడంలో కీ రోల్ పోషించాడు.

Advertisement

IND vs SL: సూపర్ ఓవర్‌లో సూర్య సేన గెలుపు, కెప్టెన్‌గా తొలి సిరీసే క్లీన్ స్వీప్, బంతితో మ్యాజిక్ చేసిన రింకూ,సూర్య

Arun Charagonda

శ్రీలంకతో జరిగిన టీ 20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. కోచ్‌గా గంభీర్‌కు, కెప్టెన్‌గా సూర్యకుమార్‌కు ఇది తొలి సిరీస్ కాగా అదరగొట్టింది టీమిండియా. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరి టీ20 సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించింది టీమిండియా.

Paris Olympic Games 2024: బాక్సింగ్‌లో భార‌త్‌కు భారీ షాక్, 51 కిలోల విభాగంలో ఓటమితో ఇంటిదారి ప‌ట్టిన అంతిమ్ పంగ‌ల్, మ‌హిళా బాక్స‌ర్ల పైనే భార‌త్ ప‌త‌కం ఆశ‌లు

Vikas M

ఒలింపిక్స్‌లో ప‌త‌కం ఖాయ‌మ‌నుకున్న బాక్సింగ్‌లో భార‌త్‌కు భారీ షాక్ తగిలింది. కామన్‌వెల్త్ గేమ్స్‌లో ప‌సిడి ప‌త‌కంతో మెరిసిన అంతిమ్ పంగ‌ల్(Antim Panghal) పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో మాత్రం నిరాశ‌ప‌రిచాడు. 51 కిలోల విభాగంలో ఈ స్టార్ బాక్స‌ర్ 16వ రౌండ్‌లోనే ఇంటిదారి ప‌ట్టాడు.

Sri Lanka's Squad For ODI Series: భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌కు శ్రీలంక జట్టు ప్రకటన, ఆ స్టార్ ఆటగాళ్లకు నో ఛాన్స్

Vikas M

భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. ఈ జట్టుకు ఆల్‌రౌండర్ చరిత్ అసలంక కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కుసాల్ మెండిస్‌ను తప్పించి వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతలను అసలంకకు లంక క్రికెట్ అప్పగించింది.

Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌, మిక్స్‌డ్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్తల్‌ విభాగంలో భారత్‌కు మరో పతకం, కాంస్యం సాధించిన సరబ్‌జోత్‌ సింగ్‌, మను బాకర్‌ జోడీ

Hazarath Reddy

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. మిక్స్‌డ్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్తల్‌ విభాగంలో సరబ్‌జోత్‌ సింగ్‌, మను బాకర్‌ జోడీ దక్షిణ కొరియాతో పోటీపడి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మనుబాకర్‌ జోడి 16 పాయింట్లు సాధించగా.. దక్షిణ కొరియా ఆటగాళ్లు 10 పాయింట్లు సాధించారు. ఒకే ఒలింపిక్స్‌ సీజన్‌లో రెండు పతకాలతో మనుబాకర్‌ రికార్డు సొంతం చేసుకున్నారు.

Advertisement

Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం, మిక్స్‌డ్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్తల్‌ విభాగంలో కాంస్యం, అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

Hazarath Reddy

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. మిక్స్‌డ్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్తల్‌ విభాగంలో సరబ్‌జోత్‌ సింగ్‌, మను బాకర్‌ జోడీ దక్షిణ కొరియాతో పోటీపడి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మనుబాకర్‌ జోడి 16 పాయింట్లు సాధించగా.. దక్షిణ కొరియా ఆటగాళ్లు 10 పాయింట్లు సాధించారు.

IND Win By Seven Wickets: సిరీస్ కైవసం చేసుకున్న భారత్, రెండో టీ 20లో 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించిన టీమిండియా

Vikas M

శ్రీలంక పర్యటనలో టీమిండియా మరో మ్యాచ్‌ మిగిలుండగానే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఆదివారం పల్లెకెలె వేదికగా వర్షం అంతరాయం కలిగించిన రెండో టీ20ని టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో గెలుచుకుంది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన లంకేయులు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేశారు.

2025 Men's Asia Cup: 34 ఏళ్ల తర్వాత ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్ , T20 ఫార్మాట్‌లోనే మ్యాచ్‌లు, 1990లో విజేతగా నిలిచిన భారత్, తర్వాత ఇదే టోర్నీ

Vikas M

2025 పురుషుల ఆసియా కప్‌కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది, ఇది T20 ఫార్మాట్‌లో ఆడబడుతుంది, అయితే బంగ్లాదేశ్ 2027 ఎడిషన్ టోర్నమెంట్‌ను 50 ఓవర్ల వెర్షన్‌లో నిర్వహిస్తుంది. 2023 పురుషుల ఆసియా కప్‌ను పాకిస్తాన్, శ్రీలంక హైబ్రిడ్ ఫార్మాట్‌లో నిర్వహించాయి. 50 ఓవర్ల టోర్నమెంట్‌గా ఆడబడ్డాయి, భారత్ విజేతలుగా నిలిచింది.

Rohan Bopanna Retirement: టెన్నిస్ రంగంలో భారత్‌కు షాక్, రిటైర్మెంట్ ప్రకటించిన రోహన్ బోపన్న, పారిస్ ఒలింపిక్స్ 2024 ఫ్లాప్ షో తర్వాత కీలక నిర్ణయం

Vikas M

పారిస్ ఒలింపిక్స్ 2024 పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో ఫ్రెంచ్ ద్వయం ఎడ్వర్డ్ రోజర్-వాసెలిన్ మరియు గేల్ మోన్‌ఫిల్స్‌పై ఘోర పరాజయం పాలైన తర్వాత రోహన్ బొప్పన భారతదేశం కోసం తన చివరి మ్యాచ్‌ను ఆడినట్లు ధృవీకరించారు. ఒలింపిక్ పతకం భారత్‌కు దూరమైంది.

Advertisement

Love Proposal at Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ లో అంతా చూస్తుండానే తోటి అథ్లెట్ కు ల‌వ్ ప్ర‌పోజ్ చేసిన మ‌రో అథ్లెట్, వైర‌ల్ గా మారిన ల‌వ్ స్టోరీ

VNS

పారిస్ ఒలింపిక్స్ (Aris Olympics) ఓ ప్రేమజంటకు వేదికగా మారింది. ఇద్దరు అర్జెంటీనా అథ్లెట్ల లవ్ ప్రపోజల్‌తో ఈ మెగా టోర్నీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ జంటకు సంబంధించిన ఫొటోను ఒలంపిక్ గేమ్స్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ షేర్ చేయడంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియా యూజర్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణి,తొలి మహిళగా చరిత్ర సృష్టించిన భాకర్, కాంస్యంతో పతకాల పట్టిక ప్రారంభం

Arun Charagonda

పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత్ బోణి కొట్టింది.మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‍లో షూటర్ మనూ భాకర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో షూటింగ్‍ వ్యక్తిగత విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళగా భాకర్ చరిత్ర సృష్టించింది

Asia cup 2024: ఆసియా కప్ విజేతగా శ్రీలంక మహిళ జట్టు, తొలిసారి ఆసియా కప్‌ను సొంతం చేసుకున్న శ్రీలంక

Arun Charagonda

ఆసియా కప్ విజేతగా నిలిచింది శ్రీలంక మహిళ క్రికెట్ జట్టు. ఫైనల్లో టీమిండియా మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని 8 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. 18.4 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కొల్పోయి టార్గెట్‌ను చేధించింది శ్రీలంక.

Paris Olympics 2024: ఇవాళ భారత్ పతకాల వేట ప్రారంభించేనా? భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే, పీవీ సింధు తొలి మ్యాచ్‌కు సిద్ధం

Arun Charagonda

పారిస్ వేదికగా ఒలింపిక్స్ 2024 ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఎన్నో ఆశలతో పారిస్‌కు చేరుకున్న భారత అథ్లెట్లు తొలి రోజు పలు విభాగాల్లో ఆడిన నిరాశ పర్చారు. బాక్సర్ మను బాకర్ మాత్రం చక్కటి ప్రదర్శన కనబ్చి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

Advertisement

Paris Olympics 2024: హాకీలో భారత్ బోణీ.. తొలి పోరులో 3-2తో న్యూజిలాండ్‌ పై టీమిండియా విజయం

Rudra

పారిస్‌ ఒలింపిక్స్‌ హాకీలో భారత్‌ అదిరిపోయే ఆరంభం చేసింది. తొలి పోరులో టీమిండియా 3-2తో న్యూజిలాండ్‌ పై విజయం సాధించింది.

India vs Sri Lanka, 1st T20: టీమిండియా-శ్రీలంక తొలి టీ20 మ్యాచ్... 43 పరుగుల తేడాతో శ్రీలంకపై టీమిండియా అద్భుత విజయం

Rudra

శ్రీలంకతో టీ20 సిరీస్ లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా గెలుపుతో బోణీ కొట్టింది. పల్లెకెలెలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా 43 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకను ఓడించింది.

Paris Olympics 2024 Opening Ceremony: అట్టహాసంగా ఒలింపిక్స్‌ ప్రారంభం.. ప్రత్యేక ఆకర్షణగా భారత్.. ఫ్లాగ్ బేరర్స్‌ గా కనువిందు చేసిన టేబుల్ టెన్నిస్ స్టార్ శరత్ కమల్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు

Rudra

విశ్వక్రీడలకు తెరలేచింది. అద్భుత క్షణం ఆవిష్కృతమైంది. గతానికి భిన్నంగా, చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో చారిత్రక సీన్‌ నది ఒడ్డును తమ దేశ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ ఫ్రాన్స్‌ ప్రారంభ వేడుకలను అదిరిపోయే రీతిలో రూపకల్పన చేసింది.

Paris 2024 Olympics: ఒలింపిక్స్ అథ్లెట్ల కోసం 2 లక్షల ఉచిత కండోమ్‌లు, యాంటీ సెక్స్ బెడ్స్ ఏర్పాటు చేసినా శృంగారం కోసం తపిస్తున్న ఆటగాళ్లు

Hazarath Reddy

పారిస్ 2024 ఒలింపిక్స్‌కు ముందు అథ్లెట్లు "సరదా" సమయాన్ని గడపకుండా "యాంటీ సెక్స్" బెడ్‌లు ఉన్నా శృంగారంలో మునిగిపోయారని తెలుస్తోంది. శృంగారం కట్టడి కోసం అథ్లెట్ల గదుల్లో తక్కువ సామర్ధ్యమున్న బెడ్‌లు అంటే.. ‘యాంటీ సెక్స్‌ బెడ్స్‌’ ఏర్పాటు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement