ఆంధ్ర ప్రదేశ్
RBI Restrictions On 5 Co-Operative Banks: ఐదు కో-ఆపరేటివ్ బ్యాంకులపై ఆర్బీఐ ఆంక్షల కొరడా.. నగదు ఉపసంహరణ, రుణాల మంజూరుపై ఆంక్షలు.. ఆ బ్యాంకుల జాబితా ఏంటంటే?
Rudraనగదు ఉపసంహరణ, రుణాల మంజూరుకు సంబంధించి ఐదు కో-ఆపరేటివ్ బ్యాంకులపై ఆర్బీఐ ఆంక్షల కొరడా ఝుళిపించింది. బ్యాంకుల ఆర్ధిక స్థితిగతులు సరిగ్గా లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే ఆరు నెలల పాటు ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించింది.
Investments In AP: పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఏపీ శ్రామికశక్తి.. జనాభాలో 70 శాతం మంది వర్కింగ్ పాపులేషనే..
Rudraపెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ మారుతున్నది. రాష్ట్రంలో మొత్తం 8.5 కోట్లమంది జనాభా ఉంది. ఈ మొత్తం జనాభాలో 70 శాతం మంది పెనిచేసేవారుగా ఉండటం ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయి.
US Student Visa: కోర్సు ప్రారంభానికి ఏడాది ముందే వీసాకు దరఖాస్తు.. విద్యార్థులకు ఉపయోగకరంగా అమెరికా నూతన వీసా విధానం
Rudraఅమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులకు శుభవార్త. అమెరికాలో కోర్సు ప్రారంభానికి ఏడాది ముందే స్టూడెంట్ వీసాకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును అమెరికా కల్పించింది.
Honour Killing In Nandyala: కుమార్తె అత్తింటికి వెళ్ళట్లేదని కన్నతండ్రి ఘాతుకం.. బిడ్డను హత్య చేసి తల, మొండెం వేర్వేరు.. నంద్యాలలో ‘పరువు’ హత్య
Rudraకుమార్తె అత్తింటికి వెళ్ళట్లేదని, దీంతో ఇరుగు పొరుగు వారి ముందు తన పరువు పోతుందని ఓ తండ్రి క్రూరమైన ఆలోచన చేశాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డను చంపి ముక్కలు చేశాడు.
Andhra Pradesh: ఎండాకాలంలో కరెంటు కోతలు అనే మాట వినపడకూడదు, అన్ని రకాలుగా సిద్ధం కావాలని అధికారులకు సీఎం జగన్ సూచన, ఇంధనశాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి
Hazarath Reddyవేసవిలో విద్యుత్‌ కొరత అనేది ఉండకూడదని ఏపీ ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు. విద్యుత్‌ కొరత కారణంగా కరెంటు కోతలు అనే సమస్య ఉత్పన్నం కాకూడదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులు అన్ని రకాలుగా సిద్ధం కావాలని సూచించారు.
Lokesh Yuvagalam Padayatra: జూనియర్ ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రావాలి, పాదయాత్రలో నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు, 2014లోనే తాను పవన్ కల్యాణ్‌లో మంచి మనసును చూశానని వెల్లడి
Hazarath Reddyటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర (Lokesh YuvaGalam Padayatra) తిరుపతి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ విరుచుకుపడ్డారు.
Anakapalli Road Accident: అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనక నుంచి వేగంగా ఢీ కొట్టిన లారీ, 20 మందికి గాయాలు, ఒకరు మృతి
Hazarath Reddyఏపీలో అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Anakapalli Road Accident:) చోటు చేసుకుంది. జిల్లాలోని ఎత్రాయిపల్లి మండలం ధర్మవరం వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనక నుంచి లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 మందికి పైగా గాయాలు అయ్యాయి.
Viveka Murder Case: వివేకానందరెడ్డి హత్య కేసు, ముగిసిన అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ, తనకు తెలిసిన వాస్తవాలే సీబీఐకి చెప్పానని తెలిపిన కడప ఎంపీ
Hazarath Reddyమాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Murder Case) దర్యాప్తులో భాగంగా కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ ( MP Avinash Reddy concluded) ముగిసింది. ఇటీవల అవినాశ్ రెడ్డిని విచారించిన సీబీఐ నేడు మరోసారి సుదీర్ఘంగా 4.30 గంటల పాటు ప్రశ్నించింది.
CID Raids: మాజీ మంత్రి నారాయణ కూతురు ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు, పలు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో తనిఖీలు చేపట్టిన అధికారులు
Hazarath Reddyమాజీ మంత్రి నారాయణ (Former Minster Narayana) కుమార్తె నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు (AP CID Raids) నిర్వహిస్తోంది. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్‌పల్లిలోని ఇళ్లలో అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. సీఐడీ అధికారులు పలు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.
Viveka Murder Case: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు, సీబీఐ ఆఫీసులో ప్రత్యక్షమైన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, విచారించనున్న సీబీఐ అధికారులు
Hazarath Reddyహైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో విచారణ నిమిత్తం వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సీబీఐ కార్యాలయానికి వచ్చారు.సీబీఐ ఆయన్ని నేడు విచారణ చేయనుంది.
Abdul Nazeer Sworn: ఏపీ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణ స్వీకారం,హాజరయిన సీఎం జగన్, మంత్రులు, న్యాయమూర్తులు
Hazarath Reddyఏపీ కొత్త గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు, మంత్రులు, న్యాయమూర్తులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం రాజ్‌భవన్‌లో హై టీ కార్యక్రమం నిర్వహించారు.
Why Should Invest In AP: పెట్టుబడులకు స్వర్గధామంగా ఏపీ.. పారిశ్రామికాభివృద్ధికి ఎన్నో అవకాశాలు.. ఏయే రంగాల్లో పెట్టుబడులకు ఏపీ అనువైన ప్రాంతమంటే??
Rudraపెట్టుబడులకు స్వర్గధామంగా ఏపీ నిలుస్తున్నది. గడిచిన మూడేండ్లలో ఇప్పటికే రాష్ట్రంలో రూ. 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో మారిన్ని పెట్టుబడుల కోసం వచ్చే నెల 3, 4 తేదీల్లో ఏపీ ఆర్ధిక రాజధాని విశాఖపట్నంలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు కు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Global Investor Summit In AP: గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు ఏపీ ముస్తాబు.. విశాఖలో విస్తృత ఏర్పాట్లు
Rudraవచ్చే నెల 3, 4 తేదీల్లో ఏపీ ఆర్ధిక రాజధాని విశాఖపట్నంలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు కు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు సీఎస్ జవహార్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీగ్రౌండ్స్‌ లో జరిగే సదస్సు నిర్వహణపై ఇటీవల ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
Tirumala Tickets: శ్రీవారి భక్తులకు శుభవార్త.. మార్చి నెల రూ. 300 టికెట్ల ఆన్‌లైన్ కోటా ఈ ఉదయం 10 గంటలకు విడుదల.. నేటి సాయంత్రం శ్రీవారి వర్చువల్ సేవా టికెట్లు
Rudraతిరుమల వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నేడు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
TTD: తిరుమల వెళ్లే వారికి అలర్ట్, మార్చి నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు రేపు విడుదల, ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోండి
Hazarath Reddyశ్రీవారి భక్తుల సౌకర్యార్థం మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ( March 2023 Tirumala Rs 300 Special Darshan Quota) శుక్రవారం ఉదయం 10 గంటలకు టీటీడీ(Ttd) ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
Kanna Lakshmi Narayana: ఏపీలో జగన్ రాక్షస పాలన పోవాలి, అమరావతే రాజధాని కావాలి, ఈ రెండు కారణాలతోనే టీడీపీలో చేరానని తెలిపిన కన్నా లక్ష్మీ నారాయణ
Hazarath Reddyఏపీ మాజీ మంత్రి,మాజీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshmi Narayana) ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. తన వెంట భారీ సంఖ్యలో నేతలను, కార్యకర్తలను కూడా ఆయన టీడీపీలోకి తీసుకువచ్చారు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కన్నా ప్రసంగించారు.
Kanna Joins TDP: వీడియో ఇదిగో..టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీ నారాయణ, జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి
Hazarath Reddyఏపీ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. తన వెంట భారీ సంఖ్యలో నేతలను, కార్యకర్తలను కూడా ఆయన టీడీపీలోకి తీసుకువచ్చారు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.
Video: మనవరాలితో జలవిహారం చేస్తున్న రఘువీరా రెడ్డి, సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేసిన కాంగ్రెస్ మాజీ చీఫ్
Hazarath Reddyరఘువీరా రెడ్డి సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ ఆసక్తికర వీడియోలు పంచుకుంటూ అభిమానులను పలకరిస్తుంటారు. తాజాగా, తన మనవరాలితో కలిసి ఓ ఫైబర్ డింగీలో జలవిహారం చేస్తున్న వీడియోను షేర్ చేశారు. తమ స్వగ్రామం నీలకంఠాపురం వద్ద ఓ జలాశయంలో మనవరాలితో కలిసి సరదాగా గడిపినట్టు రఘువీరా ట్వీట్ చేశారు.
YCP MLAs Press Meet in Eluru: ప్రతి ఎన్నికలకూ కొత్త ముసుగుతో చంద్రబాబు, మండిపడిన ఏలూరు జిల్లా వైసీసీ ఎమ్మెల్యేలు, మూడున్నరేళ్లలో జగన్ ఏం చేశారో తెలుసుకోవాలని హితవు
Hazarath Reddyచంద్రబాబు ప్ర‌తి ఎన్నిక‌ల‌కు కొత్త ముసుగుతో వ‌స్తారని, ఈసారి చంద్రబాబును ప్ర‌జ‌లే తిప్పి కొట్టారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అన్నారు. ఏలూరులో గురువారం మీడియాతో మాట్లాడిన వారు చంద్రబాబు తన హయాంలో ఏలూరును అభివృద్ధి చేయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.
Andhra Pradesh: కొత్త గవర్నర్‌కు గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికిన సీఎం జగన్, ఫిబ్రవరి 24వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌‌
Hazarath Reddyగన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆంధ్రప్రదేశ్‌ కొత్త గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌‌కు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వాగతం పలికారు. అక్కడ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ పోలీసు గౌరవవందనం స్వీకరించారు. ఫిబ్రవరి 24వ తేదీన ఏపీ కొత్త గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ బాధ్యతలు స్వీకరిస్తారు