రాష్ట్రీయం

Rain Alert: తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఏపీలోని ప‌లు జిల్లాల్లో పిడుగులు ప‌డే అవ‌కాశ‌ముంద‌ని ఐఎండీ హెచ్చ‌రిక‌, ఏయే జిల్లాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న ఉందంటే?

VNS

శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులు (Thunder Storms) పడే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన వర్షం పడేసమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కుర్మనాథ్ సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.

Telangana Shocker: దారుణం, హస్త ప్రయోగం చేసుకుని ఆ వీర్యాన్ని ఐస్ క్రీంలో పెట్టి అమ్ముతున్న వ్యాపారి, వైరల్ వీడియో ఇదిగో..

Hazarath Reddy

సోషల్ మీడియాలో షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఐస్ క్రీంలో వీర్యం కలుపుతున్నాడు. రోడ్డు పక్కన ఐస్ క్రీం బండి పెట్టుకుని అమ్ముకుంటున్న ఓ యువకుడు బండి ముందు హస్త ప్రయోగం చేసి ఆ వీర్యాన్ని ఐస్ క్రీంలో కలపడం వీడియోలో చూడవచ్చు. వరంగల్ - నెక్కొండలో రోడ్డుపై ఈ దారుణం జరిగినట్లుగా తెలుస్తోంది.

Andhra Pradesh Elections 2024: నన్ను ప్రధాని మోదీ ఎంపీగా పోటీ చేయమంటే కాకినాడకు వెళతా, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ ఖరారు

Hazarath Reddy

టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు రెండు పార్లమెంట్‌, 21 అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకినాడ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ప్రకటించారు.

Fake Female Police Officer Arrested: ఏడాది పాటు నకిలీ ఐడీ కార్డుతో ఆర్పీఎఫ్‌ ఎస్‌ఐగా చెలామణి, చివరకు పెళ్లి చూపులకు యూనిఫారంతో వెళ్లి బుక్కయిన యువతి, అబ్బాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కటకటాల్లోకి..

Hazarath Reddy

ఏడాది కాలంగా నకిలీ ఆర్పీఎఫ్ ఎస్‌ఐగా(Fake RPF SI) చెలామణి అవుతున్న యువతిని సికింద్రాబాద్‌ (Secunderabad)పోలీసులు అరెస్ట్‌ చేశారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన యువతి మాళవిక నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. 2018లో అర్.పి.ఎఫ్ ఎస్ఐ పరీక్ష రాసి దాదాపు అన్ని అర్హతలు సాధించింది.

Advertisement

Ustaad Bhagat Singh: గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం.. ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్‌తో ప్రత్యర్థులను టీజ్ చేసి పవన్ కళ్యాణ్, వీడియో చిన్నదే అయినా, ఇంపాక్ట్ పెద్దగానే ఉంది!

Vikas M

Skill Development Scam Case: చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ ఏప్రిల్‌ 16వ తేదీకి వాయిదా, పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని తెలిపిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

సుప్రీంకోర్టులో స్కిల్‌ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ ఏప్రిల్‌ 16వ తేదీకి వాయిదా పడింది. ఏప్రిల్‌ 16న ఈ పిటిషన్‌పై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్టు జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్‌ మిట్టల్‌ ధర్మాసనం స్పష్టం చేసింది.

IAF Emergency Landing Facility: అద్దంకి నేషనల్ హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన IAF ఫైటర్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

IAF ఫైటర్, ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ నిన్న ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో గల అద్దంకి సమీపంలో NH-16పై ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ELF) ఎయిర్‌స్ట్రిప్‌లో కార్యకలాపాలు నిర్వహించాయి. An32, Dornier రవాణా విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. తరువాత స్ట్రిప్ నుండి బయలుదేరింది. యాక్టివేషన్ సమయంలో Su30, హాక్ ఫైటర్‌లు ఓవర్‌షూట్‌లను విజయవంతంగా నిర్వహించాయి.

Andhra Pradesh Elections 2024: కాంగ్రెస్ పార్టీలో చేరిన నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్ షర్మిల

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి నందికొట్కూరులో షాక్ తగిలింది నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ లో చేరారు. పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement

Andhra Pradesh Weather Update: ఏపీలో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం, కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరిక

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఇక, రానున్న రెండు రోజుల్లో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అనంతరం, మళ్లీ సాధారణ ఉష్ణోగ్రతలే నమోదు కానున్నట్టు ఐఎండీ స్పష్టం చేసింది.

Maharashtra Encounter: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ఎన్‌కౌంటర్, నలుగురు మావోయిస్ట్‌ అగ్రనేతలు మృతి, కొనసాగుతున్న కూంబింగ్‌ ఆపరేషన్

Hazarath Reddy

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మంగళవారం(మార్చి 19) తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. గడ్చిరోలిలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డప్పుడు కాల్పులు ‍ జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్ట్‌ అగ్రనేతలు మృతి చెందారు.

