ఆంధ్ర ప్రదేశ్

Viveka Murder Case: వివేకా హత్య కేసు, అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు, కస్టడీ విచారణ అవసరం లేదని స్పష్టం

Hazarath Reddy

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.

Tiger Cub Dies in Tirupati: వరుసగా చనిపోతున్న పులి పిల్లలు, తాజాగా తిరుపతి జూ పార్కులో మరో నంద్యాల పులి కూన మృతి

Hazarath Reddy

తిరుపతి నగరంలోని ఎస్వీ జూపార్క్ లో మరో పులికూన మృతి చెందింది. రెండు రోజుల కిందట అది చనిపోయిందని జూ నిర్వాహకులు ప్రకటించారు. రెండు నెలలు క్రితం నంద్యాల జిల్లా అటవీ ప్రాంతం నుంచి తల్లికి దూరమైన 4 పులి పిల్లలు ఇక్కడికి తరలించిన సంగతి తెలిసిందే

Visakhapatnam Shocker: విశాఖపట్నంలో దారుణం, లాడ్జిలో మత్తు ఇంజక్షన్లు, యువతి అనుమానాస్పద మృతి, యువకుడికి గాయాలు

Hazarath Reddy

అనకాపల్లి జిల్లా అచ్యుతపురంలో ఓ లాడ్జిలో మహాలక్ష్మి అనే యువతి అనుమానాస్పద మృతి చెందడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాల బట్టి మృతురాలి శరీరంపై పలు చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి.

Andhra Pradesh: నిర్మల్‌ హృదయ్‌ని సందర్శించిన జగన్-భారతి దంపతులు, హోమ్‌ ఫర్‌ సిక్‌ అండ్‌ డైయింగ్‌ డెస్టిట్యూట్స్‌ భవనాన్ని ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ను సందర్శించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్, శ్రీమతి భారతి దంపతులు. నిర్మల్‌ హృదయ్‌లో నూతనంగా నిర్మించిన హోమ్‌ ఫర్‌ సిక్‌ అండ్‌ డైయింగ్‌ డెస్టిట్యూట్స్‌ భవనాన్ని ప్రారంభించిన సీఎం.

Advertisement

YSRCP on Ambati Rayudu: అంబటి రాయుడు కొత్త జర్నీ అటేనా, ఆల్ ది బెస్ట్ అంటూ ప్రత్యేకంగా ప్రస్తావించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

చెన్నై సూపర్ కింగ్స్ సాధించిన ఈ విజయం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఆ జట్టుకు అభినందనలు తెలియజేసింది. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పారటీ చీఫ్ వీ విజయసాయి రెడ్డి కొద్దిసేపటి కిందటే ట్వీట్ పోస్ట్ చేశారు. చివరి బంతి వరకు ఉత్కంఠతను రేకెత్తించిన ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కూడా అద్భుతంగా పోరాడాయని అన్నారు. ఈ

AP Cabinet Meeting: జూన్‌ 7న ఏపీ కేబినెట్‌ సమావేశం, ప్రతిపాదనలు రెడీ చేసుకోవాలని కేబినెట్‌ విభాగంకు ఆదేశాలు జారీ చేసిన సీఎస్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి

Hazarath Reddy

సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని రాష్ట్ర మంత్రివర్గ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు జరిగే కేబినెట్‌ సమావేశానికి తీసుకెళ్లా­ల్సిన ప్రతిపాదనలను జూన్‌ 5వ తేదీ మధ్యాహ్నంలోగా సాధారణ పరిపాలనశాఖ (కేబినెట్‌ విభాగం)కు పంపాలని సీఎస్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి సోమవారం అన్ని శాఖలను ఆదేశించారు.

Andhra Pradesh: కొడుకులు ఆస్తి కోసం గొడవ చేస్తారని భయం, చనిపోయిన భర్తకు ఇంట్లోనే అట్టపెట్టెలతో దహన సంస్కారాలు చేసిన భార్య, కర్నూలు జిల్లాలో షాకింగ్ ఘటన

Hazarath Reddy

ఏపీలో క‌ర్నూల్ జిల్లా ప‌త్తికొండ‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన భర్తకు ఇంట్లోనే భార్య దహన సంస్కారాలు నిర్వహించింది. పత్తికొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప‌త్తికొండ‌కు చెందిన హ‌రిప్ర‌సాద్(60) త‌న భార్య ల‌లిత‌తో క‌లిసి ఉంటున్నాడు.

Vijayasai Reddy on TDP Manifesto: టీడీపీ మేనిఫెస్టోపై విజయసాయి రెడ్డి వ్యంగ్య వ్యాఖ్యలు, మాయా ఫెస్టోలో ఎవరు పడతారంటూ ట్వీట్

Hazarath Reddy

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ వేశారు. అమలుచేయమంటారేమోనని అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మేనిఫెస్టోనే మాయం చేసినవారు ... ఇప్పుడు అల్ ఫ్రీ హామీలతో మేనిఫెస్టో ప్రకటించారు. ఈ 'మాయా'ఫెస్టోలో ఎవరు పడతారంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Andhra Pradesh Shocker: పని ఒత్తిడి తట్టుకోలేక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉరివేసుకుని ఆత్మహత్య, కర్నూలు జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

కర్నూలుజిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని బొమ్మనపల్లి గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పురిమెట్ల సాయిప్రసాద్‌ (25) ఆదివారం పని ఒత్తిడి తట్టుకోలేక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

CM Jagan Meets HM Amit Shah: తెలుగు రాష్ట్రాల మధ్య విభ­జన సమస్యలు వెంటనే పరిష్కరించండి, హోం మంత్రి అమిత్‌ షా‌తో భేటీలో సీఎం జగన్

Hazarath Reddy

సీఎం మూడు రోజుల జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. తాజా పర్యటనలో తెలుగు రాష్ట్రాల మధ్య విభ­జన సమస్యలు పరిష్కరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు.

GSLV-F12 Satellite Launches Video: నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-12, ప్రయోగం సక్సెస్ అయితే పూర్తి స్థాయి స్వదేశీ నావిగేషన్‌ వ్యవస్థ అందుబాటులోకి

Hazarath Reddy

శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం ఇస్రో నుంచి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-12 నింగిలోకి దూసుకెళ్లింది. సోమవారం ఇస్రో నిర్వహించిన ఈ ప్రయోగం.. ఉదయం కౌంట్‌ డౌన్‌ ప్రకారం రాకెట్‌ ప్రయోగం జరిగింది. జీఎస్‌ఎల్‌వీఎఫ్‌-12 ద్వారా.. ఎన్‌వీఎస్‌-01(navigation satellite) ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రయోగించారు. ఈ ప్రయోగం సక్సెస్‌ అయితే గనుక.. పూర్తి స్థాయి స్వదేశీ నావిగేషన్‌ వ్యవస్థ అందుబాటులోకి రానుంది.

Accident in Prakasam: ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. కారు, ఆర్టీసీ బస్సు ఢీకొని నలుగురు మృతి

Rudra

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు మరణించారు. ముగ్గురు ప్రమాద స్థలంలోనే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ముగ్గురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Advertisement

TDP Elections Manifesto: మహిళలకు నెలకు రూ. 1500, నిరుద్యోగులకు రూ.2500, ఎన్నికల మేనిఫెస్టోలో వరాలు కురిపించిన చంద్రబాబు, అన్ని వర్గాలను ఆకట్టుకునేలా పథకాల ప్రకటన

VNS

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజమండ్రిలో రెండు రోజుల పాటూ నిర్వహించిన మహానాడులో భవిష్యత్తుకు గ్యారెంటీ పేరిట ఏపీ ఎన్నికల టీడీపీ మేనిఫెస్టో (Tdp Ap Elections Manifesto) ప్రకటించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు

Heat Waves in AP: నేడు, రేపు ఏపీలో వడగాడ్పులు.. రాష్ట్రంలో భానుడి భగభగలు, 44 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రత

Rudra

సూర్యుడి ప్రతాపానికి ఆంధ్రప్రదేశ్ వాసులు అల్లాడుతున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలను మించిపోయాయి. ఆదివారం 73 మండలాల్లో, సోమవారం12 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

Balakrishna, Jr NTR Pays Tribute to Sr. NTR: ఎన్టీఆర్‌కు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఘన నివాళి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన కొడుకు, మనవడు

Rudra

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఆయన తనయుడు బాలకృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించారు.

YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట, తీర్పు ప్రకటించే వరకు ఆరెస్ట్ చెయ్యొద్దని హైకోర్టు ఆదేశం

kanha

అవినాష్ రెడ్డికి హైకోర్టులో ఊరట తీర్పు ప్రకటించే వరకు ఆరెస్ట్ చెయ్యొద్దని హైకోర్టు ఆదేశం. బుధవారం తీర్పు ప్రకటిస్తామన్నా హైకోర్టు. అప్పటి వరకు అవినాష్ రెడ్డిని ఆరెస్ట్ చెయ్యొద్దని మధ్యతంర ఉత్తర్వులు జారీ.

Advertisement

Yoga Mahotsav: సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ‘యోగా మహోత్సవ్’.. వీడియో ఇదిగో..

Rudra

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (జూన్‌ 21) పురస్కరించుకొని 25 రోజుల కౌంట్ డౌన్‌తో సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ లో ‘యోగా మహోత్సవ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వచ్చారు. కిషన్‌ రెడ్డి సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. వీడియో ఇదిగో..

Long Covid 12 key Symptoms: మీలో ఈ 12 లక్షణాలుంటే లాంగ్ కొవిడ్ వేధిస్తున్నట్టే.. ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత లాంగ్ కొవిడ్ లక్షణాలు పైపైకి.. ఆ లక్షణాలు ఏంటంటే??

Rudra

ప్రపంచాన్ని భయం గుప్పిట్లోకి నెట్టిన కరోనా మహమ్మారి ఇంకా వేధిస్తూనే ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత కరోనా బాధితుల్లో ప్రతి పదిమందిలో ఒకరు లాంగ్ కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్టు అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది.

Telugu States Weather Update: నేటి నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో ఎండలే ఎండలు.. గరిష్ఠంగా 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం.. అటు ఏపీలోనూ వడగాల్పులు

Rudra

మొన్నటివరకూ అకాల వర్షాలతో అతలాకుతలమైన తెలంగాణలో నేటి నుంచి సోమవారం వరకు ఎండలు మండిపోనున్నాయి. ఈ మూడు రోజులు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ తెలిపింది. అత్యధికంగా 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో సీఎం వైఎస్ జగన్ పేరు, జగన్‌కు ముందే తెలుసని దర్యాప్తులో తేలినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్న సీబీఐ

Hazarath Reddy

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి అనుబంధ కౌంటర్‌లో సీబీఐ కీలక విషయం ప్రస్తావించింది. వివేకా మృతి విషయం జగన్‌కు ఉదయం 6.15 గంటలకు ముందే తెలిసినట్టు దర్యాప్తులో తేలిందని సీబీఐ పేర్కొంది.

Advertisement
Advertisement