రాష్ట్రీయం

KTR: కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తారని ప్రచారం?, భారీగా కేటీఆర్‌ ఇంటికి బీఆర్ఎస్ నేతలు, ఎవనిదిరా కుట్ర..ఏంది ఆ కుట్ర? అని మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,నిజానికి ఉన్న దమ్మేంటో చూద్దామని సవాల్

Arun Charagonda

తెలంగాణలోని వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో అధికారులపై జరిగిన దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా పట్నం నరేందర్ రెడ్డి పేరును చేర్చగా మరో 20 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలతోనే లగచర్లలో కుట్రకు వ్యూహరచన చేసినట్లు పేర్కొనడంతో ఆయన్ని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

Hyderabad: డ్రంక్‌ అండ్ డ్రైవ్‌లో బుక్ అయిన ట్రాఫిక్ ఏసీపీ, పోలీసులతో వాగ్వాదం...అదుపులోకి తీసుకున్న పోలీసులు, వీడియో ఇదిగో

Arun Charagonda

తాగి చిందులేసి పట్టుబడ్డారు ట్రాఫిక్ ఏసీపీ. హైదరాబాద్ మధురానగర్లో నిన్న రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డారు సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ కు సహకరించకుండా పోలీసులను అడ్డుకున్నారు ఏసీపీ. అంతేగాదు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఏసీపీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Maharashtra: ముంబైలో సీఎం రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం, ఆదిత్య ఠాక్రేతో కలిసి ఎన్నికల ప్రచారం, బాలాజీ ఆలయంలో పూజలు చేసిన రేవంత్ రెడ్డి

Arun Charagonda

మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయిన‌ర్‌గా ప్రచారం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వ‌ర్లి నియోజకవర్గంలో మాజీ సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే కుమారుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే విజ‌యాన్ని కాంక్షిస్తూ బుధవారం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోకు ముందు వ‌ర్లిలోని తిరుప‌తి బాలాజీ ఆల‌యంలో పూజ‌లు చేశారు రేవంత్ . ముంబై ప్రజల నుంచి రేవంత్‌కు ఘ‌న స్వాగ‌తం లభించింది.

Patnam Narender Reddy: కలెక్టర్ పై దాడి కేసులో A1గా పట్నం నరేందర్ రెడ్డి, కస్టడీపై పిటిషన్‌పై ఇవాళ కోర్టులో వాదనలు, కలెక్టర్‌పై దాడి బయటివారి పనేనని పోలీసుల వెల్లడి

Arun Charagonda

కలెక్టర్ పై దాడి కేసులో A1గా పట్నం నరేందర్ రెడ్డి అని తెలిపారు ఐజీ సత్యనారాయణ. మీడియాతో మాట్లాడిన ఐజీ..దాడి ఘటనలో నరేందర్ రెడ్డి పాత్ర చాలా కీలకం అన్నారు. నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశాం అని..ఇవాళ వాదనలు జరుగుతాయన్నారు. ఐడెంటిఫై చేసిన 42 మందిలో 19 మందికి భూమి లేదు అని తెలిపారు.

Advertisement

Hyderabad Car Accident: హైదరాబాద్‌లో కారు బీభత్సం, అర్థరాత్రి రెడ్ హిల్స్ రోడ్డు వద్ద పలువురిపై దూసుకెళ్లిన కారు..పోలీసుల రంగ ప్రవేశం

Arun Charagonda

హైదరాబాద్‌లో బుధవారం అర్థరాత్రి కారు బీభత్సం సృష్టించింది. రెడ్ హిల్స్ రోడ్ వద్ద బీభత్సం సృష్టించింది షిఫ్ట్ కార్ . నీలాఫర్ కేఫ్ సమీపంలో ఉన్న వ్యక్తులపై దూసుకెళ్లగా పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. రాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

Revanth Reddy Vs KTR: తెలంగాణ రాజకీయాలు హస్తినకు...ఫార్ములా ఈ రేసు కేసులో ఢిల్లీ పెద్దల అనుమతి లభించేనా?, గవర్నర్ ఢిల్లీ టూర్ వెనుక మర్మం ఇదేనా?

Arun Charagonda

తెలంగాణ రాజకీయాలు హస్తినకు చేరాయి. ఓ వైపు కేటీఆర్ మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి, ఆ తర్వాత గవర్నర్ వరుసగా ఢిల్లీకి చక్కర్లు కొడుతుండటంతో వాట్ నెక్ట్స్ అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ ఉంటుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కీలక నేతలు, గవర్నర్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది.

Patnam Narender Reddy Remand Report: కలెక్ట‌ర్ పై దాడి ఘ‌ట‌న వెనుక కేటీఆర్ హ‌స్తం! ప‌ట్నం న‌రేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీల‌క విష‌యాలు

VNS

దాడి ఘటన వెనుక బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) ఉన్నారని పట్నం నరేందర్‌రెడ్డి చెప్పినట్లు రిమాండ్‌ రిపోర్ట్‌లో (remand report) పోలీసులు వెల్లడించారు. దాడికి పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారించాం. నిందితుడు విశాల్‌ తోపాటు గ్రామంలో కొంతమంది సాక్షుల విచారణలో కలెక్టర్‌పై దాడిలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ప్రధాన కుట్రదారుడని తేలింది.

YS Jagan on Sharmila: చెల్లి షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు, 1.7 శాతం ఓట్ షేర్ మాత్రమే ఉన్న వారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదంటూ..

Hazarath Reddy

అసెంబ్లీకి వెళ్లనప్పుడు రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేసింది కదా అని అడిగిన మీడియా ప్రతినిధికి జగన్ సమాధానమిస్తూ.. చెల్లి షర్మిల గురించి, 1.7 శాతం ఓట్ షేర్ మాత్రమే ఉన్న కాంగ్రెస్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్నారు.

Advertisement

Andhra Pradesh: రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకుంటానంటూ యువ‌కుడి సెల్ఫీ వీడియోపై స్పందించిన న‌ర‌స‌రావుపేట డీఎస్పీ, ఏమన్నారంటే..

Hazarath Reddy

సెల్పీ వీడియోపై న‌ర‌సరావుపేట డీఎస్పీ కె.నాగేశ్వ‌ర‌రావు స్పందించారు. మదార్ వలీ పోలీసులపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. అత‌ణ్ణి నరసరావుపేట రూరల్ సీఐ పసుపులేటి రామకృష్ణ, కానిస్టేబుల్ బాబు న‌గ‌దు అడ‌గ‌లేదు. త‌ప్పు త‌న‌దేన‌ని, భ‌య‌ప‌డి అలా చెప్పాన‌ని మదార్ వలీ విచార‌ణ‌లో ఒప్పుకున్నాడు.

AP Assembly Session: అసెంబ్లీలో నన్ను డిస్‌క్వాలిఫై చేసే దమ్ముందా, స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు సవాల్ విసిరిన వైసీపీ అధినేత వైఎస్ జగన్

Hazarath Reddy

జగన్ అసెంబ్లీకి హాజరుకాకపోతే అనర్హత వేటు పడే అవకాశం ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపిన నేపథ్యంలో జగన్ స్పందించారు. ‘‘అసెంబ్లీలో నన్ను డిస్‌క్వాలిఫై చేసే దమ్ముందా? నేను రెడీ.. రమ్మను’’ అంటూ సవాల్ విసిరారు. కాగా తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే తాము అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని జగన్ చెప్పారు

Animal Cruelty in Hyderabad: హైదరాబాద్‌లో దారుణం, మూడు కుక్కలను విచక్షణారహితంగా కొట్టి చంపిన ముగ్గురు వ్యక్తులు, కడుపుతో ఉన్న ఓ కుక్క సహ మరో మూడు కుక్కలు మృతి, వీడియో ఇదిగో...

Hazarath Reddy

హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జవహర్‌నగర్‌లో 3 కుక్కలను విచక్షణారహితంగా ముగ్గురు వ్యక్తులు కొట్టి చంపారు. ముగ్గురు వ్యక్తులు పెద్ద కర్రలతో నాలుగు శునకాలను బంధించి విచక్షణారహితంగా కొట్టారు. దీంతో కడుపుతో ఉన్న ఓ కుక్క సహ మరో మూడు కుక్కలు మృతి చెందాయి.

YS Jagan Slams CM Chandrababu: వీడియో ఇదిగో, చంద్రబాబు నటన ముందు NTR నటన నథింగ్, సూపర్ సిక్స్ అడుగుతారని ఇన్ని రోజులు బడ్జెట్ సాగదీశారని మండిపాటు

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద వైఎస్ జగన్ విమర్శలు కురిపించారు. కూటమి సర్కార్‌ మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని.. 8 నెలల పాటు బడ్జెట్‌ పెట్టకుండా ఎందుకు సాగదీశారంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌హన్‌రెడ్డి మండిపడ్డారు.

Advertisement

Actress Sri Reddy: ఈ సారి శ్రీరెడ్డి వంతు..క్షమాపణలు చెప్పినా వదిలేది లేదు, అరెస్ట్ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకురాలు మజ్జి పద్మ

Hazarath Reddy

సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ మరియు ఇతర టిడిపి జనసేన నాయకులు పై శ్రీ రెడ్డి అసభ్యకరమైన పోస్టులు పెట్టినందుకు గాను ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

Ram Gopal Varma: పవన్ కల్యాణ్, నారా లోకేశ్ పై అభ్యంతరకర పోస్టులు, రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

Hazarath Reddy

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. నేడు హైదరాబాద్ వెళ్లిన ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు... హైదరాబాదులోని రామ్ గోపాల్ వర్మ నివాసంలో నోటీసులు అందించారు.

Telangana: హైదరాబాద్ అబిడ్స్‌లో ఘరానా చోరి, కత్తితో బెదిరించి మొబైల్ ఫోన్‌లు ఎత్తుకెళ్లిన ఇద్దరు మైనర్లు...సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్న పోలీసులు

Arun Charagonda

హైదరాబాద్ అబిడ్స్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో గన్ ఫౌండ్రిలోని ప్రసాద్ అపార్ట్ మెంట్ వద్ద వాచ్ మెన్‌ను కత్తితో బెదిరించి మొబైల్ ఫోన్‌ను ఎత్తుకెళ్లారు మెనర్లు. అక్కడి నుండి వెళ్లి వాకింగ్ చేస్తున్న న్యాయవాది కళ్యాణ్‌ వద్ద ఉన్న సాంసంగ్ ఫోన్ కోసం కత్తితో బెదిరించారు. సీసీ టీవీ కెమెరాలో దృశ్యాలు రికార్డు కాగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Tirupathi Reddy On Lagacherla Incident: ఫార్మాసిటీ విషయంలో వెనక్కి తగ్గేది లేదు..లగచర్ల దాడి వెనుక ఎవరున్న వదిలిపెట్టమన్న సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి, కలెక్టర్ ప్రతీక్‌ జైన్‌తో భేటీ

Arun Charagonda

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో అధికారులపై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్ - కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి.

Advertisement

Hydra: మళ్లీ మొదలైన హైడ్రా కూల్చివేతలు, రాంపల్లిలో మెయిన్ రోడ్డు పక్కన ఉన్న నిర్మాణాలను తొలగిస్తున్న హైడ్రా అధికారులు...వీడియో ఇదిగో

Arun Charagonda

తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. మేడ్చల్ - నాగారం మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా రెండు టీమ్స్ గా ఏర్పాటై కూల్చివేతలు చేపట్టారు అధికారులు. రాంపల్లి సమీపంలో రాజ్ సుఖ్ నగర్ కాలనీలో మెయిన్ రోడ్డు పక్కన ఉన్న నిర్మాణాలను హైడ్రా అధికారులు జేసిబి సహాయంతో కూల్చివేస్తున్నారు

Nara Lokesh on DSC: ఏపీలో త్వరలో 595 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్, అసెంబ్లీ వేదికగా నారాలోకేష్ కీలక వ్యాఖ్యలు, 5 ఏళ్లలో 20లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని వెల్లడి

Hazarath Reddy

ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ అసెంబ్లీలో డీఎస్సీపై కీలక ప్రకటన చేశారు. 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు పోస్టింగ్స్ విషయమై బిజెపి శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ పలు విషయాలను వెల్లడించారు.

Telangana: వీడియో ఇదిగో, పొలంలోకి వెళ్లేందుకు రైతులు అవస్థలు, వాగు దాటడానికి పైప్‌నే బ్రిడ్జిగా వాడుతున్న గ్రామంలోని అన్నదాతలు

Hazarath Reddy

నిర్మల్ - కుంటాల పరిధి కల్లూరు-పాత బూరుగుపల్లి గ్రామాల మధ్య సుద్దవాగుపై ఉన్న వంతెన గతంలో కురిసిన భారీ వర్షాలకు కూలిపోయింది. వాగుకు అవతలి వైపు ఉన్న తమ పొలాల వద్దకు వెళ్లేందుకు ప్రస్తుతం పైపే బ్రిడ్జిగా మారిందని రైతులు వాపోతున్నారు.

Kodangal Lagacherla Incident: ఏ1గా బోగమోని సురేష్, లగిచర్ల ఘటనపై పోలీసుల రిమాండ్ రిపోర్ట్, పథకం ప్రకారమే దాడి చేశారని వెల్లడి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్, ఎంపీ డీకే అరుణను అడ్డుకున్న పోలీసులు

Arun Charagonda

ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై లగచర్ల గ్రామస్థులు దాడికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కలెక్టర్, అధికారులపై దాడి వెనుక కుట్ర కోణం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఐజి నారాయణ‌ రెడ్డి.

Advertisement
Advertisement