Tamilisai Soundararajan: తెలంగాణ ప్రజలను విడిచి వెళుతూ భావోద్వేగానికి గురైన తమిళసై సౌందరరాజన్‌, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళసై సౌందరరాజన్‌ రాష్ట్రాన్ని విడిచి వెళుతూ భావోద్వేగానికి గురయ్యారు. నేను తెలంగాణ ప్రజలను విడిచిపెట్టడం చాలా బాదగా ఉంది. నాకు సపోర్టుగా నిలిచిన అందరికి ధన్యవాదాలు. మీరంతా నా సోదరులు, సోదరీమణులు, నేను మీ అందరితో టచ్ లో ఉంటాను, "నేను ఎప్పటికీ మీ సోదరినే అంటూ తమిళసై సౌందరరాజన్‌ మీడియాతో మాట్లాడారు.

C P Radhakrishnan: తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌, పూర్తిస్థాయి గవర్నర్‌ నియామకం జరిగేదాకా బాధ్యతలు చేపట్టనున్న బీజేపీ మాజీ చీఫ్‌

Hazarath Reddy

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్‌ రాజీనామా చేయగా దానిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీంతో తెలంగాణకు కొత్త గవర్నర్‌ నియామకం జరగాల్సి ఉన్న నేపథ్యంలో.. జార్ఖండ్‌ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ బాధ్యతలను అదనంగా అప్పజెప్పారు

Advertisement

Nirmal Viral News: ట్యాక్స్ కట్టలేదని ఏకంగా ఇండ్ల గేట్లు ఎత్తుకెళ్లారు.. నిర్మల్‌ లో మొండి బకాయిదారులపై మున్సిపల్‌ అధికారుల కొరడా

Rudra

ట్యాక్స్ కట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్న మొండి బకాయిదారులపై నిర్మల్‌ మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝుళిపించారు. ఇప్పటికే రెడ్‌ నోటీసులను జారీ చేసిన అధికారులు.. నిర్మల్‌ పట్టణంలోని ప్రియదర్శినినగర్‌ కాలనీ, గాజుల్‌ పేట కాలనీల్లో సోమవారం పన్నుల వసూలుకు వెళ్లారు.

Break for Prajavani: తెలంగాణలో 'ప్రజావాణి'కి బ్రేక్.. లోక్ సభ ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడు మొదలవుతుందంటే??

Rudra

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ కారణంగా ప్రజావాణి కార్యక్రమానికి బ్రేక్ పడింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌ లోని ప్రజాభవన్‌ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Andhra Pradesh Elections 2024: సీఎం జగన్ పై అభ్యంతరకర పోస్టులు, చంద్రబాబుకి నోటీసులు జారీ చేసిన ఈసీ, 24 గంటల్లోగా పోస్టులు తొలగించాలని ఆదేశాలు

Hazarath Reddy

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు పెడుతూ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకీ ఫిర్యాదు చేశారు

Telangana Water Crisis: వీడియో ఇదిగో, కేసీఆర్ ఇంటికి తప్పని తాగు నీటి కష్టాలు, వాటర్ ట్యాంకర్లు తెప్పించిన స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి కూడా తాగు నీటి కష్టాలు తప్పడం లేదు.. హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో నీటి సమస్య ఉండడంతో.. స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వాటర్ ట్యాంకర్ తెప్పించారు.

Advertisement

Telangana Elections 2024: రూ. 50 వేలు నగదు ఉంటే పేపర్లు తప్పనిసరి, రానున్న ఎన్నికలపై కీలక సూచనలు చేసిన తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌

Hazarath Reddy

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఎన్నికకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ తెలిపారు. వచ్చే ఎన్నికల కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

Delhi Liquor Policy Case: కవిత అరెస్టుపై కీలక ప్రకటన చేసిన ఈడీ, ఆమ్‌ ఆద్మీ పార్టీకి రూ. 100 కోట్లు చెల్లించారని వెల్లడి, వచ్చిన డబ్బును వాటాలుగా పంచుకున్నారని తెలిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరేక్టరేట్‌

Hazarath Reddy

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరేక్టరేట్‌ (ఈడీ) ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ నెల15న కవితను అరెస్ట్‌ చేసినట్లు ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చిందని పేర్కొంది. ఈ నెల 23 తేదీ వరకు కవిత కస్టడికి తీసుకున్నట్లు తెలిపింది.

Telangana Elections 2024: అమల్లోకి ఎన్నికల కోడ్, మిర్యాలగూడలో రూ.5.73 కోట్ల విలువైన బంగారం పట్టివేత, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నల్గొండ జిల్లా ఈదులగూడ చౌరస్తా వద్ద పోలీసులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మిర్యాలగూడ నుంచి కోదాడ వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో రూ.5.73 కోట్ల విలువ చేసే బంగారాన్ని గుర్తించారు

Telangana: మల్లారెడ్డి కాలేజీలో తీవ్ర ఉద్రిక్తత, 60 మంది విద్యార్థులను డిటైన్ చేయడంతో ధర్నాకు దిగిన విద్యార్థులు, కాలేజీ ఫర్నిచర్ ధ్వంసం

Hazarath Reddy

మేడ్చల్ మండలం మైసమ్మ గూడ లోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనకు దిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల చదువు విషయంలో కనీస రూల్స్ పాటించకుండా,అశ్రద్ద వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement